India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ MP మందా జగన్నాథ్ కాంగ్రెస్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది. BSP అధినేత్రి మాయావతిని దిల్లీలో రేపు కలవనున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ MP బరిలో ఉంటారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించిందని, KCR కంటే రేవంత్ రెడ్డి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణ చేస్తున్నట్లు తెలుస్తుంది. నెలలుగా CMతో మాట్లాడేలా ప్రయత్నిస్తే EX MLA సంపత్ కుమార్ దూరం పెట్టారని సమాచారం.
వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్‌గా ఉమా హారతిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్‌గా ఉమా హారతి, IAS, 2022-23 వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిపాలనపై పట్టు సాధించి భవిష్యత్తులో ప్రజలకు ఉన్నత సేవలు అందించి మంచి పేరు సంపాదించేలా కృషి చేస్తానని ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి అన్నారు.
భారతదేశంలో మొట్ట మొదటి ప్యాసింజర్ ట్రైన్ 16 ఏప్రిల్ 1853న బాంబే నుంచి థానే వరకు వెళ్లేందుకు ప్రారంభమైనట్లు HYD సికింద్రాబాద్ SCR అధికారులు X వేదికగా తెలిపారు. 171 ఏళ్ల సర్వీస్ అందించిన ట్రైన్ తీపి జ్ఞాపకాలు కోట్లాదిమంది గుండెల్లో చోటు సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. రవాణా చరిత్రలోనే ఇదొక మైలురాయిగా అభివర్ణించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని స్పెషలైజేషన్ల ఎంఫార్మసీ(సీబీసీఎస్) సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
అర్ధరాత్రులు రోడ్లపై సంచరిస్తూ ఒంటరిగా ఉన్న వారిని బెదిరించి డబ్బు, నగలు దోచుకుంటున్న ఐదుగురిని లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ఛార్జి CI రమేశ్ మాట్లాడుతూ.. మల్కాజిగిరిలోని BJR నగర్‌కు చెందిన మహ్మద్ తౌసిఫ్ లియాస్ గోడా(19), నలుగురు మైనర్ స్నేహితులతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్, చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డిలు పోలీసులను అభినందించారు.
రేపటి శ్రీ రామనవమి వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. రాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. మంగళవారం శోభాయాత్ర ముగింపు ప్రాంగణమైన సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలను ఆయన సందర్శించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో యాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.
బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగోల్‌లో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్ PS పరిధికి చెందిన రాకేశ్ (29) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా ఓ బాలిక(13)తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఎండలు దంచికొడుతున్న వేళ TSRTC కీలక నిర్ణయం తీసుకొంది. మధ్యాహ్నం HYDలో బస్సు సర్వీసుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు RTC గ్రేటర్ జోన్ ED వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఎండల ప్రభావానికి ప్రయాణికులు రోడ్డెక్కడం లేదని గుర్తించామన్నారు. ఈ సమయంలో ట్రిప్పులను తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 5 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వీసులు ఉంటాయని.. 12PM నుంచి 4PM మధ్యలో పరిమితంగా బస్సులను నడపనున్నారు.SHARE IT
హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. బల్దియా అధికారులు ఎర్లీబర్డ్ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును చెల్లిస్తే 5 శాతం రిబేట్ పొందవచ్చని కమిషనర్ రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. GHMC పరిధి ప్రజలు సద్వినియోగం చేసుకోండి.
SHARE IT
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. వేసవి వేళ మంచినీటి వసతిని SCR అధికారులు మెరుగుపరిచారు. సాధారణ తాగునీటితో పాటుగా, కూల్ వాటర్‌ను రూ.5కే అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కూలర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 170 స్టేషన్లలో 468 వాటర్ కూలర్లను అందబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.