Karimnagar

News July 25, 2024

ఈ నెల27న ఇంటర్ స్పాట్ ఆడ్మిషన్ కౌన్సిలింగ్

image

ఉమ్మడి కరీంనగర్ సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ నెల 27న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ దేవేందర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి, మంథని, గొల్లపల్లి, మేడిపల్లి, కోరుట్ల, ముస్తాబాద్, బోయిన్ పల్లి, జమ్మికుంట, బాలుర కళాశాలలో అడ్మిషన్ల కౌన్సిలింగ్‌కు సుల్తానాబాద్ శాస్త్రినగర్‌లో ఉన్న గురుకుల కళాశాల వద్ద ఉ.9 గంటలకు హాజరుకావాలని కోరారు.

News July 25, 2024

KNR: ఆగస్టు 1 నుంచి బీపీఈడీ పరీక్షలు

image

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే బీపీఈడీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 1 నుంచి, రెండో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 2 నుంచి ప్రారంభమవనున్నాయి. యూనివర్సిటీ కామర్స్, బిజినెస్ బ్రాంచ్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు SU పరీక్షల నియంత్రణాధికారి డా. శ్రీరంగప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

News July 25, 2024

మెట్పల్లి: ఒక్క రోజే నాలుగు డెంగ్యూ కేసులు

image

మెట్పల్లి పట్టణంలో ఒక్క రోజే నలుగురికి డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. వారికి మెట్పల్లి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ టి.మోహన్‌తో కలిసి డిప్యూటీ డీఎంహెచ్వో పేషెంట్ల ఇళ్లకు వెళ్లి శానిటేషన్ చేయించారు. ఇద్దరి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

News July 25, 2024

కరీంనగర్: బాలికపై అత్యాచారం.. ఇద్దరికి జీవిత ఖైదు

image

ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వెంకటేశ్ తీర్పు చెప్పారు. కరీంనగర్ పట్టణంలో ఉంటున్న భార్యాభర్తలకు తొమ్మిదేళ్ల కుమార్తె 2020 FEB 24ర ఆడుకుంటుండగా ఇంలల్లి సమీపంలో ఉన్న నరేశ్, రవితేజ బాలిక ఓంటరిగా కనిపించడంతో అత్యాచారం చేసి చంపుతానని బెదిరించారు. మరుసటి రోజు కూడా బాలికపై అత్యాచారం చేయడంతో అస్వస్థతకు గురైంది, ఈక్రమంలో రక్త పరీక్షలు చేయగా విషయం తెలిసింది. కైసు నమోదైంది

News July 25, 2024

కాంగ్రెస్ తొలి బడ్జెట్.. కరీంనగర్ ఆశిస్తుందిదే..

image

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇవాళ శాసనసభలో ప్రవేశ పెడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఈ పద్దుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. సిరిసిల్ల JNTU బిల్డింగ్, గల్ఫ్ వెళ్లిన వారి సంక్షేమం , వస్త్రోత్పత్తి, ఆహార శుద్ధి పరిశ్రమ స్థాపన ప్రస్తావన ఉంటుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.

News July 25, 2024

సిరిసిల్ల: గిరిజన బిడ్డకు సీఎం ఆదేశాలతో చెక్కు అందజేత

image

జేఈఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనే నాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచింది. ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ మారడంతో సీఎం స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ ద్వారా విద్యార్థిని మధులతకు రూ.1,51,831 చెక్కును అందించారు.

News July 24, 2024

సిరిసిల్ల: పేద విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండ

image

IIT పాట్నాలో సీటు సాధించిన పేద విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. తన చదువు పూర్తయ్యే వరకు ఆర్థిక సాయం అందించాలని CMO ఆదేశాలు జారీ చేసింది. వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాలోని రాములు-సరోజ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చివరి కూతురు మధులత. అయితే ఈమె JEE మెయిన్‌లో ప్రతిభ చూపి ST కేటగిరిలో 824వ ర్యాంకు సాధించింది. వారి ఆర్థిక పరిస్థితిని కొందరు CM దృష్టికి తీసుకురాగా సాయం అందించారు.

News July 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. @ సిరిసిల్లలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు. @ మెట్‌పల్లి పట్టణంలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్. @ పెగడపల్లి మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన సిరిసిల్ల కలెక్టర్.

News July 24, 2024

ఆగస్టు 15 నాటికి రూ.50 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం: కలెక్టర్

image

ఆగస్టు 15 నాటికి ₹50 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, అర్హులను వెంటనే గుర్తించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో బుధవారం మహిళా శక్తి పథకం కింద రుణాలను మంజూరు చేయుటకు యూనియన్ బ్యాంక్ ఆర్ఎచ్ అరుణ సవితా ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్‌లు, ఎస్ఈఆర్పీ, మెప్మా బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పలువురు బ్యాంక్ అధికారులు తదితరులున్నారు.

News July 24, 2024

కరీంనగర్ : బీఈడీ పరీక్ష ఫలితాలు విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీఈడీ (ప్రథమ సెమిస్టర్) ఫలితాలను విడుదల చేసినట్లు శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డా. శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటన లో తెలిపారు. పరీక్ష ఫలితాలను www.satavahana. ac.inలో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రకటనలో పేర్కొన్నారు.