India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లారీ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లికి చెందిన గుండ్ల శ్రీనివాస్(27) సుల్తానాబాద్‌లో ఉంటున్న తన మిత్రుడి దగ్గరికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. స్థానికులు వెంటనే కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సింగరేణిలో పని చేస్తూ HDFC బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించనుందని ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి భవన్‌లో బలరాం కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ డైరెక్టర్లు, ఏరియా GMలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి చేపట్టడంతో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక ప్రయోజనం కలిగించే ఒక్క ప్రాజెక్టు గురించైనా ప్రకటన ఉంటుందని ప్రజలు భావించారు. కానీ ఈ సారి ఉమ్మడి జిల్లాపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన రాలేదు. కొత్త జిల్లాలకు నవోదయ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని ఆశించినా నిరాశే మిగిలింది. బసంత్‌నగర్ వద్ద విమానాశ్రమం ఏర్పాటుపైనా ఎలాంటి ప్రకటన లేకపోవడం నిరుత్సాహపరిచింది.
భూటాన్‌లో జరిగిన సౌత్ ఆసియన్ కరాటే ఛాంపియన్ షిప్ పైడి పాటి బాబీవర్మ (అండర్-21) 60 కిలోల కుమితే విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ పోటీలు ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగాయి. ఈ విజయంతో ఆగస్టు 23 నుంచి 25 వరకు – దీంతో బాబీ వర్మను పలువురు అభినందించారు.
ప్రభుత్వం మహిళాశక్తి కింద చేపట్టిన వివిధ కార్యక్రమాలకు లబ్ధిదారులను పకడ్బందీగా ఎంపిక చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఎలిగేడు మండలం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. మహిళా శక్తి కార్యక్రమం, స్వశక్తి మహిళా సంఘాల రుణాలు వంటి పలు అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 20వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు(80.50 టీఎంసీ) కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1068.20 అడుగుల(20.51 టీఎంసీల) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఈ సమయానికి ప్రాజెక్టులో 1079.10 అడుగుల (42.53టీఎంసీల) నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి KNR జిల్లాలోని దాదాపు చెరువులన్నీ నిండు కుండలా మారి మత్తడి పోస్తున్నాయి. ఈ క్రమంలోనే గంగాధర మం.లోని నారాయణపూర్ చెరువు జలకళను సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పైపులైన్లతో చెరువుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయా ప్రాంతాలకు సాగు నీటిని అందిస్తున్నారు. మీ గ్రామంలోని చెరువు నిండిందా? కామెంట్ చేయండి.
భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం(సరస్వతి) బ్యారేజ్, మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీలకు వరద నీరు కొనసాగుతోంది. సరస్వతి బ్యారేజీకి 16,800 క్యూసెక్కుల నీరు రాగా, అంతే స్థాయిలో 66 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీకి 8,52,240 క్యూసెక్కుల వరద నీరు రాగా.. 85 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.
GDKలో అన్న చేతిలో <<13685729>>తమ్ముడు హతమైన<<>> విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. భగత్‌సింగ్‌నగర్‌లో అద్దెకు ఉంటున్న ఓదెలుకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. అయితే పెద్ద కొడుకు అనిల్‌కు పెళ్లి కాలేదు. చిన్న కొడుకు సునిల్(35) ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అనిల్ నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం తల్లితో గొడవపడుతుండగా ఆపడానికి వెళ్లిన సునిల్‌పై కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. తండ్రికి గాయాలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. KNR నుంచి కేంద్ర మంత్రి ఉండటంతో ఈసారి కేంద్రం చూపు జిల్లావైపు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి KNRలో మీరు కేంద్రం నుంచి ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.