India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనప్పటికీ.. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడం లేదు. దీంతో రైతులు తేమ శాతం తగ్గించుకోవడం కోసం వరి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల వద్ద కాకుండా ప్రధాన రహదారుల వెంబడి వరి ధాన్యాన్ని ఆరబోస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రహదారుల వెంట ధాన్యాన్ని ఆరబెట్టకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
@ జగిత్యాల ప్రజావాణిలో 31, సిరిసిల్ల ప్రజావాణిలో 154 ఫిర్యాదులు. @ మంథని మండలంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు. @ జాబితాపూర్ లో గంగారెడ్డి కుటుంబీకులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. @ గంగుల కమలాకర్ ను పరామర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. @ మెట్పల్లి మండలంలో గల్లంతైన వైద్యుడి మృతదేహం లభ్యం. @ జగిత్యాల అడిషనల్ కలెక్టర్ రాంబాబు బదిలీ.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారంలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ భార్య సుజాత బలవన్మరణానికి పాల్పడింది. ఇది తట్టుకోలేక భర్త శంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. వీరద్దరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
ముత్తారం మండలంలోని కస్తూరిబా విద్యాలయం విద్యార్థులు నిన్న రాత్రి అస్వస్థతకు గురై, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను మంత్రి ఆదేశించారు.
కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం గంగుల కమలాకర్‌ను ధర్మపురి MLA అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించారు. కరీంనగర్‌లోని గంగుల నివాసంలో వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లక్ష్మి నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. తాటిపల్లి గ్రామానికి చెందిన జలపతి(55) నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన జలపతి తోడబుట్టిన అక్క సింక రాజవ్వ(80) తమ్ముడి మరణ వార్తను తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్ రావడంతో తమ్ముడి మృతదేహం వద్దనే కుప్పకూలి చనిపోయారు. ఇరువురి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
పలు డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేస్తోన్న తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శనివారం 39 మందిని సస్పెండ్ చేసిన అధికారులు.. వారిలో 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. డిస్మిస్ చేసిన వారిలో 17వ బెటాలియన్ సిరిసిల్లకు చెందిన ARSI సాయిరామ్, కానిస్టేబుళ్లు లక్ష్మీనారాయణ, కరుణాకర్ రెడ్డి, వంశీ, అశోక్, శ్రీనివాస్‌లు ఉన్నారు. ఏడీజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు.
@ భీమదేవరపల్లి మండలంలో సంపులో పడి చిన్నారి మృతి. @ మెట్ పల్లి మండలంలో వరద కాలువలో వైద్యుడు గల్లంతు. @ మల్లాపూర్ మండలం గోదావరి నదిలో మునిగి వ్యక్తి మృతి. @ మానకొండూరు మండలంలో ఆటో బోల్తా పడి నలుగురికి గాయాలు. @ మెట్పల్లి మండలంలో చెరువులో దూకి మహిళా ఆత్మహత్య. @ జగిత్యాల లో కారు బీభత్సం. @ రామగుండంలో గుండెపోటుతో ఫోటోగ్రాఫర్ మృతి. @ కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్.
అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ ప్రథమ సంవత్సర రెండో సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 4 నుంచి ప్రారంభమవుతాయని ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు మ.2 గంటల నుంచి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులందరూ హాజరుకావాలని ఆయన కోరారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన పాలకుర్తి అశోక్ (39) ఒమాన్ దేశంలో గుండె పోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. అశోక్ ఏడాది క్రితం ఉపాధి నిమిత్తం ఒమాన్ దేశం వెళ్లారు. శనివారం కంపెనీలో పని చేస్తుండగా గుండె పోటు రావడంతో తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహం స్వగ్రామానికి పంపించాలని బంధువులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.