India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి కొప్పుల స్పందించారు. ‘తెలంగాణ ఎదుగుదలని చూసి ఓర్వలేక ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార.. సజీవ జలధార అని కొనియాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగింది.. కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ విమర్శించిందన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా.. లక్షల క్యూసెక్కుల నీటిరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుంది‘ అని అన్నారు.
గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్టులు 5వ రోజు ప్రశాంతంగా జరిగినట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రవి కుమార్ తెలిపారు. మొత్తం 4 గ్రాండ్ టెస్టులు, 16 పరీక్షలు ఉంటాయన్నారు. కరీంనగర్ పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో సోమవారం 50 మంది హాజరైనట్లు వెల్లడించారు. 3వ గ్రాండ్ టెస్టు జులై 23న, 4వ గ్రాండ్ టెస్టు జులై 30, 31 తేదీల్లో ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు టెస్టులు ఉపయోగించుకోవచ్చన్నారు.
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. గోదావరి, ప్రాణహిత నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అన్నారం బ్యారేజీలో 119 మీటర్ల లెవల్‌కు గోదావరి నదికి 16,870 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. కాళేశ్వరం వద్ద 101.01 మీటర్ల వరద ప్రవాహం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద 6,770 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగువిస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండంతో రైతులు వరి నాట్ల జోరు పెంచారు. అలాగే ఇప్పటి వరకు 1.55 లక్షల ఎకరాల్లో పత్తిని విత్తుకోగా ఈ నెలాఖరు వరకు 1.90 లక్షల ఎకరాలకు సాగు పెరగనుంది అని అధికారులు అంచన వేస్తున్నారు. పలు రకాల పంటల సాగుకు మరో 10 – 15 రోజులు ఉండటంతో సాగు విస్తీర్ణం పెరగనుంది.
కరీంనగర్ మండలం నగునూరు గ్రామంలో వృద్ధురాలు కోట లచ్చమ్మకు నలుగురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కొడుకులెవరూ పట్టించుకోకపోవడంతో అనాథగా మారింది. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న ఆమె కాలు జారి పడ్డారు. స్థానికులు కుటుంబీకులకు తెలిపినా ఎవరూ రాలేదు. ఈ విషయమై వృద్ధురాలి కుమార్తె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు MRO, పోలీసులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్వతి (సుందిల్ల) బ్యారేజీ కరకట్టకు ప్రమాదం పొంచి ఉంది. మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు పార్వతి బ్యారేజీలోకి వచ్చిన వరదతో కరకట్ట మరమ్మతుకు గురైంది. అప్పటి అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. కాగా ప్రస్తుతం 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరకట్ట తెగిపోయే అవకాశం ఉండటంతో అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
వీధి కుక్క దాడిలో చిన్నారికి గాయాలైన ఘటన జగిత్యాల జిల్లాలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు.. మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌లో చిన్నారి వేములవాడ రిషిక ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఓ వీధి కుక్క చిన్నారిపై ఎగబడి దాడి చేసింది. దీంతో చిన్నారి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో కుక్కల బెడద ఉందని ప్రజలు వాపోతున్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం మధ్యాహ్నానికి 19.185 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 18,518 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోంది. మిషన్ భగీరథకు 63 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాలకు 108 క్యూసెక్కుల నీటిని చేశారు.
@ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ సైదాపూర్ మండలంలో పాముకాటుతో యువతీ మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం. @ వేములవాడ సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ. @ భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే. @ కరీంనగర్ లో గోరింటాకు వేడుక.
బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన రాగి రవి (55) అనే వ్యక్తి సౌదీలో ఈనెల 13న అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాగి రవి గత 16 ఏళ్లుగా సౌదీలో ఉంటున్నాడు. అక్కడ గొర్ల కాపరి, వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం స్వగ్రామానికి వచ్చి మళ్లీ తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన అనారోగ్యంతో మృతిచెందినట్లు అక్కడి ఆయన స్నేహితుల ద్వారా తెలిసింది.
Sorry, no posts matched your criteria.