India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హుస్నాబాద్ మండలం శ్రీరాములపల్లెలో భూవివాదం జరిగింది. వ్యవసాయ భూమి సరిహద్దుల విషయంలో రెండు వర్గాలకు మధ్య పెద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గొడవలో దవీందర్ అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయగా.. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, రవీందర్ కరీంనగర్ ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన మహిళ మృతదేహాన్ని సంచిలో మూటకట్టి పడేసిన ఘటన ఈనెల 8న పారుపల్లిలో జరిగింది. కాగా, ఈ కేసును మంథని సీఐ వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో పోలీసులు ఛేదించారు. అప్పు నుంచి తప్పించుకోవడానికి అమ్ము రజితను ఆమె భర్త తిరుపతి గొంతు నులిమి చంపగా, జేసీబీ డ్రైవర్ రవి సంచిలో మూటకట్టి బావిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
భారీ వర్షం కారణంగా కరీంనగర్ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బల్దియా అత్యవసర చర్యలు ప్రారంభించింది. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వరద నీరు నిలవకుండా రెస్క్యూ టీం సభ్యులు పనిచేస్తారు. భారీ గుంతలు ఏర్పడితే తాత్కాలికంగా మట్టితో పూడ్చివేస్తారు. అత్యవసర సేవలకైన 98499 06694 నంబర్ కాల్ చేయలని కమిషనర్ ప్రపుల్ దేశాయ్, నగర్ మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు.
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 15,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 489 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెపాసిటీ 80.5 టీఎంసీలకు ప్రాజెక్టులో 18.443 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సరస్వతి కెనాల్‌కు 10 క్యూసెక్కుల, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
@ సైదాపూర్ మండలంలో పురుగుల మందు తాగి మహిళా ఆత్మహత్య. @ కథలాపూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ. @ సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్. @ ఎండపల్లి మండలంలో 5 డెంగ్యూ కేసులు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం. @ వెల్గటూర్ మండలంలో ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సస్పెండ్.
సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఈ సందర్భంగా విద్యార్థులకు బోధన చేసి పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. పాఠశాలలోని పలు రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులను సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.
మంథని మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు చిన్న పాటి చెరువును తలపించేలా మారిపోయింది. బస్టాండ్‌లోకి వరద రావడంతో అందులో చేపలు కనబడుతున్నాయని ప్రయాణికులు నీటిలోకి దిగారు. వారు చేపలు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో జిల్లా నేతలు కీలక పదవుల్లో కొనసాగుతుండటంతో అభివృద్ధిపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. కేంద్రమంత్రిగా బండి సంజయ్, రాష్ట్ర మంత్రులుగా శ్రీధర్ బాబు, పొన్నంతో పాటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్‌కు ప్రభుత్వ విప్ పదవులు దక్కగా జిల్లాకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.
కష్టపడి పని చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేయండని, పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూసి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సిపి, ఎస్పీలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని, ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.
తెలంగాణలోని రైతులందరి సూచనలు, అభిప్రాయాలను క్రోడీకరించి రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతు భరోసా పథకం అమలుపై ఉమ్మడి జిల్లాలోని రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఆ దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.