India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కష్టపడి పని చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేయండని, పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూసి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సిపి, ఎస్పీలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని, ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.
తెలంగాణలోని రైతులందరి సూచనలు, అభిప్రాయాలను క్రోడీకరించి రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతు భరోసా పథకం అమలుపై ఉమ్మడి జిల్లాలోని రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఆ దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
@ పెద్దపల్లిలో బస్సు డిపో ఏర్పాటుకు మంత్రి పొన్నం హామీ.
@ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.
@ ధర్మారం మండలంలో తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య.
@ కాంగ్రెస్ పార్టీలో చేరిన కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ సహా ఆరుగురు కౌన్సిలర్లు.
@ రాయికల్ మండలంలో ఇద్దరు పేకాటరాయుళ్ల పట్టివేత.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.56,449 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.29,282, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.17,100, అన్నదానం రూ.10,067 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
బండి సంజయ్ వ్యవహారశైలి చూస్తుంటే గురివిందగింజ నలుపెరుగదనే సామెత గుర్తొస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. 70% మంది రైతులకు రుణమాఫీ వర్తించట్లేదంటున్న బండి సంజయ్.. అది నిరూపించకపోతే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. తక్షణమే సంజయ్ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తుంటే భరించలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడిగడ్డ బ్యారేజీకి ఇటీవల కురిసిన వర్షాల వల్ల భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 1,93,550, క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అధికారులు 85 గేట్లను ఎత్తి మొత్తం నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కాలేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ.. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ప్రస్తుత నీటిమట్టం 8 మీటర్లు ఉంది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్‌తో శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు అరవింద్ పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం పలు విషయాలను చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరగనున్న నేపథ్యంలో ఇరువురు భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్తుల కుట్టు కూలీ నిధులను విద్యాశాఖ విడుదల చేసింది. కాగా ఈ దుస్తులను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళా సమాఖ్యలు కుట్టి పాఠశాలలకు అందించాయి. ఒక్కో జతకు రూ.50 చొప్పున నిధులు మంజూరు చేశారు.
జగిత్యాల జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గురువారం రాత్రి మేడిపల్లి గ్రామంలో 11 కేవీ లైన్‌పై పెద్ద చెట్టు కూలి 2 స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతిన్నాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. TGNPDCL సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
పెద్దపల్లి ప్రజలకు ఆర్టీసీ డిపో ఏర్పాటు 30 ఏళ్లుగా కలగానే మిగిలింది. జిల్లాగా ఏర్పడిన తర్వాత కూడా ఇంకా సాధ్యం కాలేదు. డిపో ఏర్పాటుకు పెద్దపల్లిలో అందుబాటులో ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడంపై పాలకులు దృష్టి సారించడం లేదు. కాగా ప్రభుత్వం రెండు రోజుల క్రితం మోత్కూరు ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరి పెద్దపల్లికి ఎప్పుడు వస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.