Karimnagar

News October 23, 2024

పెద్దపల్లి: పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

image

పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం ఆయన రామగిరి మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో స్కావెంజర్‌ను ఏర్పాటు చేసుకున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమం పనులను పరిశీలించారు.

News October 23, 2024

KNR: అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం పోస్ట్‌పోన్ తేదీలు ఇవే..!

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

News October 23, 2024

గంగారెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న MLC, ప్రభుత్వ విప్

image

MLC జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, జాబితాపురం గ్రామ మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి మంగళవారం ఉదయం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గంగారెడ్డి పార్థివ దేహానికి MLC జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి అనంతరం గంగారెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కాగా, గంగారెడ్డి హత్యతో జగిత్యాల ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

News October 23, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఎల్లారెడ్డిపేట మండలంలో బాలుడిపై వీధి కుక్క దాడి.
@ జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి దారుణ హత్య.
@ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మాతృ వియోగం.
@ మెట్పల్లి మండలంలో రహదారి పనులను పర్యవేక్షించిన కలెక్టర్ సత్యప్రసాద్.
@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ వేములవాడలో బైకులను ఢీ కొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు.

News October 23, 2024

పెద్దపల్లి: ఒక మండలం.. మూడు రైల్వే స్టేషన్లు

image

సాధారణంగా ఒక మండలంలో ఒకటి లేదా రెండు రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఇందుకు భిన్నంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాజీపేట-బలర్ష మధ్య మార్గంలో పోత్కపల్లి, ఓదెల, కొలనూర్ సుమారు 25 కీలో మీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ ఉంది. ఓదెలలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పిస్తే జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతుంది.

News October 23, 2024

రాజన్న సిరిసిల్ల: ‘ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్క్రూటీని సకాలంలో పూర్తి చేయాలి’

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రుటీని సకాలంలో పూర్తి చేయాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

News October 22, 2024

KNR: ఐటీఐలో దరఖాస్తుకు ఈనెల 30 చివరి గడువు

image

కరీంనగర్‌లోని ఉజ్వల పార్కు సమీపంలో గల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 7వ విడత అర్హులైన అభ్యర్థుల నుంచి ఐటీఐ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదవ తరగతి పాస్ ఐన విద్యార్థులు www.iti.telangana.gov.in వెబ్ సైట్‌లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకై 7799100360, 9989182747, 8396768680 సంప్రదించాలని సూచించారు.

News October 22, 2024

KNR: రేపు గంగుల నర్సమ్మ అంత్యక్రియలు

image

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల నర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గంగుల నర్సమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతిమయాత్ర రేపు ఉదయం 9:30 గంటలకు క్రిస్టియన్ కాలనీలోని స్వగృహం నుంచి ప్రారంభమై మార్కండేయ నగర్లోని సర్గదాం స్మశాన వాటికలో గంగుల నర్సమ్మ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

News October 22, 2024

BREAKING.. MLA గంగుల కమలాకర్‌కు మాతృవియోగం

image

మాజీ మంత్రి, కరీంనగర్ MLA గంగుల కమలాకర్ తల్లి గంగుల నర్సవ్వ సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు. కరీంనగర్‌లోని గంగుల ఇంట్లో భౌతిక కాయాన్ని కరీంనగర్ పట్టణ, మండల నాయకులు, ప్రజలు సందర్శించి, MLA కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్లో దహన సంస్కారాలు చేయనున్నారు.

News October 22, 2024

ప్రమాద రహిత బొగ్గు గని అవార్డు అందుకున్న సింగరేణి

image

ప్రమాద రహిత బొగ్గు గనులకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా అందజేస్తున్న ఫైవ్ స్టార్ అత్యుత్తమ గనుల అవార్డుకు ఈసారి సింగరేణి రామగుండం-3 OCP-1 (ఎక్స్ టెన్షన్ ఫేజ్-2) గని, ఇల్లందు జవహర్ ఖని-OCP ఎంపికైంది. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సతీశ్ చంద్ర దూబే చేతుల మీదుగా సింగరేణి C&MD బలరామ్, డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి, GM జాన్ ఆనంద్, PO రాధాకృష్ణ, నీరజ్ కుమార్ ఓజా అవార్డును అందుకున్నారు.