India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన ఔత్సాహికులు దరఖాస్తులను వెబ్‌సైట్
www.tgbcstudycircle.cgg.gov.inలో ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 75 రోజుల పాటు నిర్వహించే శిక్షణ ఈ నెల 22న మొదలవుతుందన్నారు.
గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన ఔత్సాహికులు దరఖాస్తులను వెబ్‌సైట్
www.tgbcstudycircle.cgg.gov.inలో ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 75 రోజుల పాటు నిర్వహించే శిక్షణ ఈ నెల 22న మొదలవుతుందన్నారు.
గురువారం జగిత్యాల పట్టణంలోని స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు రూ.1 లక్ష వరకు రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
జిల్లా వ్యాప్తంగా DSC పరీక్షలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆగస్టు 5 వరకు ఉదయం 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:40 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. కరీంనగర్ జిల్లాలో 5, పెద్దపల్లి జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ-2లో బుధవారం జరిగిన ప్రమాదంలో భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన ఉద్యోగి వెంకటేశ్వర్లు మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబం కొన్నేళ్ల కిందటే గోదావరిఖనిలో స్థిరపడింది. సింగరేణి విధులకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారనే విషయం తెలుసుకొని ఆయన మిత్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
భర్త మృతిని తట్టుకోలేక భార్య చెందిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం బంజేరుపల్లిలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. మల్లయ్య(75)మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం ఆయన అంత్యక్రియల నిర్వహణలో పాడె కడుతున్న సమయంలో మల్లయ్య భార్య రాజలచ్చమ్మ(70) ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఉపాధ్యాయ పోస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న DSC-2024 ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. వచ్చేనెల 5 వరకు జరిగే ఈ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలలో 34,254 ఉంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులు కేంద్రాలకు నిర్ణీత సమయానికి గంటన్నర ముందుగా హాజరుకావాలని కరీంనగర్, పెద్దపల్లి DEOలు జనార్దన్ రావు, మాధవి తెలిపారు.
రైతులకు పెట్టుబడి సాయం పథకం అమలుపై కరీంనగర్ ఉమ్మడి జిల్లాల రైతుల అభిప్రాయం సేకరణ కార్యక్రమాన్ని ఈనెల 19న కరీంనగర్ శివారు బొమ్మకల్ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమెలా సత్పత్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.
@ ఉమ్మడి కరీంనగర్‌లో మొహర్రం వేడుకలు.
@ హుజురాబాద్ పట్టణంలో 25 మందిపై పిచ్చికుక్కల దాడి.
@ ధర్మారం మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య.
@ మల్యాల మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.
@ పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్.
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నేడు రూ.6,25,875 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ64,992, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.41,050, అన్నదానం రూ.5,19,833 వచ్చినట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.