India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మానకొండురు మాజీ MLA రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశం చూస్తే 2001 నాటి రోజులు గుర్తు వస్తున్నాయని, ఆ స్పూర్తి కనిపిస్తున్నదనీ హరీష్ అన్నారు. రసమయి కూడా అలయ్ బలయ్ పేరిట తన పాట పేరిట కాంగ్రెస్ మీద పోరాటానికి ఆయుధం విసిరిండని పేర్కొన్నారు.
KNR నుంచి జగిత్యాల(లింగంపేట)లోని రైల్వే స్టేషన్ మీదుగా ముంబై దాదర్ వరకు ప్రతి బుధవారం సాయంత్రం 05:40 నిమిషాలకు రైలు తిరిగి పునః ప్రారంభించారు. పరిసర ప్రాంత ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1:25 గంటలకు దాదర్ చేరుకొనుంది. కాగా ఇదే రైలు తిరిగి గురువారం ముంబై (దాదర్) నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు జగిత్యాలకు రానుంది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేర్ డ్యామ్‌లో పడి యువకుడు మృతి చెందాడు. తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన సాయి కుమార్ (26) ప్రమాదవశాత్తు డ్యాంలో అందులో పడ్డాడా..? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం తెలియాల్సి ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
తప్పుడు డాక్యుమెంట్లతో వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన తహశీల్దార్ అరెస్ట్ అయ్యాడు. సిరిసిల్ల జిల్లా చందుర్తి తహశీల్దార్‌గా గతంలో విధులు నిర్వర్తించిన నరేశ్.. అనంతపల్లికి చెందిన రైతు మల్లేశం భూమిని ఫేక్ డాక్యుమెంట్లతో మరో రైతుకు రిజిస్ట్రేషన్ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. నేరం రుజువు కావడంతో తహశీల్దార్‌ను అరెస్టు చేసి వేములవాడ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించినట్లు చెప్పారు.
కుల గణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. 2, 3 నెలల్లో పంచాయతీ పోరు జరగనుండగా పల్లెల్లో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. గతంలో ఓడినవారు, కొత్తగా పోటీ చేయాలనుకునే వారు, గతంలో గెలిచిన వారు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే మరోసారి సర్పంచ్ కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలని కొందరు పావులు కదుపుతున్నారు.
గోదావరిఖని పరశురాం నగర్‌కు చెందిన కుక్క సురేశ్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో ఓవర్ మెన్‌గా పని చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక సింగరేణి ఆసుపత్రిలో చేరాడు. అత్యవసర చికిత్స అందించాల్సిన వైద్యులు సకాలంలో లేకపోవడంతో సురేశ్ మృతి చెందారని కుటుంబ సభ్యులు, కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. వైద్యులు స్పందించకపోవడంతోనే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్లు 5 హామీలు అంటూ గెలిచిన తర్వాత తప్పకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తీరుస్తానని ఓ సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారానికి తెరలేపారు. HNK జిల్లా కమలాపూర్ మండలం ఉప్పలపల్లి గ్రామానికి చెందిన ర్యాకం శ్రీనివాస్ రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేస్తానని, 5 సంవత్సరాల్లో ఐదు గ్యారంటీల పేరుతో మేనిఫెస్టో విడుదల చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ ప్రచారం అవుతోంది.
@ మహా ముత్తారం మండలంలో రెండు బైకులు ఢీకొని ఐదుగురికి గాయాలు. @ మైక్రో ఫైనాన్స్ లోన్ రికవరీ లో వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న సిరిసిల్ల కలెక్టర్. @ పెగడపల్లి మండలంలో బావిలో పడి వ్యక్తి మృతి. @ హుజరాబాద్ లో బాలిక అదృశ్యం. @ మారుమూల ప్రజలకు బ్యాంకు సేవలు అందించాలన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. @ గంభీరావుపేట మండలంలో వైద్యం పేరుతో బంగారం చోరీచేసిన ఇద్దరి అరెస్ట్.
పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల సంస్మరణ లో భాగంగా ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా స్మృతి పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించి అమరవీరులకు నివాళులర్పిస్తామన్నారు.
ఉద్యోగాల నియామకాల విషయంలో పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సీఎం, మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వమే ఆ నోటిఫికేషన్లను విడుదల చేసిందన్నారు.
Sorry, no posts matched your criteria.