India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్రమంత్రి బండి సంజయ్‌కి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే బడ్జెట్ సెషన్‌లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చడంలో కేంద్రం నిబద్ధతగా వ్యవహరించాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బండి పాత్ర కీలకమని అందులో పేర్కొన్నారు.
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం బంజరపల్లి గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అతివేగంగా ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, బొలెరో వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఆషాడ తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. స్వామివారికి, అనుబంధ పరివార దేవతలకు ఉదయం అభిషేక అర్చనలు, శ్రీరుక్మిణి విఠలేశ్వర స్వామివార్లకుకు పంచోపనిషత్ ద్వారా అభిషేకం మహాపూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 17, 18వ తేదీల్లో అఖండ భజన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తిరుపతి వేంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇందులో భాగంగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను కొప్పులకు అందజేశారు. అనంతరం అక్కడ నుంచి తమిళనాడులోని కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
MSC విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన KNR జిల్లా గంగాధర మం.లో జరిగింది. రామడుగు SI సురేందర్ ప్రకారం.. గర్శకుర్తికి చెందిన మాధవి(23) తల్లి లక్ష్మి ఇటీవల పెద్ద కూతురు ఇంటికి వెళ్లడంతో మాధవి ఒంటరిగా ఉంటోంది. ఉదయం పాలు అమ్మే వ్యక్తి వచ్చి పిలిస్తే పలకకపోవడంతో స్థానికులను పిలిచాడు. ఇంట్లోకి వెళ్లిచూడగా ఉరేసుకొని కనిపించింది. దీంతో హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
KNR వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కానున్నాయి. ఇందుకు ఒకే చోట నాలుగేళ్లు పూర్తైన వారు DPO ఆఫీస్‌లో దరఖాస్తులు అందజేశారు. ఈనెల 11 సా. వరకు ఆప్షన్ల గడువు ముగిసింది. జిల్లాలో 318 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న కార్యదర్శుల 185 మంది ఉన్నారు. ఈనెల 20 వరకు 88 మందికి బదిలీలకు అవకాశం ఉంది. పైరవీలకు తావు లేకుండా స్థానచలనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,05,452/- ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ 54,130/-, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.32,500/-, అన్నదానం రూ.18,822/-,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. కరీంనగర్ డివిజన్‌లో 69, పెద్దపల్లి డివిజన్‌లో 60 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPMకు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonlineను సంప్రదించవచ్చు. SHARE IT
అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 తులాల బంగారు, 2 తులాల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్, రెండు మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లొ నిందుతులపై 17 కేసులు ఉన్నట్లు తెలిపారు. సంపత్, పరుశురాం అనే ఇద్దరిని రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
అదనపు కట్నం తేవాలని వేధించిన భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. CI రవి వివరాల ప్రకారం.. జమ్మకుంట మం. మాచనపల్లికి చెందిన స్రవంతి, ఇల్లందకుంట మం.కి చెందిన సదయ్యకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఉద్యోగరిత్యా వీరు న్యూజిలాండ్‌లో ఉండి గతేడాది HYDకి వచ్చారు. అయితే రూ.20లక్షల అదనపు కట్నం తేవాలని భార్యను నెలక్రితం పుట్టింటికి పంపాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో అత్త, బావతో పాటు.. భర్తపై కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.