Karimnagar

News October 17, 2024

కరీంనగర్: వినూత్నంగా యువ నాయకుడి మేనిఫెస్టో!

image

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లక్ష్మక్కపల్లిలో సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు మేనిఫెస్టోను యువ నాయకుడు మద్దుల ప్రశాంత పటేల్ విడుదల చేశారు. తనను గెలిపిస్తే 10 తరాలు గుర్తుండిపోయేలా చేస్తానంటూ ముందస్తుగా విడుదల చేసి నాయకులు ఆలోచింపజేసే విధంగా చేశారు. ప్రతి నెల హెల్త్ క్యాంప్, ఆడ పిల్ల పెళ్లి కానుక, మూతబడిన పాఠశాల రీ-ఓపెన్, ఆడపడుచులకు టైలరింగ్ శిక్షణ తదితర హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయి.

News October 17, 2024

జగిత్యాల: ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ప్రేమ వివాహం

image

ట్రాన్స్‌జెండర్‌తో యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌‌కు చెందిన కుమార్, మ్యాడంపెల్లికి చెందిన కరుణంజలి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం పెద్దలకు చెప్పి ఒప్పించి బుధవారం వివాహం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ట్రాన్స్‌జెండర్ల అధ్యక్షురాలు నిహారిక, సభ్యులు అలకుంట ప్రశాంతి, రాంబాయి, జానూ, రాధికా, రమ్య, ఆరోహి పాల్గొన్నారు.

News October 17, 2024

పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: గౌతమ్

image

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ డైరెక్టర్ పీవీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం ఆయన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి చింతల కుంట పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పురోగతి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఉండే విధంగా వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు.

News October 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ తంగళ్ళపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ కథలాపూర్ మండలంలో ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరి మృతి. @ మెట్పల్లి పట్టణ శివారులో ఆర్టీసీ బస్సు, బైకు డీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ జగిత్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఒకేరోజు 25 ప్రసవాలు. @ ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్.

News October 16, 2024

కరీంనగర్: పంచాయతీ ఎన్నికల బరిలో యువత!

image

ఇప్పటి వరకు రాజకీయాలంటే ఆసక్తి చూపని యువత ధోరణిలో మార్పు కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 1,226 పంచాయతీల్లో ప్రధానంగా యువత బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతోంది. రోజూ గ్రామంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తూ.. ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గ్రామంలోని ముఖ్య నాయకులను కలుస్తూ వారి ఆశీస్సులు తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు. మరి మీ దగ్గర యువత బరిలో ఉంటుందా? కామెంట్.

News October 16, 2024

KNR: కంప్యూటర్ ట్యాలీపై ఉచిత శిక్షణ దరఖాస్తులకు ఆహ్వానం

image

తిమ్మాపూర్లో గల SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో కంప్యూటర్ ట్యాలీపై ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 18 నుంచి 45సం.ల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ శిక్షణ 30 రోజులు ఉంటుందన్నారు.

News October 16, 2024

రామగుండం MLA కుటుంబ సభ్యులతో మంత్రి సీతక్క విందు

image

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు & రామగుండం MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్-మనాలి ఠాకూర్ ఆహ్వానం మేరకు మంత్రి సీతక్క విందు భోజనం చేశారు. HYDలోని MLA నివాసానికి వచ్చిన మంత్రి సీతక్క కాసేపు రాజకీయ పరిణామాలు, అభివృద్ధి గురించి చర్చించారు. అనంతరం MLA కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి సరదాగా విందు భోజనం చేశారు.

News October 16, 2024

కరీంనగర్ అనే పేరు ఎలా వచ్చింది?

image

నేడు కరీంనగర్ అని పిలవబడే పేరు సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణం చేయబడింది. పూర్వం ఈ ప్రాంతానికి ‘సబ్బినాడు’ అని పేరు. KNR, శ్రీశైలంలలో దొరికిన, కాకతీయ రాజులు ప్రోల, ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. కరినగరం.. కరి అనగా ఏనుగు, ఏనుగులు తిరిగే నగరం కావున కరినగరం, క్రమంగా కరీంనగర్‌గా మారింది. మాజీ ప్రధాని పి.వి నరసింహారావు, సుప్రసిద్ధ కవులను తయారు చేసిన గడ్డ ఇది.

News October 16, 2024

జోనల్ పోటీలకు సిద్ధమైన రెస్క్యూ స్టేషన్

image

నేటి నుంచి సింగరేణి జోనల్ లెవెల్ రెస్క్యూ పోటీలు యైటింక్లైన్ లైన్ కాలనీ రెస్క్యూ స్టేషన్‌లో ప్రారంభం కానున్నాయి. ఇందులో రామగుండం ఏరియా-1, 2, 3, ALP, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఎల్లందు, మణుగూరు జట్లు పాల్గొంటాయి. ఈరోజు, రేపు జరిగే ఈ పోటీలకు సంస్థ C&MDబలరాం, ఉన్నతాధికారులు వెంకటేశ్వర రెడ్డి, భూషణ్ ప్రసాద్, ఉమేష్, సావర్కర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.

News October 16, 2024

నేడు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో క్షీర చంద్ర దర్శనం

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో క్షీర చంద్ర దర్శనం నిర్వహించనున్నారు. శ్రీ స్వామివారి ఆలయంలో ఆశ్వీజ శుద్ధ చతుర్దశి ఉపరి పూర్ణిమ బుధవారం జరుగుతుంది. క్షీరచంద్ర దర్శనం సందర్భంగా నిశీపూజ అనంతరం రాత్రి 10:05 ని.ల నుంచి కోజాగరి పూర్ణిమ వ్రతం(మహాలక్ష్మిపూజ-క్షీరచంద్రపూజ) అనంతరం క్షీరచంద్ర దర్శనం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు భీమశంకర్ శర్మ తెలిపారు.