India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రూప్-3 పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఇతర మెటీరియల్‌ను కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచినట్లు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కరీంనగర్లోని స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తామన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు.
పిల్లలు దైవానికి ప్రతిరూపమని, వారిని సన్మార్గంలో నడిపిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలల దినోత్సవం వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 80 శాతం పిల్లల భవిత ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని అన్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు చల్ల హరి శంకర్, కరీంనగర్ ఫ్యాక్ట్ ఛైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, చెర్లబూత్కూర్ మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్ తదితరులున్నారు.
వేములవాడ దేవాలయం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి కార్యకలాపాలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతు, వేములవాడ ఈవో వినోద్, పలువురు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూనే యువకుడు కుప్పకూలిన ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోత్కూరావుపేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చేటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. మండలంలోని కమ్మరిపేటకు చెందిన సంజీవ్(23) తన మేనమామ కొడుకు పెళ్లి బరాత్‌లో డాన్స్ చేస్తున్న క్రమంలో గుండెపోటుకు గురై కుప్పకూలాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. యువకుడి మృతితో పెళ్లింట విషాదం నెలకొంది.
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శివారులో శాంతినగర్‌కు చెందిన యువ రైతు దంపతులు వరి పొలంలోనే మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. భార్య వసంత(35)ను భర్త ముదం వెంకటేశం(43) హత్య చేసి తాను పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో పురుగు మందు డబ్బా, రక్తపు మరకలు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరొందిన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కృష్ణ తులసి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులకు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈనెల 16న కరీంనగర్‌లో TPCC అధ్యక్షులు, MLC మహేశ్ కుమార్ గౌడ్ పర్యటిస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా గార్డెన్స్‌లో KNR పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో సమగ్ర కుటుంబ సర్వే, పార్టీ సమన్వయం, స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహరచన, తదితర అంశాలపై చర్చ కొనసాగుతుందన్నారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని MLA డా.కవ్వంపల్లి పిలుపునిచ్చారు.
@ ప్రభుత్వ ఆసుపత్రిలలో ప్రసవాలను పెంచాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ మెట్పల్లి మండలంలో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్. @ సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ జగిత్యాలలో ఓ హోటల్లో భోజనంలో వచ్చిన స్ప్రింగ్. @ మల్లాపూర్ మండలంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి రిమాండ్.
పెద్దపెల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల మధ్యలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి పడిపోవడంతో 24 గంటల పాటు ఎక్కడికి అక్కడ రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు 24 గంటలు శ్రమించి రైల్వే లైన్ క్లియర్ చేశారు. రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహించి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. దీంతో ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మరో రెండు గంటల్లో డౌన్ లైన్‌లో ట్రైలర్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.