Karimnagar

News November 13, 2024

బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్

image

భారత తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలలందరికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లలను జాతి సంపదగా భావించి వారి భవితవ్యానికి, అభివృద్ధికి నెహ్రూ కృషి చేశారని మంత్రి పునరుద్ఘాటించారు. బాలలు తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు అని, భావి భారత పౌరులని వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పాలని ఆకాంక్షించారు. 

News November 13, 2024

వేములవాడ రాజన్నను దర్శించుకున్న 32,596 మంది భక్తులు 

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం బుధవారం పురస్కరించుకొని 32,596 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్య వేక్షించారు.

News November 13, 2024

ప్రయాణికుల నుంచి మంచి స్పందన: KNR RTC RM

image

ఈనెల 15న పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం KNR రీజియన్ నుంచి స్పెషల్ బస్సులు బుధవారం బయలుదేరి వెళ్లినట్లు ఆర్టీసి KNR RM ఎన్.సుచరిత ‘Way2News’కు తెలిపారు. GDK, HSB, KNR, JGL, VMD నుంచి సూపర్ లగ్జరీ బస్సులు వెళ్లాయని, ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. అన్ని బస్సులు ఫుల్ అయినట్లు తెలిపారు. ప్రతి పౌర్ణమికి అదనపు బస్సులు ఏర్పాటు చేసే విధంగా చేస్తామన్నారు.

News November 13, 2024

రాజన్న ఆలయంలో ఆకట్టుకుంటున్న దీపోత్సవం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిత్యం వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం కార్తీక మాసం పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో స్థానిక భక్తులు ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగిస్తూ తన్మయత్వం పొందుతున్నారు. రకరకాల ఆకారాలతో దీపాలను వెలిగిస్తున్నారు.

News November 13, 2024

గ్రూప్-3 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: KNR కలెక్టర్ 

image

ఈనెల 17, 18వ తేదీల్లో జిల్లాలో గ్రూప్-3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రూప్-3 పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

News November 13, 2024

రైలు ప్రమాద నేపథ్యంలో రైళ్లను దారి మళ్లింపు

image

గూడ్స్ రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది. రాఘవాపూర్ – రామగుండం మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను నిజామాబాద్ మీదుగా మళ్లిస్తూ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేయగా, మధురై, నిజాముద్దీన్, చెన్నై సెంట్రల్ – లక్నో, పలు రైళ్ల దారి మళ్లించారు.

News November 13, 2024

పెద్దపల్లి: ముమ్మరంగా కొనసాగుతున్న రైల్వే ట్రాక్ పనులు

image

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బోగీలు తొలగించడంతో పాటు ట్రాక్‌పై మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పెద్దపెల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల మధ్యలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు భారీ జేసీబీలు తెప్పించే మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఇప్పటివరకు మెయిన్ లైన్ రైల్వే ట్రాక్ 600 మీటర్ల వరకు పైగా పూర్తిగా తొలగించినట్లు సమాచారం.

News November 13, 2024

జగిత్యాల: క్యాన్సర్‌తో బీటెక్ విద్యార్థిని మృతి

image

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాయికల్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని తిరుమల జ్యోత్స్న(18) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా.. అక్కడ మరణించారు. ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News November 13, 2024

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పెద్దపల్లి బస్టాండ్‌లో రద్దీ 

image

పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ రైల్వే స్టేషన్ దగ్గరలో <<14596439>>గూడ్స్ రైలు పట్టాలు<<>> తప్పిన విషయం తెలిసిందే. దీంతో పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు అర్ధరాత్రి పెద్దపల్లి బస్టాండ్‌కి పోటెత్తారు. దీంతో బస్టాండ్‌లో రద్దీ నెలకొంది. ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రయాణికులు వాపోయారు. 

News November 13, 2024

పెద్దపల్లి: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రాకపోకలకు అంతరాయం

image

పెద్దపల్లి జిల్లా రాఘవపూర్- కన్నాల మధ్యలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి ఆరు బోగీలు పడిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి గజియాబాద్ నుంచి కాజీపేట వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఎక్కడికక్కడ పట్టాలపై నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు.