Karimnagar

News November 13, 2024

పెద్దపల్లి: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రాకపోకలకు అంతరాయం

image

పెద్దపల్లి జిల్లా రాఘవపూర్- కన్నాల మధ్యలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి ఆరు బోగీలు పడిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి గజియాబాద్ నుంచి కాజీపేట వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఎక్కడికక్కడ పట్టాలపై నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు.

News November 13, 2024

ఇది ట్రైలర్ మాత్రమే.. 70mm సినిమా ముందుంది: హరీశ్ రావు

image

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేసిన పాదయాత్ర ట్రైలర్ మాత్రమేనని, 70mm సినిమా ముందుంది.. రేవంత్ రెడ్డి జాగ్రత్త అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగిత్యాల అంటేనే ఉద్యమాల ఖిల్లా అని, జగిత్యాల జైత్రయాత్ర అందరికీ తెలిసిందేనని, జగిత్యాలలో సంజయ్ సమర శంఖం పూరించాడన్నారు. రేవంత్ గాలి మోటార్‌లో కాదు.. కల్లాలలో తిరుగు అని మండిపడ్డారు.

News November 13, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోరుట్ల నుంచి జగిత్యాలకు పాదయాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ @ ఎమ్మెల్యే పాదయాత్రలో దొంగల చేతివాటం @ ధాన్యం కొనుగోళ్లపై సిరిసిల్ల కలెక్టర్ సమీక్ష @ రామగుండంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు @ మానకొండూరులో పురుగుల మందు డబ్బాతో రైతు హల్చల్ @ తిమ్మాపూర్‌లో కారు, బస్సు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ జగిత్యాల కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసన

News November 12, 2024

ఇష్టమైతేనే వివరాలు ఇవ్వాలి: కలెక్టర్ పమేలా 

image

రాబోయే రోజుల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. యజమానికి ఇష్టమైతేనే వివిధ డాక్యుమెంట్ల వివరాలు సమర్పించాలని సూచించారు. సర్వేకు ప్రజలంతా సహకరిస్తున్నారని అన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షల 30 వేల ఇండ్లను 2700 ఎన్యుమరైటర్లు సర్వే చేస్తున్నారని వివరాలు వెల్లడించారు.

News November 12, 2024

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసమే సర్వే: కలెక్టర్

image

రాబోయే రోజుల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. యజమానికి ఇష్టమైతేనే వివిధ డాక్యుమెంట్ల వివరాలు సమర్పించాలని, సర్వేకు ప్రజలంతా సహకరిస్తున్నారన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సుమారు రూ.3.30 లక్షల ఇళ్లు సర్వే చేయబోతున్నట్లు తెలిపారు.

News November 12, 2024

వేములవాడ : ఈనెల 13 నుంచి 15 వరకు అభిషేకాలు రద్దు

image

దక్షిణ కాశిగా పేరొందిన ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 13 నుంచి 15 అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నపూజలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఈ విషయం భక్తులు గమనించి సహకరించగలరని కోరారు.

News November 12, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మారం మండలంలో విద్యుత్ షాక్ తో ఒకరికి తీవ్ర గాయాలు. @ శంకరపట్నం మండలంలో కారు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ సిరిసిల్ల కార్గిల్ లేఖలో దూకి వ్యక్తి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ రేపు జగిత్యాలకు రానున్న మాజీ మంత్రి హరీష్ రావు. @ జగిత్యాల జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించిన కలెక్టర్. @ సిరిసిల్ల ప్రజావాణిలో 123 ఫిర్యాదులు.

News November 11, 2024

రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి పొన్నం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం రాత్రి 11:55గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్‌పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈరోజు సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.

News November 10, 2024

మెట్‌పల్లి ఎమ్మెల్యేగా జ్యోతి నియంతృత్వ పాలనను ఎదిరించారు: MLC

image

మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. నియంతృత్వ పాలనను ఎదురించడంలో ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి తమతో పాటు ఎమ్మెల్యేగా జ్యోతి ముందు వరుసలో ఉండేదని జీవన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. శాసనసభలోనే కాకుండా అన్ని రంగాలలో మహిళల హక్కుల కోసం జ్యోతి పోరాటం చేసారన్నారు.

News November 10, 2024

సీఎం, మంత్రి వెంకట్ రెడ్డిపై కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

image

జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లను దూషించిన సీఎం రేవంత్ రెడ్డిపై, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.