India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కులగణన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
@ మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. @ సిరిసిల్ల జిల్లాలో వడ్డీ వ్యాపారులపై పోలీసుల కోరడా. @ మెట్పల్లి డిఎస్పి ఉమామహేశ్వరరావు బదిలీ. @ సిరిసిల్ల జిల్లాలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు.
మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి మరణించారు. అనారోగ్యంతో ఇటీవల బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె చనిపోయారు. జ్యోతి దేవి మృతితో మెట్‌పల్లి పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కాగా జ్యోతి భర్త, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు గతేడాది మృతిచెందారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం శుక్రవారం పురస్కరించుకొని 31,317 మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
వరంగల్- మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ సేకరణ అంశాలపై అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 136 జీ 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పెండింగ్ భూసేకరణ త్వరగా ముగిసేలా చూడాలని అధికారులకు సూచించారు.
కరీంనగర్ జిల్లాలోని రేషన్ వివరాలు కింది విధంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 8,17,156 యూనిట్ల పరిధిలో మొత్తం 2,76,620 రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం 566 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెల దాదాపు 49 లక్షల కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
గోదావరి నదిలో నీట మునిగి యువకుడు గల్లంతైన ఘటన శుక్రవారం మల్లాపూర్ మండలం వివిరావుపేట గోదావరి నదిలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన శ్రీవర్ధన్(18) మేనకోడలు పుట్టు వెంట్రుకల శుభకార్యానికి గోదావరికి వచ్చారు. ఈ క్రమంలో స్నానం చేసేందుకు నదిలోకి వెళ్లగా ప్రమాదవశాత్తు నీట మునిగిపోవడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యవసాయ క్షేత్రంలో వరి నాటుతో వేసిన రేవంత్ రెడ్డి ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సీఎంను కలిసి ఘనంగా సన్మానించారు. సీఎం రేవంత్ రెడ్డి దీర్ఘకాలం పాటు ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు.
సింగరేణి వ్యాప్తంగా రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే ఈ ఏడాది టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ నిర్ణయించింది. ఇంకా 5 మాసాలు ఉన్నప్పటికీ నెలకు 7.63 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తేనే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాయి. సమిష్టిగా ఉద్యోగులు కృషి చేయాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.