Karimnagar

News July 8, 2024

తిట్లు, ఆరోపణలు బంద్ చేద్దాం : కేంద్రమంత్రి బండి

image

తిట్లు, ఆరోపణలు బంద్ చేసి.. అభివృద్ధిపై ఫోకస్ పెడదామని హోంశాఖ సహాయకమంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని, కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. సిరిసిల్లలో మున్నూరుకాపు సంఘ కళ్యాణ మండపం అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఎన్నికలైపోయినయ్.. ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దామని ఆయన హితవు పలికారు.

News July 8, 2024

జగిత్యాల: నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో 5 నెలల చిన్నారికి చోటు

image

జగిత్యాల జిల్లాకు చెందిన ఓ 5నెలల చిన్నారి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. కథలాపూర్ మండలానికి చెందిన మహేందర్-మౌనికల కూతురు ఐర(5నెలలు). అయితే ఐరాకు 2 నెలల వయసు నుంచే పలు రకాల వస్తువులు, బొమ్మలు, కార్డులను చూపించి గుర్తుపట్టేలా తండ్రి తీర్ఫీదు ఇచ్చాడు. ఇటీవల ఐరా 135 రకాల ఫ్లాష్ కార్డులను గుర్తు పట్టిన వీడియోను నోబెల్ సంస్థకు ఆన్‌లైన్‌లో పంపడంతో.. ధ్రువపత్రం, మెడల్‌ను పంపారు.

News July 8, 2024

BREAKING.. జగిత్యాల జిల్లాలో హత్య

image

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలో భార్యను చంపి భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఉపాధికోసం బహ్రెయిన్ వెళ్లి ఆదివారం ఇంటికి వచ్చిన భర్త లింగం.. అనుమానంతోనే భార్యను తలపై కొట్టి చంపేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2024

JMKT: నేటి నుంచి యథావిధిగా ప్యాసింజర్ రైళ్లు

image

అసిఫాబాద్ రోడ్ నుంచి రేచిని రోడ్ మధ్య జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల వల్ల తాత్కాలికంగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లను నేటి నుంచి యథావిధిగా నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. 12757/58 కాగజ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12733/34 భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, 17033/34 సింగరేణి ప్యాసింజర్ రైలు,17003/04 రామగిరి, 07765/66 కరీంనగర్ పుష్‌పుల్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.

News July 8, 2024

వేములవాడ టూ అరుణాచలం ప్రత్యేక బస్సు

image

వేములవాడ టూ అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు RTC ఆర్ఎం తెలిపారు. వేములవాడ రాజన్న సన్నిధి నుంచి తమిళనాడులోని అరుణాచలం దివ్యక్షేత్రానికి స్పెషల్ బస్సు వేసినట్లు కరీంనగర్ రీజనల్ ఆర్టీసీ మేనేజర్ సుచరిత పేర్కొన్నారు. ఈనెల 19న రాత్రి 8 గంటలకు వేములవాడ నుంచి ఈ బస్సు బయలుదేరుతుంది. KNR మీదుగా వెళ్లి ఈనెల 20న రాత్రి 8 గంటలకు అరుణాచలానికి చేరుకొని.. తిరిగి 22న KNRకు చేరుకుంటుందన్నారు.

News July 8, 2024

KNR: డీఎస్సీ పరీక్షలపై టీ-శాట్ అవగాహన కార్యక్రమాలు

image

ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 8 నుంచి 11 వరకు టీ-శాట్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రసారమవుతాయన్నారు. జూలై 8న ఇంగ్లీషుపై, జూలై 9న సైన్స్, జూలై 10న గణితంపై, జూలై 11న తెలుగు, హిందీ, ఉర్దూ సబ్జెక్టుపై ప్రత్యక్ష ప్రసారాలు చేస్తామని టీ-శాట్ సీఈవో తెలిపారు.

News July 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల జిల్లాలో 22 గ్రామాలకు మీ సేవ కేంద్రాల మంజూరు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్ పల్లి పట్టణంలో వైభవంగా జగన్నాథ రథయాత్ర. @ ముస్తాబాద్ మండలంలో సినీ పక్కిలో పేకాటరాయుళ్ల పట్టివేత. @ వేములవాడ, ఓదెల మండలంలో భారీ వర్షం. @ జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే.

News July 7, 2024

కరీంనగర్: డ్రమ్ సీడర్‌తో ఒకేరోజు 8 ఎకరాలు వరినాటు

image

ఆధునికసాగుతో కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన చిగుర్లు ఆశాలు ఒకేరోజు 8 ఎకరాల్లో వరినాటు వేశాడు. ఆశాలు డ్రమ్ సీడర్ తో 8ఎకరాలు సాగుచేయడం వల్ల సమయంతో పాటు, కూలీల ఖర్చులు ఆదా అయ్యిందని తెలిపారు. 8ఎకరాలకు తనకు రూ.2400 మాత్రమే ఖర్చయినట్లు తెలిపాడు.

News July 7, 2024

KNR: ఇల్లందకుంట, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తా: బండి సంజయ్

image

రామాయణ సర్క్యూట్ కింద ఇల్లందకుంట, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని.. అందుకోసం తాను తప్పకుండా కృషి చేస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతానన్నారు. ప్రతిపాదనలు పంపాలని గత ప్రభుత్వాన్ని అనేకమార్లు కోరినా పంపలేదన్నారు .

News July 7, 2024

ఓదెల మల్లన్న ఆలయంలో ఈనెల 15న పెద్దపట్నం

image

పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 15న పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏటా ఏకాదశి ముందు పెద్ద పట్నాలు, అగ్నిగుండ మహోత్సవం పెద్దఎత్తున నిర్వహిస్తారు. కావున భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరారు.