Karimnagar

News June 1, 2024

కరీంనగర్: ఓకే రోజు నలుగురి మృతి

image

జిల్లాలో శుక్రవారం వడదెబ్బతో నలుగురు మృతి చెందారు. వివరాలిలా.. వీణవంక మండలానికి రామక్క(72) వడ దెబ్బతో శుక్రవారం సాయంత్రం మృతి చెందగా, ధర్మారం(M) బొట్లవనపర్తికి చెందిన అమృతవ్వ(65) నిన్న మధ్యాహ్నం బయటకి వెళ్లింది. ఈక్రమంలో ఎండ తీవ్రత తట్టుకోలేక అస్వస్థతకు గురైంది. గమనించిన వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. చొప్పదండిలో ఓ లారీ డ్రైవర్‌, ఎన్టీపీసీకి చెందిన కిషోర్‌(36) మృతి చెందాడు.

News June 1, 2024

కౌంటింగ్: కరీంనగర్‌‌లో 153 రౌండ్లు

image

కరీంనగర్‌ లోక్‌సభ స్థానం ఓట్ల లెక్కింపునకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్‌‌ నియోజకవర్గాల్లో మొత్తం 116 టేబుళ్లు, 153 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తవుతుంది. 8AM నుంచి SRR కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫలితాలు బయటకు కనిపించేలా LED స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

News June 1, 2024

కొండగట్టు: పెద్ద హనుమాన్ జయంతికి ఘనంగా ఏర్పాట్లు

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామివారి పెద్ద జయంతి నేపథ్యంలో దేవాదాయశాఖ అధికారులు ఆలయ ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులు, మాలాధారులు వేలాదిగా ఆలయానికి తరలిరానుండటంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. కలెక్టర్ యాస్మిన్‌బాష ఏర్పాట్లను పర్యవేక్షించారు.

News May 31, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కొండగట్టులో వైభవంగా కొనసాగుతున్న పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు. @ జగిత్యాల జిల్లాలో అత్యాచారానికి పాల్పడిన ఇరువురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. @ వేములవాడలో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ కోనరావుపేట మండలంలో గుండె పోటుతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి. @ కొండగట్టులో పర్యటించిన జగిత్యాల కలెక్టర్. @ జగిత్యాలలో ఎండవేడికి మంటలు చెలరేగి 20 బైకులు దగ్ధం.

News May 31, 2024

KNR: ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. శుక్రవారం కమాన్‌పూర్‌లో 47.1°C, ముత్తారంలో 46.6°C, మంథనిలో 46.4°C, రామగుండంలో 46.2°C, ధర్మపురి మండలం నేరేళ్లలో 46.4°C, ఇబ్రహీంపట్నం మండలం గోధూర్‌లో 46.3°C, జమ్మికుంటలో 46.0°C, సిరిసిల్లలో 44.7°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News May 31, 2024

BREAKING: టెస్కాబ్ ఛైర్మన్ రాజీనామా

image

టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు తన పదవికి రాజీనామా చేశారు. సహకార సంఘంలో కొంత మంది కాంగ్రెస్‌లో చేరిన కారణంగానే తాను ఈ పదవిలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు. అయితే కొద్దిరోజుల క్రితం టెస్కాబ్ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చారు. ఈ క్రమంలో అవిశాస్వ తీర్మానానికి ముందే రవీందర్‌రావు రాజీనామా చేయడం గమనార్హం.

News May 31, 2024

KNR: పద్మ అవార్డులకు నామినేషన్ల స్వీకరణ

image

వివిధ రంగాల్లో చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ అవార్డులను జిల్లాలోని అర్హులైన పౌరుల నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అర్హులు సర్టిఫికేట్లు, బయోడేటా తో సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఒక జిరాక్స్ కాపీని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడా శాఖ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు.

News May 31, 2024

KNR: అధికారిని బురిడీ కొట్టించిన తల్లీకూతుళ్లు

image

ఓ ప్రభుత్వ అధికారిని తల్లీకూతుళ్లు మోసం చేసిన ఘటన గోదావరిఖనిలో జరిగింది. శ్రీరాంపూర్‌‌కి చెందిన ఓ సింగరేణి అధికారికి అదే ప్రాంతానికి చెందిన శ్రీలత, భవానీ పరిచయమయ్యారు. అతడి వద్ద ఉన్న బంగారాన్ని కాజేయాలని శ్రీలత భర్త వెంకటేశ్వర్లుతో కలిసి పథకం వేశారు. అతడి వద్దకు భవానీని పంపించి వారిద్దరు కలిసి ఉండగా పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి 9 తు. బంగారం, రూ.1.90లక్షల నగదు, రూ.20 లక్షల చెక్కు రాయించుకున్నారు.

News May 31, 2024

కొండగట్టు అంజన్నకు భద్రాద్రి రామయ్య కానుక

image

కొండగట్టు అంజన్న క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం భద్రచాలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం తరుపున ఈవో రమాదేవి, ఉప ప్రధన అర్చకుడు గోపాలకృష్ణాచార్యులు పట్టువస్త్రాలను తీసుకురాగా అంజన్న ఆలయ అధికారలు డప్పుచప్పులు మధ్య ఆలయం వరకు శోభా యాత్ర నిర్వహించారు. అనంతరం ఈవో చంద్రశేఖర్‌కు పట్టువస్త్రాలను అందజేశారు.

News May 31, 2024

వయోవృద్ధులను వేధిస్తే 3నెలల జైలు శిక్ష: ఆర్డీవో

image

వయోవృద్ధులైన తల్లిదండ్రులను వేధిస్తే 3నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ అల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన సీనియర్ సిటీజన్స్ పిలుపు, వయోధికుల రక్షణ చట్టం అవగాహన పుస్తకాలను మెట్‌పల్లి ఆర్డీవో కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ పూర్తిగా పిల్లలదేనని స్పష్టం చేశారు.