Karimnagar

News May 30, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కొండగట్టులో వైభవంగా కొనసాగుతున్న హనుమాన్ జయంతి వేడుకలు.
@ శంకరపట్నం మండలంలో గుండెపోటుతో కండక్టర్ మృతి.
@వీర్నపల్లి మండలంలో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.
@ముస్తాబాద్ మండలంలో ఉరివేసుకొని వృద్ధుడి ఆత్మహత్య.
@ విత్తన దుకాణాలను తనిఖీ చేసిన పెద్దపల్లి కలెక్టర్.
@ నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సిరిసిల్ల కలెక్టర్.
@చందుర్తి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ.

News May 30, 2024

రాష్ట్ర గీతంపై BRS అనవసర రాద్ధాంతం చేస్తుంది: విప్

image

‘జయ జయహే తెలంగాణ గీతం’పై BRS అనవసర రాద్ధాంతం చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరిట అధికారంలోకి వచ్చిన KCR పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి కనీసం రాష్ట్రానికి జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని మండిపడ్డారు. నేడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామంటే BRS నేతలకు నచ్చడం లేదని ఆరోపించారు.

News May 30, 2024

KNR: ప్రేమ విఫలం.. యువతి మృతి?

image

వీర్నపల్లి మండలం బాబాయ్ నాయక్ తండాలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. మమత(21) అనే యువతి ఇంట్లో దూలానికి ఉరివేసుకొని మృతి చెందింది. ఓ తండాకు చెందిన సతీష్ అనే వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు అతని ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో రెండు తండాలలో ఉద్ధృత వాతావరణం చోటుచేసుకుంది. ప్రేమ విఫలం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

News May 30, 2024

KNR: ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. గురువారం పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పూర్‌లో 46.7°C, ముత్తారంలో 46.4°C, పాలకుర్తి మండలం తక్కళ్లపల్లిలో 46.2°C, మంథనిలో 46.1°C, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో 45.8°C, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో 45.4°C, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 44.0°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News May 30, 2024

మహాముత్తారంలో జిల్లా కలెక్టర్ సమావేశం

image

అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా మహాముత్తారంలోని రైతు వేదికలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News May 30, 2024

కరీంనగర్: బడి బస్సు భద్రమేనా?

image

వచ్చే నెల జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నెల రోజులుగా షెడ్డులో ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2,389 ప్రైవేటు పాఠశాలలు బస్సులు ఉన్నాయి. వీటి ఫిట్‌నెస్ గడువు ఈ నెల 15తో ముగిసింది. ఈ వార్షిక సంవత్సరం బస్సులు రోడ్డెక్కాలంటే ఆర్టీఏ కార్యాలయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంది. 

News May 30, 2024

సిరిసిల్ల: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

image

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొనరావుపేట మండల కేంద్రానికి చెందిన కోలకాని నవీన్ (21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News May 30, 2024

కరీంనగర్: పరీక్ష ఫీజు చెల్లింపునకు రేపే తుది గడువు

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ద్వితీయ సంవత్సరం నాలుగో సెమిస్టర్, తృతీయ సంవత్సరం ఆరో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించుటకు ఈ నెల 31 వరకు అవకాశం ఉందని ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ అధికారి డా. ఆడెపు శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు శుక్రవారంలోగా చెల్లించాలని తెలిపారు.

News May 30, 2024

నేటి నుంచి హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు

image

కొండగట్టు అంజన్న ఆలయం హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి శనివారం వరకు నిర్వహించే ఉత్సవాలకు దీక్షాపరులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. 2 లక్షలకుపైగా దీక్షాపరులు తరలివచ్చి మాల విరమణ చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు. తలనీలాలు సమర్పించేందుకు వీలుగా 1500 మంది క్షురకులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News May 30, 2024

గోదావరిఖని సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడి మృతి

image

గోదావరిఖని సింగరేణి 11వ గనిలో గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో LHD ఆపరేటర్ దుర్మరణం చెందారు. స్థానికుల వివరాలు.. రామగిరి మండలం పన్నూరుకు చెందిన ఇజ్జగిరి ప్రతాప్ గనిలో విధులు నిర్వహిస్తుండగా LHD యంత్రం ప్రమాదవశాత్తూ అతడిపై నుంచి వెళ్లిది. దీంతో అతడి పొట్టభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు ప్రతాప్‌ను ఆసుపత్రికి తరలించేలోగా అప్పటికే మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.