Karimnagar

News May 30, 2024

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు: జగిత్యాల కలెక్టర్

image

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా హెచ్చరించారు. జగిత్యాల కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వానాకాలం పంటల సాగుకు విత్తనాల కొరత లేకుండా చూస్తామన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు తప్పక పొందాలని సూచించారు.

News May 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సుల్తానాబాద్ మండలంలో వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలి మృతి. @ చార్ధామ్ యాత్రకు వెళ్లి మృతి చెందిన హుజూరాబాద్ మండల వాసి. @ భక్తులతో కిటకిటలాడిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం. @ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న జగిత్యాల కలెక్టర్.

News May 29, 2024

కొండగట్టులో పెద్ద జయంతి ఉత్సవాలకు అంకురార్పణ

image

ప్రసిద్ధి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో పెద్ద జయంతి ఉత్సవాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. యాగశాల శుద్ధి, పుణ్యాహవాచనం, అఖండ దీపస్థాపన తదితర కార్యక్రమాలు చేపట్టారు. కాగా గురువారం ఉదయం 9 గంటల నుంచి జయంతి కార్యక్రమాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి.

News May 29, 2024

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. బుధవారం జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ లో 45.1°C, పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లిలో 45.4°C, కమాన్ పూర్ లో 45.2°C, ముత్తారంలో 44.9°C, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో 44.4°C, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 43.7°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News May 29, 2024

ఉప్పల్‌ స్టేడియంలో టీ20 మ్యాచ్‌.. కరీంనగర్ ఓటమి

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ మైదానంలో బుధవారం మెదక్‌ జట్టుతో జరిగిన టీ-20 ఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్ జట్టు ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న మెదక్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 రన్స్ మాత్రమే చేసింది. దీంతో 23 పరుగుల తేడాతో మెదక్ జట్టు ఫైనల్‌లో విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది.

News May 29, 2024

అంగన్వాడీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ 

image

తిమ్మాపూర్ మండలం LMD కాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో సీడీపీవోలు, ఏసీడీపీవోలు, సూపర్వైజర్లు, ఎంపిక చేసిన అంగన్వాడీ టీచర్లు, పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. బాధ్యాతయుతంగా విధులు నిర్వర్తించాలని, చిన్నారుల యోగా క్షేమాలు తెలుసుకోవాలన్నారు.

News May 29, 2024

KNR: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన KNRలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల ప్రకారం.. కొత్తపల్లి మం. లక్ష్మీపూర్‌కు చెందిన భానుప్రకాశ్(16), KNR హనుమాన్ నగర్‌కు చెందిన మిట్టు బైకుపై వెళ్తున్నారు. మంకమ్మతోటలోని కొత్త లేబర్ అడ్డ వద్ద కుక్క అడ్డు రావడంతో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టారు. భాను ప్రకాశ్ తలకు తీవ్ర గాయమై మృతి చెందగా.. మిట్టుకు తీవ్ర గాయాలయ్యాయి.

News May 29, 2024

KNR: దారుణం.. కిడ్నాప్ చేసి హత్య

image

రౌడీ షీటర్‌ను హత్యచేసిన ఘటన KNR జిల్లా మానకొండూర్ మం.లో జరిగింది. పచ్చునూర్‌కు చెందిన ప్రశాంత్ రెడ్డి(23)పై పలు కేసులు ఉండటంతో రౌడీషీట్ ఓపెన్ చేశారు. అదే గ్రామానికి చెందిన మరో రౌడీ షీటర్ రమేశ్ మరికొందరితో కలిసి ఉటూర్‌లో ప్రశాంత్‌ను చితకబాదారు. తప్పించుకోవడానికి ప్రయత్నించి బావిలో దూకడంతో రాళ్లతో కొట్టి, అనంతరం కిడ్నాప్ చేసి హత్య చేశారు. మానేరు నదిలో అతడి మృతదేహం లభించినట్లు పోలీసుల తెలిపారు.

News May 29, 2024

గోదావరిఖని: పుట్టినరోజు.. ఆదర్శవంతమైన నిర్ణయం

image

గోదావరిఖని గంగానగర్‌కు చెందిన అపరాధి ప్రశాంత్ కుమార్ మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతరం నేత్ర, అవయవ దానం చేస్తున్నట్లు సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులకు అంగీకార పత్రాన్ని అందించారు. ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధులు ఆయనకు డోనర్‌ కార్డును అందించి అభినందించారు. లింగమూర్తి, వాసు, సురేష్ కుమార్, అవినాష్, రాజు, పవన్, శేఖర్, సతీశ్ ఉన్నారు.

News May 29, 2024

కొండగట్టులో పెద్ద జయంతి ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

image

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం సాయంత్రం సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని, తర్వాత పెద్ద జయంతి ఏర్పాట్లను ఆలయ ఈఓతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవిచందర్, సీఐ నీలం రవి ఉన్నారు.