Karimnagar

News July 5, 2024

గడ్కరీతో బండి సంజయ్ కుమార్ భేటీ

image

కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భేటీ అయ్యారు. తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, కొత్త రహదారుల నిర్మాణ ప్రతిపాదనల అమలు అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మండలాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి సీఆర్ఐఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు.

News July 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోనరావుపేట మండలంలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.
@ వేములవాడలో వైభవంగా మహాలింగార్చన.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మండలాలకు ప్రత్యేక అధికారుల నియామకం.
@ అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న జగిత్యాల కలెక్టర్.
@ మెట్ పల్లి పట్టణంలో కిరాణ షాపులో మద్యం స్వాధీనం.
@ కొడిమ్యాల మండలంలో తహశీల్దార్ కార్యాలయాన్ని, ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్.

News July 4, 2024

KNR: స్మార్ట్‌సిటీ పనులు పూర్తయ్యేనా!

image

జూన్‌ 30తో కరీంనగర్ స్మార్ట్‌సిటీ మిషన్‌ గడువు పూర్తికాగా మార్చి 2025 వరకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. 2018 నుంచి ఇప్పటి వరకు జరిగిన 80 శాతం పనులకు సంబంధించి 745 కోట్లను సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లుల రూపంలో చెల్లించారు. ఇంకా రూ.191 కోట్లు విడుదల కావలసి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ మిషన్‌ గడువు పొడిగించడంతో ఇప్పటికైనా పనులు పూర్తవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News July 4, 2024

ధర్మపురి: లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.96,490, ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.41,832, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.26,450, అన్నదానం రూ.28,208 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News July 4, 2024

FLASH.. ఏసీబీకి చిక్కిన కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్

image

కరీంనగర్ డీసీఎంఎస్ కార్యాలయంలో జరిగిన దాడుల్లో మేనేజర్ వెంకటేశ్వర రావు, క్యాషియర్ కుమారస్వామిలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు రూ.లక్ష డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో లంచం తీసుకుంటున్న ఇద్దరిని పట్టుకుని, అదుపులోకి తీసుకున్నారు.

News July 4, 2024

జమ్మికుంట పత్తి మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

image

జమ్మికుంట పత్తి మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ఇస్తున్నట్లు కార్యదర్శి రెడ్డి నాయక్ తెలిపారు. ఈ నెల 5న శుక్రవారం అమావాస్య సందర్భంగా సెలవు, 6న శనివారం వారాంతపు యార్డు బంద్‌, 7న ఆదివారం సాధారణ సెలవు ఉన్నట్లు తెలిపారు. తిరిగి 8న సోమవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని, రైతులు గమనించి సహకరించగలరని కోరారు.

News July 4, 2024

జగిత్యాల: దొరకని ఎస్ఐ అజయ్ ఆచూకీ!

image

ACB అధికారుల దాడితో పరారైన రాయికల్ SI అజయ్ ఆచూకీ లభించలేదు. సదరు SI జూన్ 11న పట్టుకున్న ఇసుక ట్రాక్టరు విడిపించేందుకు బాధితుడు రాజేందర్ రెడ్డిని డబ్బులు డిమాండ్ చేయగా ఆయన ACBని ఆశ్రయించాడు. ఇటిక్యాలకు చెందిన మధ్యవర్తి రాజుకు రాజేందర్‌రెడ్డి రూ.10 వేలు ఇస్తుండగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. అధికారుల రాకతో పారిపోయిన SI 13 రోజులుగా పరారీలోనే ఉన్నారు. SI ఆచూకీ కోసం ACB అధికారులు గాలిస్తున్నారు.

News July 4, 2024

సిరిసిల్ల: ప్రేమ పేరుతో మోసం.. యువకుడికి రిమాండ్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి బయటకు తీసుకువెళ్లి కిడ్నాప్ చేశాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. మైనర్ అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

News July 4, 2024

ఇంటింటా ఇన్నోవేటర్‌పై అధికారులతో సమీక్ష: కలెక్టర్

image

కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఇన్నోవేటర్ తయారు కావాలని, నూతన ఆవిష్కరణలకు కరీంనగర్ జిల్లా వేదికగా నిలవాలని సూచించారు. చదువుకు వయస్సుతో పని లేదని, ప్రతి ఒక్కరూ ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలు చేపట్టాలని, విద్యాశాఖ అధికారులతో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.

News July 4, 2024

‘కొత్త చట్టం కింద ఒక MLAపై నమోదైన మొదటి కేసు ఇదే’

image

హుజూరాబాద్ MLA కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఒక ఎమ్మెల్యేపై భారత న్యాయ సంహిత కొత్త చట్టం కింద రాష్ట్రంలో నమోదైన మొదటి కేసు ఇదే కావడం గమనార్హం. నిన్న కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై జడ్పీ సీఈఓ చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.