India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ వేములవాడ రాజన్న ఆలయ కోడెల పంపిణీ ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్. @ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం. @ కోరుట్ల సామాజిక ఆస్పత్రిని తనిఖీ చేసిన జిల్లా ఉపవైద్యాధికారి. @ జగిత్యాల లో పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు. @ వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి బాధ్యతల స్వీకరణ. @ సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య. @ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు.
అర్హులైన రైతులకు ఉచితంగా రాజన్న కోడెల పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రతి నెల ఉచితంగా కోడెల పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు అర్హులను కమిటీ ద్వారా ఎంపిక చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో వినోద్ రెడ్డి పేర్కొన్నారు. పంపిణీ చేసిన కోడె, ఆవు సంరక్షణ కోసం పకడ్బందీగా అంగీకార పత్రాన్ని ఏర్పాటు చేశారు.
శాసనసభ్యులుగా ఎన్నికై ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రస్తావించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నిన్న జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తితే క్రిమినల్ కేసులు పెట్టడం కరీంనగర్ జిల్లా చరిత్రలో లేదని పేర్కొన్నారు. సమస్యలను సభ దృష్టికి తీసుకువస్తే విధులకు ఆటంకం కలిగించినట్లు ఎలా అవుతుందని గంగుల ప్రశ్నించారు.
అర్హులైన రైతులకు ఉచితంగా రాజన్న కోడెల పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రతి నెల ఉచితంగా కోడెల పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు అర్హులను కమిటీ ద్వారా ఎంపిక చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో వినోద్ రెడ్డి పేర్కొన్నారు. పంపిణీ చేసిన కోడె, ఆవు సంరక్షణ కోసం పకడ్బందీగా అంగీకార పత్రాన్ని ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబు, రీసెర్చ్ అధికారి వరప్రసాద్‌తో కలిసి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిహారం నిబంధనల ప్రకారం సకాలంలో అందించాలని సూచించారు. పలువురు అధికారులున్నారు.
కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో TGPSC గ్రూప్-2 ఉచిత గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యర్థులు తమ దరఖాస్తులను www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్లో జులై 5 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీధర్ బాబు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు, జిల్లా అడిషినల్ కలెక్టర్ అరుణ శ్రీ, మున్సిపల్ ఛైర్మన్ మమత రెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన వాహనాలు, సీజ్ చేసిన వాహనాలను యజమానులు సరైన ధృవపత్రాలు చూపించి తీసుకు వెళ్లవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 55 వాహనాలు ఉన్నట్లు తెలిపారు. 6 నెలల లోపు తీసుకవెళ్లకపోతే తర్వాత వేలం వేస్తామన్నారు. ఇతరత్రా సమాచారం కోసం 87126 56428, 90009 10619 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.
సిరిసిల్లలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసిల్లో నివాసం ఉండే చేనేత కార్మికుడు యాదగిరి(48) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసల్ల పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. 6 నెలలుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హత్యాయత్నం కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు చిగురుమామిడి SI రాజేష్ తెలిపారు. సైదాపూర్(M) దుద్దెనపల్లికి చెందిన శ్రీనివాస్ స్వగ్రామానికి వెళ్లేందుకు సోమవారం రాత్రి సుందరగిరి బస్టాండ్‌లో వేచి ఉన్నాడు. ఈ క్రమంలో సుందరగిరికి చెందిన అఖిల్, అజయ్, వేణు, నాగరాజు, సుమిత్‌లు శ్రీనివాసును బీర్ సీసాతో హత్య చేయబోగా తప్పించుకున్నాడు. శ్రీనివాస్ ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.