Karimnagar

News May 27, 2024

KNR: విధుల్లో నిర్లక్ష్యం.. విద్యుత్ ఉద్యోగుల సస్పెండ్

image

సుల్తానాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ DE తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి LC ఇవ్వని కారణంగా విద్యుత్ ఘాతంతో ఓ తాత్కాలిక కార్మికుడికి గాయాలు కావడానికి కారణం కావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో లైన్ ఇన్‌స్పెక్టర్ నరసయ్యతోపాటు వాయిద్య దుకాణాలు, మీసేవ కేంద్రాలకు విద్యుత్ మీటర్ జారీలో ఆలస్యం చేసిన లైన్‌మెన్ దీన్ దయాల్ ఉన్నారు.

News May 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో వైభవంగా కొండ స్వామి రథోత్సవం. @ జగిత్యాల జిల్లాలో 25 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న సిరిసిల్ల ఎస్పి. @ మేడిపల్లి మండలంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

News May 26, 2024

KNR: ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం జైనలో 46.5°C నమోదు అయ్యింది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో 46.1°C, నేరెళ్లలో 45.6°C, కోరుట్ల మండలం ఐలపూర్‌లో 45.6°C, పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్‌లో 45.7°C, జూలపల్లిలో 45.1°C, పాలకుర్తి మండలం తక్కల్లపల్లిలో 44.9°C, ముత్తారంలో 44.9°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News May 26, 2024

VMWD: లంకె బిందెల ఆశ చూపి రూ.30 లక్షలు దోచారు!

image

ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని చెప్పి ఓమహిళ నుంచి రూ.30లక్షలు కాజేసిన ముగ్గురు నిందితులను శనివారం VMWD పోలీసులు అరెస్ట్ చేశారు.CI వీరప్రసాద్ వివరాల ప్రకారం.. హన్మక్కపల్లికి చెందిన అంజవ్వకు ఎల్లయ్య, మహిపాల్, అబ్రహం అనే ముగ్గురు వ్యక్తులు అంజవ్వ తల్లి గారి ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని వాటిని తీయడానికి డబ్బు ఖర్చు అవుతుందని ఆమె నుంచి రూ.30 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ కేసు నమోదు చేశారు.

News May 26, 2024

KNR: ఈ నెల 28 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జగిత్యాల రోడ్డులోని కరీంనగర్ వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాలలో జరుగుతాయని తెలిపారు.

News May 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మల్లాపూర్ మండలంలో గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి. @ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం. @ సిరిసిల్లలో నేల కూలిన వందేళ్ల నాటి మహా వృక్షం. @ తిమ్మాపూర్ మండలంలో కారు అదుపుతప్పి ఒకరి మృతి. @ కోరుట్ల మండలం పైడిమడుగులో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. @ ఎల్లారెడ్డిపేట మండలంలో అధిక వేడి తాళలేక కోళ్ల ఫారం లో మూడు వేల కోళ్లు మృతి. @ జగిత్యాలలో ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్.

News May 25, 2024

KNR: గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి

image

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మల్లాపూర్ మండలంలో ఓ లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ ఖాదర్ ఓ ఫర్టిలైజర్ దుకాణంలో ఎరువులను కొనడానికి లారీని తీసుకొని వచ్చాడు. కాగా అదే సమయంలో ఒక్కసారిగా పిడుగులతో కూడిన వర్షం కురవడంతో ఆ శబ్దానికి భయానికి గురైన ఖాదర్ గుండెపోటుతో మృతి చెందాడు.

News May 25, 2024

KNR: రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి సూసైడ్

image

చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కదురు లక్ష్మీరాజం అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి శనివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

సిరిసిల్ల: మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

image

తండ్రి శంకర్ మరణ వార్త విని గుండెపోటుతో కుప్పకూలిన సిరిసిల్ల పట్టణానికి చెందిన అనూహ్య ను తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ చాకచక్యంతో స్పందించి సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు రక్షించాడు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, పలువురు అభినందించారు.

News May 25, 2024

కరీంనగర్: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

తిమ్మాపూర్ మండలం అలుగునూర్‌లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. కరీంనగర్ పట్టణం నంగునూరుకు చెందిన నరసయ్య శుక్రవారం రాత్రి కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో అలుగునూర్ వద్ద కారు అదుపు తప్పి రహదారి పక్కన గల గోడకు ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌కు గాయాలవ్వగా నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.