Karimnagar

News July 2, 2024

KNR: మొదటి రోజు 16 కేసులు నమోదు

image

కొత్త న్యాయ, నేర చట్టాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 10 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేసులు, జగిత్యాల జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మొదటి రోజు కేసుల నమోదు, సెక్షన్ల నమోదు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

News July 2, 2024

ధర్మపురిలో గుర్తుతెలియని మృతదేహం

image

జగిత్యాల జిల్లా ధర్మపురిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయ్యింది. పట్టణంలోని
అంబేడ్కర్ చౌరస్తాలోని కమలాపూర్ రోడ్డులో మంగళవారం వేకువజామున కంకర కుప్పపై స్థానికులు వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 2, 2024

కరీంనగర్: బస్టాండ్ సమీపంలోని యూనియన్ బ్యాంకులో మంటలు

image

కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్‌లో సోమవారం రాత్రి 11:30 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. కొద్దిసేపటికి బ్యాంకు నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు సమీపంలోని ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని అదుపుచేశారు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 2, 2024

RG-1లో 103 శాతం బొగ్గు ఉత్పత్తి

image

రామగుండం సింగరేణి సంస్థ RG-1లో గత నెల 103% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు GMచింతల శ్రీనివాస్ తెలియజేశారు. జూన్‌లో 3,58,900 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికిగానూ 3,70,418 టన్నులతో 103% ఉత్పత్తి సాధించామన్నారు. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను RG- 1 ఏరియాకు 49,40,000 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించామన్నారు.

News July 1, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సిరిసిల్లలో పలు వార్డులను పరిశీలించిన కలెక్టర్. @ పెద్దపల్లిలో ట్రైన్ ఢీకొని వ్యక్తి మృతి. @ తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు సస్పెండ్. @ కరీంనగర్ ప్రజావాణి కి 370, జగిత్యాల ప్రజావాణికి 44 ఫిర్యాదులు. @ మెట్పల్లి, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ. @ కథలాపూర్ మండలంలో బైక్ ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డాక్టర్స్ డే.

News July 1, 2024

కథలాపూర్: బైక్ ఇవ్వలేదని విద్యార్థి సూసైడ్

image

బైక్ ఇవ్వలేదని విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన కథలాపూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. పోసానిపేటకు చెందిన మారు మణిదీప్ (14) జూన్ 24న స్కూలుకు వెళ్లడానికి ఇంట్లో ఉన్న బైక్ ఇవ్వాలని వాళ్ళ అమ్మని అడగ్గా ఆమె ఒప్పుకోలేదు. దీంతో అతను గడ్డిమందు తాగాడు. అతనిని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 1, 2024

రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చిండు: కేటీఆర్

image

రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జగిత్యాలలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారని పార్టీ ఫిరాయింపులను రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలను దమ్ముంటే పదవికి రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్నారు. ప్రజలు అప్పుడు తేలుస్తారని చెప్పారు.

News July 1, 2024

తంగళ్లపల్లి: హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దర్యాప్తు చేశారు. నివేదిక ఐజీకి పంపగా దాని ఆధారంగా మల్టీ జోన్ -1 ఇన్‌ఛార్జి ఐజీ సుధీర్‌బాబు సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

News July 1, 2024

జగిత్యాల: సంజయ్ దమ్ముంటే పదవికి రాజీనామా చెయ్: కేటీఆర్

image

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. సోమవారం జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంగిలి మెతుకులకు ఆశపడి తన స్వార్థం కోసం BRSను వదిలిపోయి దొంగల్లో కలిశాడని ఆరోపించారు. ఆయన పోవడంతో జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నారు. గాలికి గడ్డపారలు కొట్టుకపోవని గడ్డిపోచలు మాత్రమే పోతాయన్నారు.

News July 1, 2024

సిరిసిల్ల: కానిస్టేబుల్‌పై హత్యాయత్నం.. వ్యక్తి అరెస్టు

image

కానిస్టేబుల్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఇసుక స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. SP అఖిల్ మహాజన్ ప్రకారం.. రామలక్ష్మణపల్లె మానేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈక్రమంలో గురుబాబు(30) అనే వ్యక్తి ట్రాక్టర్‌ను నడిపి చెరువులోకి తోసివేశాడు. కాగా, ఆ సమయంలో ట్రాక్టర్‌పై కానిస్టేబుల్ సత్యనారాయణ ఉండటంతో తీవ్ర గాయాలయ్యాయి.