Karimnagar

News July 1, 2024

జగిత్యాల: నేటి నుంచి నూతన చట్టాలు అమలు

image

నేటి నుంచి నూతన చట్టాలు అమలులోకి వస్తాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూతన న్యాయ, నేర చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. దేశ అంతర్గత భద్రతలో కొత్త చట్టాలు నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసుశాఖకు చెందిన డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

News July 1, 2024

KNR స్మార్ట్‌సిటీ పనుల పూర్తికి అవకాశం

image

స్మార్ట్‌సిటీ మిషన్ పనుల గడువును వచ్చే మార్చివరకు పొడిగించడంతో KNRలోని పెండింగ్‌ పనుల పూర్తికి అవకాశముంది. KNR స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ పరిధిలో రూ.647.32కోట్లతో చేపట్టిన 22 ప్రాజెక్టుల పనులు పూర్తి కాగా.. మరో 23 ప్రాజెక్టులకు రూ.259.79 కోట్లను కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేటాయించింది. దీంతో రహదారులు, మురుగుకాలువలు, ట్రాఫిక్ సిగ్నల్స్, కమాండ్ కంట్రోల్ తదితర పనులు అందుబాటులోకి వచ్చాయి.

News July 1, 2024

నేటి నుంచి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటం

image

సింగరేణిని కాపాడుకునేందుకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటానికి సిద్ధమైంది. సోమవారం నుంచి సింగరేణి వ్యాప్తంగా దశలవారీగా ఆందోళన కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి స్పష్టం చేశారు. 1న గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడంతో పాటు గని అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు.

News July 1, 2024

KNR: అంగన్వాడి కోడిగుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం

image

అంగన్వాడి కోడిగుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షమైన ఘటన కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని మన్విత అనే చిన్నారికి అంగన్వాడి కేంద్రంలో కోడిగుడ్లు ఇచ్చారు. ఆదివారం చిన్నారికి కోడిగుడ్డును ఇచ్చేందుకు మన్విత తల్లి గుడ్డును ఉడకబెట్టే క్రమంలో ఓ గుడ్డు బరువు తక్కువగా ఉండి తేడాగా ఉన్నట్లు గుర్తించింది. వెంటనే గుడ్డుపై పెంకు తొలగించి చూడగా లోపల కోడి పిల్ల కదులుతూ కనిపించింది. దీంతో వారు షాక్ అయ్యారు.

News June 30, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఇండియా వరల్డ్ కప్ గెలవడం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు. @ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ ఎల్లారెడ్డిపేట మండలంలో ఆటో బోల్తా పడి మహిళ మృతి. @ సిరిసిల్ల పట్టణంలో బావిలో పడిన పిల్లిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. @ వెల్గటూర్ మండలంలో భారీ వర్షం. @ మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న వేములవాడ డీఎస్పీ. @ రేపటినుండి నూతన చట్టాలు: జగిత్యాల ఎస్పీ.

News June 30, 2024

పార్టీ మార్పుపై జగిత్యాల ఎమ్మెల్యే కీలకవ్యాఖ్యలు

image

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కార్యకర్తలు తనతోపాటు నడవాలని కోరారు. గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

News June 30, 2024

వేములవాడ: మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులే: డీఎస్పీ

image

మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులేనని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి ఆదివారం తెలిపారు.
నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన, సగం నెంబర్ ప్లేట్ కలిగి ఉన్న వాహనదారులపై క్రిమినల్ కేసులే తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ స్పెషల్ డ్రైవ్‌లో 1223 కేసులు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

News June 30, 2024

రాజన్న గోశాలలో 5 కోడెల మృత్యువాత

image

వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో 5 కోడెలు శనివారం మృతి చెందాయి. మహాలక్ష్మి ప్రాంతంలోని మూలవాగులో గోశాల సిబ్బంది కోడెలను ట్రాక్టర్‌లో తరలించి పూడ్చి వేశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న కోడెలు మృతి చెందినట్లు తెలుస్తోంది.

News June 30, 2024

KNR: ఇన్‌స్టాగ్రాం పరిచయం.. బాలికపై అత్యాచారం

image

ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకొని బాలికను ఓ యువకుడు అత్యాచారం చేశాడు. కమలాపూర్ మండలంలో తాతయ్య ఇంటి వద్ద ఉంటున్న ఓ బాలిక (15)తో కామారెడ్డికి చెందిన శంకర్ (23) ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మిన ఆ బాలిక ఈనెల 23న ఇంట్లో నుంచి వెళ్లింది. అయితే శంకర్ తనను నమ్మించి అత్యాచారం చేశాడని బాలిక తన మేనమామకు చెప్పడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు.

News June 30, 2024

రామగిరి: కానిస్టేబుల్ సస్పెన్షన్

image

పోలీసు ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన రామగిరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే సదానందంను సస్పెండ్ చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినా, విధులలో నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు.