Karimnagar

News September 23, 2024

కరీంనగర్: నేటి నుంచి పలు రైళ్ల రద్దు

image

కాజీపేట-బల్లార్ష మధ్య రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బల్లార్షా వరకు నడిచే పలు రైళ్లను నేటి నుంచి అక్టోబర్ 8వరకు రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. రైళ్ల రద్దుతో దసరా పండుగ నేపథ్యంలో పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట ప్రజలకు ప్రయాణ కష్టాలు ఎదురుకానున్నాయి. విద్యార్థులు, వ్యాపారస్థులు, ఉద్యోగులు ప్రయాణాలకు ఆర్టీసీపై ఆధారపడాల్సి ఉంటుంది.

News September 23, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.1,91,128 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.77,614, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.45,160, అన్నదానం రూ.68,354,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News September 22, 2024

కరీంనగర్: ఇక పల్లె బస్సుల్లోనూ క్యూఆర్ కోడ్!

image

పల్లె వెలుగు బస్సుల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులు సులభంగా ఛార్జీలు చెల్లించేందుకు క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే సూపర్ లగ్జరీ లాంటి బస్సుల్లో ఈ సదుపాయం ఉండగా ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లోకి సైతం తీసుకొచ్చారు. కాగా ఉమ్మడి జిల్లాలో 11 డిపోలకు సంబంధించి 811 ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో 479 ఆర్టీసీ, 332 అద్దె బస్సులు నడుపుతున్నారు.

News September 22, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సిరిసిల్లలో షార్ట్ సర్క్యూట్ తో కరెంట్ పోల్ దగ్ధం. @ గోదావరిఖని శివారు గోదావరి నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కరీంనగర్ లో రెస్టారెంట్ భవనంలో అగ్ని ప్రమాదం. @ తంగళ్ళపల్లి మండల నూతన ఎస్సైగా రామ్మోహన్. @ పెగడపల్లి మండలం లో 500 గ్రాముల గంజాయి పట్టివేత. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు.

News September 22, 2024

రామగుండం: ఈనెల 30 వరకు డిగ్రీ, పీజీ దరఖాస్తులకు అవకాశం

image

KU దూర విద్యా కేంద్రంలో డిగ్రీ, పీజీ చేయడానికి SEP-30 దరఖాస్తులకు అవకాశం ఉందని సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ చంద్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ పాసైన వారికి అవకాశం ఉందన్నారు. దూర ప్రాంతాల వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు 8341 3850 00 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

News September 22, 2024

నర్సింగాపూర్‌లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సూత్రం ఆంజనేయులు(22) ఈరోజు ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ ప్రారంభించారు.

News September 22, 2024

మెట్‌పల్లి: గుంతలు పూడ్చండి అంటూ వినూత్న ఫ్లెక్సీ

image

మెట్‌పల్లి నుంచి వేంపేట మీదుగా నిర్మల్ జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. రైల్వే గేటు కింద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. గుంతల్లో పడి గాయాలపాలవుతున్నామంటూ కొందరు వ్యక్తులు వినూత్న ప్రయత్నం చేశారు. గుంతల పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ‘మమ్మల్ని పూడ్చండి’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

News September 21, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి. @ ఎండపల్లి మండలంలో స్కూల్ బస్సు, ద్విచక్ర వాహనం డీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ వీర్నపల్లి మండలంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి. @ మెట్పల్లి, మల్లాపూర్ మండలాల్లో పర్యటించిన జగిత్యాల కలెక్టర్. @ మెట్ పల్లి మండల వాసికి డాక్టరేట్. @ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయుల సస్పెండ్.

News September 21, 2024

పెద్దపల్లి: ఇద్దరి ఉపాధ్యాయుల సస్పెండ్

image

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఇద్దరు కీచక ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు సదానందం, అబ్దుల్ ఖాదిరిలపై విచారణ జరిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సస్పెండ్ చేస్తూ ఇన్‌ఛార్జి డీఈవో జనార్దన్‌రావు ఉత్తర్వులు ఇచ్చారు.

News September 21, 2024

కరీంనగర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్తంభించిన మీసేవా సేవలు

image

పదిరోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మీసేవా సేవలు నిలిచిపోయాయి. దీంతో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర డేటా సెంటర్లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్తున్నారు.