Karimnagar

News May 20, 2024

కరీంనగర్: ఫ్రీ బస్.. 5 నెలల్లో ఏకంగా 4.5 లక్షల మంది

image

కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ స్కీం కింద ఈ 5 నెలల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం చాలా పెరిగింది. దీంతో RTCకి మంచి ఆదాయం సమకూరుతోంది. కరీంనగర్ రీజియన్‌లో KNR-1, 2, హుస్నాబాద్, హుజూరాబాద్, కోరుట్ల, GDK, సిరిసిల్ల, వేములవాడ, మెట్‌పల్లి, జగిత్యాల డిపోలున్నాయి. వీటి పరిధిలో గతంలో రోజూ 2.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. ‘మహాలక్ష్మి’ వచ్చాక ఆ సంఖ్య 4.5 లక్షలకు చేరింది.

News May 20, 2024

KNR: యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన HYD దోమలగూడ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బెజ్జంకి మండలం తోటపల్లె గ్రామానికి చెందిన అజయ్(26) బోయిన్‌పల్లి అంజయ్యనగర్‌లో ఉంటూ శ్రీకర ఆసుపత్రిలో అనస్థీషియా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాణిగంజ్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తున్న అజయ్ బైక్‌ను సరకు రవాణా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదైంది.

News May 20, 2024

కొండగట్టు: పెద్ద జయంతి స్పెషల్.. చేయాల్సిన పనులు ఇవి!

image

ఈనెల 29 నుంచి పెద్దహనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. వేడుకలకు ఆలయ పరిసరాల్లో చేయాల్సిన పనులు.
– కొండపైన పుష్కరిణిలో నీటిని తొలగించి కొత్త నీటిని నింపాలి.
– మెట్లపక్కన జల్లు స్నానాల కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
-ఘాటురోడ్, బొజ్జపోతన్న సమీపంలో రహదారులకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి.
-కాలినడకన వచ్చే భక్తుల కోసం వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి
-పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేయాల్సి ఉంటుంది.

News May 20, 2024

కరీంనగర్: కొత్త రేషన్ కార్డులపై ఆశలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులు ఎప్పుడు మంజూరు చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా1947 రేషన్ షాపులు ఉండగా 9,80,261 ఆహారభద్రత కార్డులు ఉండగా 28,24,897 మంది కుటుంబ సభ్యులు రాయితీతో కూడిన లబ్ధి పొందుతున్నారు.

News May 20, 2024

REWIND: బండి సంజయ్‌కు 89,016 ఓట్లు!

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బండి సంజయ్‌కు ఎంపీ ఎన్నికలు కలిసొస్తాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ 2019లో ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోగా 89,016 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈసారి కూడా ఎంపీగా గెలుస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో త్రిముఖ పోటీ ఉండగా బండి సంజయ్ గెలుస్తారో లేదో వేచి చూడాలి.

News May 20, 2024

రామగుండం: నకిలీ విత్తనాలు రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా: సీపీ

image

నకిలీ, కల్తీ విత్తనాలు స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతామని ఆదివారం రామగుండం సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు . వ్యవసాయ, ప్రభుత్వ శాఖల సిబ్బందితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని సీపీ తేల్చిచెప్పారు.

News May 19, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ చందుర్తి మండలంలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ తంగళ్ళపల్లి మండలంలో కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రుల అరెస్ట్. @ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఎస్పీ. @ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్ పల్లి మండలంలో వైభవంగా ప్రారంభమైన కొండస్వామి బ్రహ్మోత్సవాలు. @ కొడిమ్యాల మండలంలో లారీ, పాల వ్యాన్ డీ.. ఒకరి మృతి.

News May 19, 2024

కరీంనగర్: మరో 15 రోజులే.. మీ MP ఎవరు..?

image

జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సరిగ్గా మరో 15 రోజుల్లో మన ఎంపీ ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు. – మరి మీ MP ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..

News May 19, 2024

సిరిసిల్ల: కూతురిని హతమార్చిన తల్లిదండ్రుల అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

image

కన్నకూతురిని హత్యచేసిన తల్లిదండ్రుల్ని రిమాండ్‌కు తరలించామని SP అఖిల్ మహాజన్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన చెప్యాల ఎల్లవ్వ- నర్సయ్య దంపతులకు కూతురు ప్రియాంక ఉంది. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఆమె ప్రవర్తన తీరుపై కోపగించుకున్న తల్లిదండ్రులు ఈనెల 14న ఆమెను హత్యచేశారు. ఆదివారం నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే మృతురాలికి పెళ్లై, 13 నెలల బాలుడు ఉండటం గమనార్హం.

News May 19, 2024

KNR: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

image

తల్లి మందలించిందని ఓ యువతి గడ్డి మందు తాగి మృతి చెందింది. స్థానికుల వివరాలు.. కమాన్పూర్ మం. బురకాయ పల్లె గ్రామానికి చెందిన బొడ్డుపల్లె సింధు(19)ను ఈ నెల 14న ఇంట్లో చెప్పిన పని చేయడం లేదని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.