Karimnagar

News June 27, 2024

సీఎం రేవంత్ నివాసానికి జీవన్ రెడ్డి

image

ఢిల్లీలోని రేవంత్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గురువారం వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సమావేశమయ్యారు. జీవన్ రెడ్డికి పార్టీ హై కమాండ్ తగిన ప్రాధాన్యత ఇస్తుందని, వేరే పార్టీలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

News June 27, 2024

జగిత్యాల: కూతురితో కలిసి బావిలో దూకి తల్లి సూసైడ్

image

జగిత్యాల జిల్లాలో కూతురితో కలిసి తల్లి బావిలో దూకింది. స్థానికుల వివరాలు.. సారంగపూర్ మండలం అర్పల్లికి చెందిన బొండ్ల మౌనికకు ఆమె భర్తతో నిన్న రాత్రి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన మౌనిక కూతురితో కలిసి బావిలో దూకింది. గురువారం ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మౌనిక భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

News June 27, 2024

అలకవీడిన MLC జీవన్ రెడ్డి!

image

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించి సర్దిచెప్పింది. ఎమ్మెల్యేల చేరికలు పార్టీకి అవసరమని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షీ, కేసీ వేణుగోపాల్‌ నచ్చజెప్పడంతో అలకవీడారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యమిస్తామన్న భరోసాతో ఆయన సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.

News June 27, 2024

కరీంనగర్: గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్టులు

image

TGPSC గ్రూప్-2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవి కుమార్ తెలిపారు. www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మొదటి గ్రాండ్ టెస్ట్ జులై 08, 09, రెండో టెస్ట్ జులై 15, 16, మూడో టెస్ట్ జులై 22, 23, నాలుగో టెస్ట్ జులై 30, 31వ తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు.

News June 27, 2024

కరీంనగర్: భార్య ఆత్మహత్య.. భర్తకు జైలు శిక్ష

image

భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ KNR జడ్జి శ్రీలేఖ బుధవారం తీర్పునిచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన సుమన్, అతడి భార్య మన్నవరాణి బతుకుదెరువుకు వచ్చి గంగాధర(M) గర్శకుర్తిలో ఉంటున్నారు. సుమన్ మద్యానికి బానిసై భార్యను వేధించాడు. దీంతో పిల్లలను భర్త వద్ద ఉంచవద్దని లేఖ రాసి 2019 ఏప్రిల్ 2న ఉరేసుకుంది. సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు జైలు శిక్ష విధించింది.

News June 27, 2024

KNR: వయోవృద్ధుల సమస్యలను సత్వరమే పరిష్కరించండి: కలెక్టర్

image

కొడుకులు ఇబ్బందులు పెట్టే వయోవృద్ధులు, తల్లిదండ్రులకు అధికారులు అండగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ చట్టం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ఆమె సమీక్షా నిర్వహించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. కొడుకులను పిలిపించి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యలు పరిష్కరించాలన్నారు.

News June 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ పెగడపల్లి మండలంలో బైక్, టాటా ఏస్ డీ.. ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు. @ ముస్తాబాద్ మండలంలో 4 ఇసుక ట్రాక్టర్లు సీజ్. @ రాయికల్ మండలంలో తనిఖీలు నిర్వహించిన జగిత్యాల కలెక్టర్. @ పెండింగ్ పనులను పూర్తి చేయాలన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గా రఘువరన్. @ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్న కరీంనగర్ కలెక్టర్. @ ఢిల్లీ వెళ్ళిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

News June 26, 2024

KNR: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: కలెక్టర్

image

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. ఎంతో కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులకు మచ్చతెచ్చే పనులు చేయవద్దని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అతిథిగా హాజరై మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.

News June 26, 2024

దిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

image

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ దిల్లీకి చేరింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ జీవన్ రెడ్డిని చర్చలకు పిలిచినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది.

News June 26, 2024

కరీంనగర్: ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం

image

కరీంనగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గుర్తింపు పొందిన ట్రాన్స్‌జెండర్లకు కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లకు ఎలాంటి సమస్యలు ఉన్నా హెల్ప్‌డెస్క్‌లో చెప్పాలన్నారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, వృత్తి నైపుణ్యశిక్షణ ఇచ్చేలా కృషిచేస్తామన్నారు.