Karimnagar

News May 17, 2024

KNR: పార్లమెంటు ఫలితాలపైనే స్థానిక ఆశలు!

image

పార్లమెంటు ఎన్నికల ఫలితాల పైనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల భవితవ్యం ఆధారపడి ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇందుకోసం ఏ పార్టీ మద్దతు ఉంటే తమకు లాభం ఉంటుందనే విషయమై ఇప్పటికే అంచనాకు వచ్చి మొన్నటి ఎన్నికల్లో కొందరు పార్టీ మారారు. ఈ ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీల మార్పు కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తుంది.

News May 17, 2024

సింగరేణి ఉద్యోగాల దరఖాస్తుకు సాంకేతిక సమస్య

image

సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ లో అప్లై చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించగా రెండు రోజులుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. గురువారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించి ఆన్లైన్ సేవలు ముందుకు తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

News May 17, 2024

KNR: PG పరీక్ష ఫలితాలు విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో గత మార్చ్ నెలలో నిర్వహించిన పీజీ ఫలితాలు వెలువడినట్టు పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. MBA, MCA, MSC, ఒకటవ, మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.satavahana.ac.inలో అందుబాటులో ఉంచామని, ఫలితాలను చూసుకోవాలని ఆయన సూచించారు.

News May 17, 2024

జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి మర్డర్

image

జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. బుగ్గారం మం. గోపులాపూర్‌కు చెందిన బెస్త శ్రీనివాస్ (35), అతని తమ్ముడు మహేష్‌పై రాడ్లు, పైప్‌లతో గురువారం అర్ధరాత్రి 5గురు ముసుగు వేసుకుని వచ్చి రాడ్లు, పైప్‌లతో దాడి చేయగా బెస్త శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్‌కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. భూ తగాదాల నేపథ్యంలోనే గొడవలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.

News May 17, 2024

KNR: నగరవాసుల కంటే గ్రామీణ ఓటర్లే గ్రేట్

image

లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంలో నగరవాసుల కంటే గ్రామీణ ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. పెద్దపల్లి పరిధిలోని 7 నియోజకవర్గాల్లో రామగుండం, మంచిర్యాలలో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. మొత్తం 15,86,430 మంది ఓటర్లు ఉండగా వీరిలో 10,83,453 మంది ఓటు వేశారు. గ్రామీణ ప్రాంతాలైన సోనాపూర్‌లో 92.02, ఇసన్వాయిలో 83.91, తలమాల 86.42, కప్పరావుపేట పోలింగ్ కేంద్రంలో 84.19 శాతం అధిక పోలింగ్ నమోదైంది.

News May 17, 2024

KNR: RTCకి రూ.10.94 కోట్ల ఆదాయం

image

లోక్‌కసభ ఎన్నికలు RTCకి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. కరీంగనర్ రీజియన్‌లో 11 డిపోలు ఉండగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మే 10 నుంచి 14 వరకు వివిధ ప్రాంతాలకు 4350 బస్సులు నడిపింది. వీటిలో 510 అదనపు బస్సులున్నాయి. 5రోజుల్లో 19.42 లక్షల మంది RTC బస్సుల్లో ప్రయాణించగా రూ.10.94 కోట్ల ఆదాయం సమకూరింది. జగిత్యాల డిపో రూ.1.65 కోట్లు, గోదావరిఖని డిపో రూ.1.59 కోట్లతో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.

News May 17, 2024

పెద్దపల్లి: స్ట్రాంగ్ రూంలను నిరంతరం పర్యవేక్షించాలి: కలెక్టర్

image

అధికారులు స్ట్రాంగ్ రూంలను నిరంతరం పర్యవేక్షించాలని పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. గురువారం సెంటినరీ కాలనీ జేఎన్టీయూ కళాశాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూంలోకి అనుమతి లేకుండా ఎవరు లోపలికి వెళ్లే వీలు లేదని, సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుందన్నారు. అనంతరం స్ట్రాంగ్ రూంలకు వేసిన సీల్‌లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్‌లో సంతకం చేశారు.

News May 16, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల కురిసిన వర్షం. @ ఈదురుగాలుల వర్షానికి నేల కూలిన చెట్లు. @ వెలగటూరు మండలంలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య. @ తిమ్మాపూర్ మండలంలో పిడుగు పడి ఆవు, లేగా దూడ మృతి. @ సిరిసిల్ల జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి.

News May 16, 2024

దక్షిణాఫ్రికాలో కొత్తపేట వాసి మృతి

image

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నడిగట్టు సత్తయ్య దక్షిణాఫ్రికాలో మృతిచెందాడు. గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు బంధువులు తెలిపారు. బతుకుదెరువు కోసం వేరే దేశం వెళ్లి.. ఇలా ఆకస్మిక మరణం చెందడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

News May 16, 2024

వేములవాడ: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

image

పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వేములవాడ మండలం సాత్రాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పొలం వద్ద పనిచేస్తున్న కంబాల శ్రీనివాస్ (32)పై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.