Karimnagar

News May 15, 2024

కరీంనగర్: 2,686 మందికి డబ్బులు వాపస్!

image

రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. KNR జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీకి ఇప్పటికే DDలు చెల్లించిన వారందరికీ తిరిగి డబ్బులు వాపసు ఇవ్వనున్నారు. రెండో విడతలో యూనిట్‌ ధర రూ.1.75 లక్షలుగా ఉండటంతో లబ్ధిదారుల వాటాగా రూ.43,750 చెల్లించారు. ఈ విడతలో 3,404 యూనిట్ల కోసం DDలు చెల్లించగా 718 మందికి పంపిణీ చేశారు. మిగిలిన 2,686 మందికి డీడీల సొమ్ము తిరిగి చెల్లించనున్నారు.

News May 15, 2024

కరీంనగర్: 23,15,233 మంది ఓటేశారు!

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా 32,16,115 మంది ఓటర్లు ఉండగా.. 23,15,233 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానకొండూరు నియోజకవర్గంలో 77.75% అత్యధికంగా ఓట్లు పోలవగా.. అత్యల్పంగా కరీంనగర్‌లో 60.51% పోలవడం గమనార్హం. మొత్తంగా 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 8,34,164 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటు వినియోగంలో పట్టణ ఓటర్ల కన్నా గ్రామీణ ఓటర్లలోనే చైతన్యం ఎక్కువ ఉంది. మరి మీరు ఓటేశారా? కామెంట్.

News May 15, 2024

REWIND-2019: కరీంనగర్‌లో BJPకి 89,508 ఓట్ల మెజార్టీ!

image

కరీంనగర్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. బీ వినోద్ కుమార్(BRS)పై బండి సంజయ్ (BJP) 89,08,768 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. పొన్నం ప్రభాకర్(కాంగ్రెస్) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో రాజేందర్ రావు (కాంగ్రెస్), బండి సంజయ్(BJP), వినోద్ కుమార్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 14, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఇబ్రహీంపట్నం మండలంలో పాముకాటుతో మహిళ మృతి. @ వేములవాడలో ఆటో బోల్తా పలువురికి గాయాలు. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కాటారం మండలంలో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. @ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ అభ్యర్థి వంశీ. @ ఎల్లారెడ్డిపేట మండలంలో ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న కేటీఆర్. @ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్న మెట్ పల్లి మెజిస్ట్రేట్.

News May 14, 2024

FINAL: పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 67.87%

image

పెద్దపల్లి లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. బెల్లంపల్లి-70.96%, చెన్నూర్- 68.53%, ధర్మపురి73.35%, మంచిర్యాల-60.84%, మంథని-69.98%, పెద్దపల్లి- 71.34%, రామగుండం-61.59 శాతంగా ఉన్నాయి. మొత్తంగా 67.87% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి వంశీకృష్ణ, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ బరిలో ఉన్నారు.

News May 14, 2024

FINAL: కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 72.54%

image

కరీంనగర్ లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. చొప్పదండి- 75.36%, హుస్నాబాద్- 77.25%, హుజూరాబాద్-73.82%, కరీంనగర్-60.51%, మానకొండూర్- 77.75%, సిరిసిల్ల-75.27%, వేములవాడ-74.44 శాతంగా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 72.54% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో BJP నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి రాజేందర్ రావు, BRS నుంచి వినోద్ కుమార్ బరిలో ఉన్నారు.

News May 14, 2024

KNR: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

image

కరీంనగర్‌ ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ లోక్‌సభలో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత KNR రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో‌ ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో‌ టెన్షన్‌ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

News May 14, 2024

KNRలో EVMలు ఎక్కడెక్కడ మొరాయించాయంటే.?

image

*పోల్ చీటీలు అందకపోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పేర్లు ఉండి ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో పలువురు నిరాశ చెందారు.
*వావిలాలపల్లిలో ఈవీఎం పని చేయకపోవడంతో పోలింగ్‌ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
*ఓటరు చీటీ మీద కేంద్రం కెన్‌క్రెస్ట్‌ పాఠశాల పేరు ఉండగా.. అక్కడికి వెళ్లి చూసే సరికి SR పాఠశాల బోర్డు కనిపించడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు.
*చిగురుమామిడి, శంకరపట్నం మండలాల్లో ఈవీఎంలు మొరాయించాయి.

News May 14, 2024

ఓటేయడానికి దుబాయ్ నుంచి కరీంనగర్‌కు

image

ఉపాధికి దుబాయ్ వెళ్లిన ముగ్గురు లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయడానికి సొంతూరుకు వచ్చారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు చెందిన బాబురావు దుబాయ్‌లోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సేవలాల్‌తండాకు చెందిన దేవనాయక్ ఆ దేశంలోనే పని చేస్తున్నాడు. వీరు ఓటేయడం కోసమే స్వగ్రామానికి వచ్చినట్లు తెలిపారు. మద్దికుంటకు చెందిన సుధాకర్‌రావు, శ్రవణ్‌కుమార్, మాధురిలు ముంబై నుంచి వచ్చి ఓటేశారు.

News May 14, 2024

PDPL: సంబరపడుతూ కనిపించిన వివేక్‌ వెంకటస్వామి

image

PDPL ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి కళ్లల్లో విజయానందం కనిపించింది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేస్తూ పుత్రోత్సాహంతో సంబరపడుతూ కనిపించారు. ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయిన ఆయన.. MLA ప్రేమ్‌సాగర్‌రావు అదే కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చారని తెలవడంతో మరోసారి వచ్చారు. చిరునవ్వు చిందిస్తూ.. చేయి కలిపేందుకు రాగా ప్రేమ్‌సాగర్‌రావు దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు.