Karimnagar

News May 13, 2024

@ 3PM: పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 55.92%

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-63.00%, చెన్నూర్-58.65%, ధర్మపురి-60.23%, మంచిర్యాల-52.97%, మంథని-56.20%, పెద్దపల్లి-55.60%, రామగుండం-47.10 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 55.92% నమోదైంది.

News May 13, 2024

@3 PM: కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 58.24%

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. చొప్పదండి- 61.58%, హుస్నాబాద్- 63.98%, హుజూరాబాద్-60.15%, కరీంనగర్-47.45%, మానకొండూర్-62.55%, సిరిసిల్ల-55.67%, వేములవాడ-62.45శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 58.24% నమోదైంది.

News May 13, 2024

@ 1PM: పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 44.40%

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-50.42%, చెన్నూర్-45.45, ధర్మపురి-47.15%, మంచిర్యాల-41.40%, మంథని-48.21%, పెద్దపల్లి-44.40%, రామగుండం-38.78 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 44.40% నమోదైంది. కాగా కరీంనగర్‌లో పోలింగ్ 45.11% నమోదైంది.

News May 13, 2024

@1 PM: కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 45.11%

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇలా ఉన్నాయి. చొప్పదండి-48.40%, హుస్నాబాద్-48.83%, హుజూరాబాద్-39.66%, కరీంనగర్-37.95%, మానకొండూర్-49.10%, సిరిసిల్ల-46.19%, వేములవాడ-50.11గా ఉన్నాయి.

News May 13, 2024

రామగుండం: ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్లు

image

రామగుండం పట్టణంలో పలువురు ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం వారి బాధ్యత అని వారు తెలిపారు. పోలింగ్ సెంటర్లో అన్ని సౌకర్యాలను కల్పించారని పేర్కొన్నారు.

News May 13, 2024

పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (26.17%)

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-30.52%, చెన్నూర్-26.35, ధర్మపురి-28.11%, మంచిర్యాల-24.87%, మంథని-27.45%, పెద్దపల్లి-25.57%, రామగుండం-21.46శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (26.14%)

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి.
చొప్పదండి-29.09%, హుస్నాబాద్-30.35%, హుజూరాబాద్-22.89%, కరీంనగరర్-20.78%, మానకొండూర్-24.96%, సిరిసిల్ల-27.80%, వేములవాడ-30.17శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కరీంనగర్ సీపీ

image

కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ఉన్న పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందిని ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద సమస్యలు ఉన్నట్లయితే దృష్టికి తీసుకురావాలన్నారు. ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే అందుబాటులో ఉండే సమీప అధికారులకు తెలియజేయాలన్నారు.

News May 13, 2024

కరీంనగర్: దూరంగా యువత

image

ఎన్నికల్లో సాధారణంగా అభ్యర్థుల గెలుపోటములను యువ ఓటర్లు నిర్దేశించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 29.78లక్షల మంది ఓటర్లలో 23.50శాతం యువతే ఉన్నారు. 2014 KNR లోక్‌సభ స్థానంలో 72.23%, పెద్దపల్లిలో 71.68శాతంగా ఉంది. KNRలో 16,50,893 మంది ఓటర్లకు 11,46,467(69.45) మంది ఓటేశారు. పెద్దపల్లిలో 14,78,062 మందికి 9,67,801 మంది(65.48%) ఓటేశారు. అంటే రెండు చోట్లా 80%లోపే పోలింగ్ నమోదయింది.

News May 13, 2024

ఓటు వేసిన బీజేపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్

image

కరీంనగర్‌లోని జ్యోతి నగర్లో గల సాధన హై స్కూల్‌లో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆయన సతీమణి అపర్ణతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారితో పాటు తల్లి, కుమారుడు ఓటు వేశారు. అంతకముందు మహాశక్తి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జ్యోతినగర్‌లోని తన నివాసానికి వెళ్లి హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారిని దర్శించుకున్నారు.