Karimnagar

News May 13, 2024

ఓటు వేసిన బీజేపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్

image

కరీంనగర్‌లోని జ్యోతి నగర్లో గల సాధన హై స్కూల్‌లో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆయన సతీమణి అపర్ణతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారితో పాటు తల్లి, కుమారుడు ఓటు వేశారు. అంతకముందు మహాశక్తి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జ్యోతినగర్‌లోని తన నివాసానికి వెళ్లి హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారిని దర్శించుకున్నారు.

News May 13, 2024

పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్ అప్‌డేట్

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-12.12%, చెన్నూర్-9.49, ధర్మపురి-8.70%, మంచిర్యాల-10.49%, మంథని-102.%, పెద్దపల్లి-8.42%, రామగుండం-7.64శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ అప్‌డేట్

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి.
చొప్పదండి-10.90%, హుస్నాబాద్-11.84, హుజూరాబాద్-9.45%, కరీంనగర్-10.23%, మానకొండూర్-10.06%, సిరిసిల్ల-7.23%, వేములవాడ-12.10శాతంగా ఉన్నాయి.

News May 13, 2024

KNR: ఓటేసిన BRS ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్

image

కరీంనగర్‌లోని ముకరంపురలో గల ఉర్దూ ఉన్నత పాఠశాలలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన సతీమణి డాక్టర్ బోయినపల్లి మాధవితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారితో పాటు కుమారులు ప్రతీక్, ప్రణయ్ కోడలు హర్షిణి ఓటు వేశారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.

News May 13, 2024

ఓటు వేసిన పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి

image

పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచిర్యాలలోని మార్కెట్ రోడ్‌లో ఉన్న పాఠశాలలో తన తల్లి సరోజ వివేకానందతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

.

News May 13, 2024

కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో పోలింగ్ షురూ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. కాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. 

News May 13, 2024

KNR: ఎన్నికలు.. ఇలా చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారు

image

లోక్‌సభ ఎన్నికల వేళ పోలింగ్‌ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలింపు
⏵శాంతి భద్రతల ఆటంకం
⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం
⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ
⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం
⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు
⏵అసత్య వార్తలు వ్యాప్తి

News May 13, 2024

సిరిసిల్ల: మాక్ పోలింగ్ నిర్వహణ

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్ల & వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంలను, వివి ప్యాట్లను ప్లాట్లను సరిచూసుకున్నారు. మాక్ పోలింగ్ అనంతరం పోలింగ్ ప్రారంభం కానుంది.

News May 13, 2024

కరీంనగర్: పోలింగ్ సర్వం సిద్ధం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 33 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

KNR: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

image

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. KNR ఎంపీ స్థానంలో 2019లో 69.52 శాతం పోలింగ్ నమోదవగా పెద్దపల్లిలో 65.59 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.