Karimnagar

News May 12, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా TOP NEWS

image

➤KNR: MP ఎన్నికలు.. భారీ బందోబస్తు
➤అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
➤ధర్మపురి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు
➤UAEలో KNR జిల్లా యువకుడి మృతి
➤రామగుండం: ఎన్నికల విధులకు NCC క్యాడెట్లు
➤ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చర్యలు: CP
➤శంకరపట్నంలో వడదెబ్బతో మహిళ మృతి

News May 12, 2024

KNR: ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు

image

కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్‌లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్‌లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.

News May 12, 2024

కరీంనగర్: EVMలను భద్రంగా తీసుకెళ్లాలి: జిల్లా కలెక్టర్

image

సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను భద్రంగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఆదివారం కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించి, మానకొండూర్‌కు సంబంధించి కరీంనగర్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బాధ్యతయుతంగా పనిచేయాలని అధికారులకు చెప్పారు.

News May 12, 2024

KNR: అమ్మను ఆదర్శంగా తీసుకొని.. ఓటు వేద్దాం

image

నవమాసాలు మోసి అమ్మ జన్మనిచ్చి నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క ఓటుతో ఉత్తమ నాయకుడిని ఎన్నుకొని బాధ్యత నెరవేర్చుకోలేమా..? తల్లి ప్రేమ వెలకట్టలేనిది, బాధ్యతగా జీవితమంతా వెంటే ఉంటోంది. మన ఓటుకూ వెలకట్టకపోతే వచ్చే ఐదేళ్లు మంచి పాలన అందుతోంది. అమ్మను ఆదర్శంగా తీసుకుందాం. ప్రేమలోనూ, బాధ్యతలోనూ. మన KNR జిల్లాలో 33,93,580 మంది ఓటర్లున్నారు. – నేడు మాతృ దినోత్సవం. రేపే మన బాధ్యతను నెరవేర్చుకుందాం.

News May 12, 2024

KNR: ముగిసిన ప్రచార హోరు.. ఇక ప్రలోభాలకు ఎర!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రెండు నెలలుగా ప్రచార సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహించిన పార్టీలు ఎన్నికల నియమావళిని అనుసరించి నిలిపివేశాయి. కాగా పోలింగ్‌కు ముందు రోజు నాటికే ఓటర్లకు మద్యం, డబ్బులు పంపిణీ చేసేందుకు కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

News May 12, 2024

కరీంనగర్‌లో ముగిసిన ప్రచారం.. గెలుపెవరిదో..!

image

గత నెల రోజుల నుంచి జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్య పార్టీల ఎంపీ అభ్యర్థులతో పాటు ఆ పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇక మిగిలింది ప్రజల నిర్ణయమే. కాగా.. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బోయినపల్లి వినోద్ కుమార్-BRS, వెలిచాల రాజేందర్ రావు-కాంగ్రెస్, బండి సంజయ్-BJP బరిలో ఉన్నారు. మరి గెలుపెవరిదో చూడాలి.

News May 12, 2024

పెద్దపల్లిలో ముగిసిన ప్రచారం.. గెలుపెవరిదో..!

image

గత నెల రోజుల నుంచి జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్య పార్టీల ఎంపీ అభ్యర్థులతో పాటు ఆ పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇక మిగిలింది ప్రజల నిర్ణయమే. కాగా.. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్-BRS, గడ్డం వంశీ కృష్ణ-కాంగ్రెస్, గోమాస శ్రీనివాస్-BJP బరిలో ఉన్నారు. మరి గెలుపెవరిదో చూడాలి.

News May 12, 2024

కరీంనగర్: ఎడారి దేశంలో యువకుడి మృతి

image

జీవనోపాధి కోసం ఎడారి దేశం వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన భీమారం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోత్కురావుపేట గ్రామానికి చెందిన గణేశ్(26) గత కొన్ని నెలల క్రితం అల్-ఎయిన్ (UAE)వెళ్ళాడు. అక్కడ ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో పడి మృతి చెందాడు. రెండురోజుల క్రితం స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గణేశ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

News May 12, 2024

కరీంనగర్: MP ఎన్నికలు.. భారీ బందోబస్తు

image

ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. కమిషనరేట్‌కు చెందిన 2వేల మంది, 400 మంది కేంద్ర బలగాలు, 100 మంది ప్రత్యేక పోలీసుల బందోబస్తులో ఉన్నట్లు చెప్పారు. ఎన్నికలు జరిగే సమయంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా, ఓటర్లను తప్ప ఇతరులను లోనికి అనుమతించవద్దన్నారు.

News May 12, 2024

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 2,194 పోలింగ్ స్టేషన్లు

image

కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,194 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వీటిలో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. 17,97,000 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషుల కంటే మహిళలు 40,000 మంది అధికంగా ఉన్నారని వివరించారు. 42 వేల మంది దివ్యాంగులు ఉన్నారని, వయోవృద్ధులు 13200 మంది ఉన్నారని తెలిపారు.