India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మధ్యమానేరు నిర్వాసితులు మిడ్ మానేరులో చేపలు పడుతూ ఆర్థికంగా స్థిరపడ్డారు. మధ్యమానేరు నిర్మాణంతో సర్వం కోల్పోయి పునరావాస గ్రామాలకు తరలిన మత్స్యకారులు అదే ప్రాజెక్టును ఉపాధికి నిలయంగా మార్చుకున్నారు. హైదరాబాద్ వంటి పట్టణాలకు చేపలు తరలిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. దాదాపు 1500 మంది చేపలు పట్టేందుకు లైసెన్స్ పొందారు.
పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికలు వివరాల ప్రకారం.. రామగుండం(ఎన్టీపీసీ) సుభాశ్ నగర్‌కు చెందిన బల్ల గంగా భవాని గుజరాత్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్లో విధులు నిర్వహిస్తున్న గంగా భవాని మృతి శనివారం చెందింది. దీంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌లో మృతురాలి డెడ్ బాడీ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ పట్టణంలో శనివారం గణపతి ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అయితే ప్రకాష్ గంజ్‌లో గణపతి మొదటి పూజా కార్యక్రమంలో BJP MP, కేంద్ర మంత్రి బండి సంజయ్, BRS MLA గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.39,906 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.13,900, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.21,700, అన్నదానం రూ.3,306 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్‌లో సాయిబాబా ఆలయం పక్కన 52 ఫీట్ల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రతిష్ఠాపన పూజలో MLA సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. 11 రోజుల పూజల అనంతరం మండపం వద్దనే నీళ్లతో వినాయకుని నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పెద్దపల్లి, KNRలో భారీ గణపతులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రకాశం గంజి వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో తొలి పూజా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. విగ్నేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజించాలని గణేష్ ని ఆశీస్సులతో ప్రజా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వీరితో పాటు కలెక్టర్ పమెలా సత్పతి కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
☛VMWD: మండపాన్ని సిద్ధం చేస్తున్న కూలీలకు విద్యుత్ షాక్.. ఇద్దరికీ గాయాలు ☛PDPL: ఎల్లమ్మ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య ☛SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులు అరెస్టు ☛HZB: వినాయక మండపంలో విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి ☛HZB: భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్ ☛కోరుట్ల: విద్యుత్ షాక్ తో మహారాష్ట్ర కూలి మృతి ☛GDK: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య.
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లికి చెందిన జంపయ్య శనివారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినాయక చవితి పండుగ పూట ఎల్లమ్మ చెరువులో జంపయ్య దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో, ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. జంపయ్య మృతికి గల కారణాలు తెలియ రాలేదు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో శనివారం పర్యటించారు. కరీంనగర్‌లోని ప్రకాశం గంజ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ ప్రకాష్ గంజ్ లో గణపతి మొదటి పూజా కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.