India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వినాయక చవితిని పురస్కరించుకొని కరీంనగర్లో మార్కెట్లో బంతి, చామంతి పూల రేట్లను అమాంతంగా పెంచేశారు. మామూలు రోజుల్లో కిలోకు రూ.50 ఉండే బంతి పూలకు రూ.100, చామంతి పూలకు రూ.200, గులాబీ పూలకు రూ.250-300 వరకు అమ్ముతున్నాయి. కరీంనగర్ మార్కెట్లో భారీగా కొనుగోలుదారులు, వినాయక మండపాల నిర్వాహకులు బారులు తీరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను అధికారులు శుక్రవారం మూసివేశారు. నాలుగు రోజులుగా 32 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలిన అధికారులు.. శుక్రవారం ఉదయం 12గేట్ల ద్వారా 64వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మధ్యాహ్నానికి 2 గేట్లు మాత్రమే తెరిచి నీటిని విడుదల చేశారు. సాయంత్రం పూర్తిగా గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 19.147 టీఎంసీల నీరు ఉంది.
@ వేములవాడ మైనార్టీ గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.
@ సిరిసిల్లకు చెందిన గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ మృతి.
@ మల్హర్ మండలంలో ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు.
@ ఓదెల మండలంలో ట్రాలీ ఆటో బోల్తా పలువురికి గాయాలు.
@ వినాయక పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితికి ముస్తాబైన మండపాలు.
గణేశ్ నవరాత్రులు ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ రోడ్ల మరమ్మత్తు విషయంలో ఉత్సవ కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకురాగా వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు. మండపాల నిర్వహకులు పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఇచ్చే సూచనలను పాటించాలన్నారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయి. 24 గంటల్లో 23 ఆపరేషన్లు చేసి దవాఖాన సత్తా చాటారు. కార్పొరేట్‌కు దీటుగా ముందుకు సాగుతున్నారు. ఆసుపత్రిలో గత 24 గంటల్లో మరోసారి రికార్డు స్థాయిలో వివిధ రకాల 23 ఆపరేషన్లు అయ్యాయి. ఇందులో 10 డెలివరీలు, 2 గర్భసంచిలో గడ్డ, 5 సాధారణ శస్త్ర చికిత్సలు, 1 కంటి ఆపరేషన్, 5 ఆర్తో ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు.
సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ మృతి తనను ఎంతో బాధించిందని ఎమ్మెల్యే కేటీఆర్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. సిరిసిల్లలోని చేనేత కుటుంబాలు పుట్టిన ఆయన పలు రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు, బంధువులు శ్రేయోభిలాషులకు సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల, ధర్మపురి, మెట్‌పల్లి, మల్యాలలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1,065 అంగన్వాడీ కేంద్రాలుండగా ఇందులో 1,037 మెయిన్ కేంద్రాలు, 28 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో సుమారు 14,086 మంది గర్భిణులు, బాలింతలు, 34,897 మంది 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సులోపు చిన్నారులు, 15,907 మంది 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్ఎండి SI వివేక్ వివరాల ప్రకారం.. KNRలోని గణేశ్ నగర్‌లో నివాసం ఉంటున్న సత్తు రఘు(48) పట్టణంలోని ఓ హోటల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇంటి నుంచి బయలుదేరి ఇందిరా నగర్ గ్రామ శివారులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉత్తర తెలంగాణలోని పేరు పొందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.7,600 రికార్డు ధర పలికింది. మార్కెట్ యార్డుకు విడి పత్తి విక్రయానికి తీసుకువచ్చారు. ప్రైవేట్ ట్రేడర్స్ బహిరంగ వేలం పాట ద్వారా గరిష్ఠ ధర రూ.7,600 చొప్పున పత్తి కొనుగోళ్లు చేపట్టారు. కనిష్ఠంగా రూ.7300 పలికింది. పత్తికి అధిక ధర పలకడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
@ రామడుగు మండలంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.
@ జగిత్యాల ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
@ ఎల్లారెడ్డిపేటలో ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్.
@ సిరిసిల్ల, జగిత్యాల కలెక్టరేట్లో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం.
@ కథలాపూర్, కొడిమ్యాల మండలాలలో పర్యటించిన జగిత్యాల కలెక్టర్.
Sorry, no posts matched your criteria.