Karimnagar

News May 9, 2024

మెట్ పల్లి: కాళ్లు మొక్కి ఓట్లు అడిగిన బీజేపీ నాయకులు

image

మెట్ పల్లి పట్టణంలో బీజేపీ నాయకులు గురువారం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుసుకొని పలువురి కాళ్లు మొక్కుతూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొయ్యల లక్ష్మణ్, బొడ్ల ఆనంద్, సంకేత విజయ్ తదితరులు పాల్గొన్నారు.

News May 9, 2024

కరీంనగర్: తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలిసేలా!

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు 3 రోజులు మాత్రమే మిగిలింది. పోలింగ్‌కు 48 గంటల ముందే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 11న సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను కలిసేలా తమ ప్రచారం తీరును మార్చుకుంటున్నారు.

News May 9, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 4 రోజులు మోస్తరు వర్ష సూచన ఉందని జగిత్యాల పరిశోధన స్థానం ఏడీఆర్ డా.జి.శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి ధాన్యం తడవకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా బుధవారం జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో 42.3 డిగ్రీల సెల్సియస్, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 40.8, KNR జిల్లా జమ్మికుంటలో 40.7, సిరిసిల్ల జిల్లా నామాపూర్‌లో 40.0 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

News May 9, 2024

పెద్దపల్లి: సింగరేణి కార్మికుల చేతుల్లో నేతల భవిష్యత్!

image

పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఐదింటిలో సింగరేణి కార్మికులే అధికంగా ఉన్నారు. ఇప్పుడున్న నేతల భవిష్యత్ సింగరేణి కార్మికుల చేతుల్లోనే ఉంది. 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 28,829 మంది కార్మికులు, 15 వేల మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలతో కలిపితే
దాదాపు 1.80 లక్షల ఓట్లు ఉంటాయి. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థుల భవిష్యత్ కార్మికుల ఓట్ల పైనే ఉందని విశ్లేకుల అంచనా. దీనిపై మీ కామెంట్.

News May 9, 2024

కరీంనగర్: 2 రోజులు మద్యం దుకాణాలు బంద్

image

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుంచి 13 రాత్రి ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు, బార్లను వ్యాపారులు మూసి వేయాలని జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు సూచించారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు. నిబంధనలు అతిక్రమించి వ్యాపారం సాగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

News May 9, 2024

పెద్దపల్లి: సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్!

image

వేసవిలో ఎన్నికల నిర్వహణ అభ్యర్థులతో పాటు అధికారులకు సవాల్‌గా మారింది. మావోయిస్టు ప్రాంతమైన పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో మంథని, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ జరగనుంది. 2019లో ఇక్కడ 65.43 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2014లో ఇది 71.70 శాతంగా ఉంది. పోలింగ్ శాతం పెరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

News May 9, 2024

కరీంనగర్: 1,466 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు!

image

ఉమ్మడి జిల్లా పరిధిలోని KNR, PDPL, NZB లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,852 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇందులో 1,466 సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. ఈ కేంద్రాల పరిధిలో గతంలో జరిగిన అలజడులు, నమోదైన కేసుల విషయంలో ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలు సమీక్షించారు.

News May 8, 2024

కమలాపూర్: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ దేశరాజ్‌పల్లి గ్రామాల మధ్యలో బ్రిడ్జి సమీపంలోని పంట పొలాల వద్ద ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. వారం రోజుల నుంచి ఆ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు గీతా కార్మికులు తెలిపారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించినట్లు పేర్కొన్నారు.

News May 8, 2024

జగిత్యాల: సివిల్ సప్లై కమిషనర్‌ను కలిసిన ఎస్పీ

image

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన కోసం బుధవారం జగిత్యాల జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌ను బుధవారం జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. గతంలో డిఎస్ చౌహన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేశారు.

News May 8, 2024

KNR: పురుగు మందు తాగిన మహిళ

image

మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో సిరొంచ తాలూకా, పోచంపల్లికి చెందిన రామక్క అనే మహిళ కాళేశ్వరం గోదావరి వద్ద పురుగు మందు తాగి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో.. గోదావరి నుంచి తీరం వరకు ఎస్సై భవాని సేన ఎడ్ల బండి ద్వారా తీసుకువచ్చి అనంతరం మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు.