Karimnagar

News May 8, 2024

బండి సంజయ్ గెలుపు ముందే నిర్ణయమైంది: మోదీ

image

కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఇక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థిని బరిలోకి దింపిందని వేములవాడ సభలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఎలాంటి దర్యాప్తు చేయలేదని చెప్పారు. పీవీ నరసింహరావుకి భారతరత్న ప్రకటించి బీజేపీ గౌరవించిందని తెలిపారు.

News May 8, 2024

కరీంనగర్: తారాస్థాయికి ప్రచారం!

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఇంకా 3 రోజులే సమయం ఉండటంతో ప్రజలతో మమేకమవడం అభ్యర్థులకు కష్టంగా మారింది. KNR, PDPL లోక్‌సభ పరిధిలో 33.93 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా, సర్వే ఏజెన్సీలపై ఆధారపడుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అభ్యర్థుల వాయిస్‌లతో ఓటర్లకు సందేశాలు పంపిస్తున్నారు. ‘హలో.. మీ ఓటు ఎవరికీ?’ అని ఫోన్ చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.

News May 8, 2024

కరీంనగర్: ఆన్‌లైన్ బెట్టింగ్.. తీస్తుంది ప్రాణం!

image

ఒకప్పుడు పట్టణాల్లో ఉండే ఆన్లైన్ జూదం ఆటలు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యంతో ఇప్పుడు గ్రామాల్లోకి చేరాయి. క్రికెట్ బెట్టింగ్, పేకాట, ఇతర ఆటల వల్ల యువకుల <<13198225>>ప్రాణాలను బలిగొంటూ<<>> కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి సాఫ్ట్వేర్ ఉద్యోగి రెండు రోజుల క్రితం ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News May 7, 2024

గోమాస శ్రీనివాస్‌ని పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలి: రాజస్థాన్ సీఎం

image

దేశ గౌరవాన్ని అత్యున్నత స్థానంలో నిలిపిన ప్రధాని మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని రాజస్థాన్ సీఎం బజన్ లాల్ శర్మ కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ లోక్ సభ ఎన్నికలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కి మద్దతుగా మంథని నియోజకవర్గంలో నిర్వహించిన జనసభకి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గోమాస శ్రీనివాస్‌ని పెద్దపల్లి ఎంపీగా, మోదీని మరోసారి దేశ ప్రధానిగా గెలిపించాలని కోరారు.

News May 7, 2024

వామ్మో.. 14 యూనిట్లకు రూ.60,701 కరెంటు బిల్లు!

image

మండుటెండలకు చెమటలు పట్టుడు ఏమో కాని ఈ కరెంట్ బిల్లు చూస్తే మాత్రం ముచ్చెమటలు పడతాయి. జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులోని ఓ షాప్ యజమానికి కరెంట్ బిల్లు చూడగానే షాక్ తగిలింది. తన షాపునకు ప్రతి నెల రూ.200 బిల్లు రాగా, ఇప్పుడు కేవలం 14 యూనిట్లకు ఏకంగా రూ.60,701 బిల్లు వచ్చిందని వాపోయారు. అధికారులు స్పందించాలని కోరారు.

News May 7, 2024

రేపు ఉదయం 8 గంటలకు మోదీ సభ: బండి

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటలకు వేములవాడ పట్టణంలోని జగిత్యాల బైపాస్ రోడ్డులో కోర్టు పక్కన గల మైదానంలో సభ కొనసాగుతుందని చెప్పారు. ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News May 7, 2024

కరీంనగర్: 18-39 ఏళ్ల వారే కీలకం!

image

కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయడంలో యువ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి యువ ఓటర్ల పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 29 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 45% పైగా 18-39 ఏళ్లు ఉన్న వారే కావడంతో తమకు అనుకూలంగా మళ్లించుకునే దిశగా తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.

News May 7, 2024

వేములవాడకు మోదీ రాక.. ఆలయంలో భద్రతా చర్యలు

image

సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయానికి బుధవారం ప్రధాని మోదీ రానున్నారు. ఈ సందర్భంగా మంగళవారం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రక్షణ చర్యల్లో భాగంగా రెండు గంటల పాటు భక్తులను పోలీసులు దర్శనానికి అనుమతించలేదు. అనంతరం భక్తులు యధావిధిగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. మూడు రోజుల నుంచి పోలీస్ సిబ్బంది మోదీ రక్షణ చర్యల నిమిత్తం ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

News May 7, 2024

బీఫార్మసీ, బీపీఈడీ ఫలితాలు విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఫార్మసీ, బీపీఈడీ పరీక్ష ఫలితాలు విడదలయ్యాయని యూనివర్శిటీ పరీక్షల నియంత్రణాధికారి డా. శ్రీరంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ 1,2,7,8వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు, బీపీఈడీ 1, 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలు వెబ్‌సైట్ www.satavahana.ac.inలో అందుబాటులో ఉన్నాయన్నారు.

News May 7, 2024

కరీంనగర్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్

image

ఆన్లైన్ గేమ్‌లతో డబ్బులు కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగాధర మండలం మధురానగర్‌కు చెందిన లక్ష్మణ్- లక్ష్మి కుమారుడు పృథ్వీ (25) నోయిడా(UP)లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతడు స్నేహితుల వద్ద రూ.12 లక్షల అప్పు చేసి ఆన్లైన్ గేమ్‌లో పోగొట్టుకున్నాడు. ఆ అప్పు ఎలా తీర్చాలనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు.