Karimnagar

News May 7, 2024

నేడు మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్

image

కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాలు, అవినీతిపై విచారణ చేయనున్న జ్యుడీషియల్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డకు రానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన మేడిగడ్డ వద్దకు చేరుకోనున్నారు. భోజన విరామం అనంతరం గంటన్నర పాటు జస్టిస్ ఘోష్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.

News May 7, 2024

కరీంనగర్ తీగల వంతెనపై నుంచి దూకి వ్యక్తి సూసైడ్

image

కరీంనగర్ తీగల వంతెనపై నుంచి కిందికి దూకి గుర్తు తెలియని వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ రూరల్ పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిస్తే కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

News May 7, 2024

కరీంనగర్: నేడు రాహుల్.. రేపు మోదీ.. ఎల్లుండి కేసీఆర్

image

లోక్‌సభ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై దృష్టి కేంద్రీకరించాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరీంనగర్‌లో పర్యటించనున్నారు. బుధవారం ప్రధాని మోదీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున వేములవాడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. గురువారం BRS అధినేత కేసీఆర్ కరీంనగర్‌లో పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ తరఫున ప్రచారంలో పాల్గొంటారు.

News May 7, 2024

వేములవాడకు రూ.500 కోట్లు ప్రకటించాలి: వినోద్ కుమార్

image

కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం రాత్రి వేములవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వారణాసికి వందల కోట్లు కేటాయించారని అన్నారు. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడకు మాత్రం ఎలాంటి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. వేములవాడ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

News May 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రత ఎంతంటే?

image

నేడు ఉమ్మడి KNR జిల్లాలో ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా రాయికల్ మం. అల్లీపూర్, వెల్గటూర్ మం. గుల్లకోటలో 46.8°C, బీర్పూర్ మం. కొల్వైలో 46.3°C, ఇబ్రహీంపట్నం మం. గోదురులో 46.1°C, ధర్మపురి మం. నేరెళ్లలో 45.8°C, ముత్తారంలో 46.4°C, సుల్తానాబాద్ మం. సుగ్లంపల్లిలో 46.3°C నమోదయ్యాయి. కమాన్‌పూర్‌లో 45.9°C, జమ్మికుంటలో 46.2°C, వీణవంకలో 45.8°C నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News May 6, 2024

నా పాదయాత్రకు బండి సంజయ్ స్ఫూర్తి: అన్నామలై

image

మోదీ గుండెలో బండి సంజయ్ కుమార్‌కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై అన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు. సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శనీయమన్నారు. సంజయ్ పాదయాత్ర స్ఫూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు.

News May 6, 2024

వేములవాడ: DSP హెచ్చరిక

image

ప్రధాని మోదీ వేములవాడ పర్యటన నేపథ్యంలో నేటి నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటు వేములవాడ పట్టణ పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డ్రోన్లు వినియోగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News May 6, 2024

పెద్దపల్లి: లోక్‌సభ ఎన్నికలపై అనాసక్తి!

image

పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో 2014లో జరిగిన పోలింగ్ కంటే 2019లో కాస్త పోలింగ్ శాతం తగ్గింది. 2014లో జరిగిన ఎన్నికల్లో 71.93 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019 ఎన్నికల నాటికి అది కాస్తా 65.59 శాతంకు తగ్గింది. ఎన్నికల్లో ఓటర్లందరూ ఓటు వినియోగించుకునేలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఎంత ప్రచారం చేసిన పెద్దగా ఫలితం ఉండడం లేదు.

News May 6, 2024

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

image

వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు కావడంతో రాజన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్‌లో బారులుదీరారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు రాజన్నను దర్శించుకొని తరించారు.

News May 6, 2024

చిన్నబొంకూరు కన్నీరు!

image

ట్రాక్టర్‌ బోల్తా పడి చిన్నబొంకూర్‌‌కు చెందిన బేతి లక్ష్మీ, మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ <<13186723>>మృతి చెందిన<<>> విషయం విదితమే. రాజమ్మ భర్త రాజకొమురయ్య మృతి చెందగా.. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపి కుమారుల పెళ్లి చేసింది. అటు లక్ష్మి త్వరలోనే తన కొడుకు వివాహం జరిపించాలని నిర్ణయించుకుందని ఆమె భర్త విలపించారు.మల్యాల వైష్ణవి పిల్లలు ఇంటి వద్ద అన్నం తింటుండగా..తల్లి మరణ వార్త విని బోరున విలపించారు.