India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోదావరిఖని గంగానగర్ పెట్రోల్ బంక్ నుంచి బయటికి వెళ్తున్న లారీ రాజీవ్ రహదారిపై వెళ్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో ఒక్కసారిగా కారు పల్టీలు కొట్టింది. కారులో ఉన్న బెలూన్లు ఓపెన్ కావడంతో అందులో ఉన్నవారికి ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఓ బ్యాంకు మేనేజర్‌కు చెందిన కారుగా గుర్తించారు.
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
WGL-హసన్‌పర్తి-కాజీపేట ‘F’ క్యాబిన్ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సికింద్రాబాద్-సిర్పూర్‌కాగజ్‌నగర్ SEP 23 నుంచి OCT 7, కాజీపేట-సిర్పూర్‌టౌన్ SEP 26 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. భద్రాచలం రోడ్-బళ్లార్ష, బళ్లార్ష-కాజీపేట వరకు SEP 29 నుంచి OCT 8 వరకు అంతరాయం కలగనుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైబర్ నేరగాళ్ల వలలో పడి చాలా మంది డబ్బు నష్టపోతున్నారు. దీంతో పోలీసులు విలువైన సమాచారాన్ని అందించారు. నష్టం జరిగిన మొదటి గంటలోపు ఫిర్యాదు చేసినా (డైమండ్ అవర్), నిమిషంలోపు ఫిర్యాదు చేసినా (గోల్డెన్ అవర్) సంబంధిత సొమ్మును రికవరీ చేయవచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో రూ.2.75 కోట్లు రికవరీ చేశారు. గంటలోపే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
@ ధర్మపురి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ ముస్తాబాద్ మండలంలో కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్. @ కరీంనగర్ లో కార్ల షోరూంలో చోరీ. @ జగిత్యాల జిల్లాలో 211 డెంగీ కేసులు నమోదు. @ కరీంనగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ముగ్గురికి జైలు శిక్ష. @ గంభీరావుపేటలో వడ్డీ వ్యాపారిపై కేసు.
హుజూరాబాద్ డివిజన్ పరిధిలో రుణమాఫీ కాని రైతుల వివరాలను ఏడీఏ సునీత తెలిపారు. డివిజన్ పరిధిలో మొత్తం 4,661 రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. ఇందులో రేషన్ కార్డు లేని వారు, తదితర కారణాలతో మాఫీ కాలేదన్నారు. ఇంటింటికి సర్వే చేసి వివరాలు సేకరిస్తామన్నారు. రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చిందని, అందులో వివరాలు నమోదు చేస్తున్నామన్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉద్యోగాలు కరువయ్యాయి. కోల్డ్ బెల్ట్ ఏరియాలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఇక్కడ పరిశ్రమలకు ఇతర ప్రాంతాల వారికి పెద్దపీట వేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. RFCL, సింగరేణి, మెడికల్ కాలేజీ, NTPC, బీ-థర్మల్, కేశోరాం లాంటి పరిశ్రమలు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో గణపతి మండప నిర్మాణాలు జోరందుకున్నాయి. విక్రయ కేంద్రాల్లో ప్రతిమలు సిద్ధంగా ఉన్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులు మట్టి విగ్రహాలు ప్రతిష్టించాలని పలువురు అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఏటా 200కు పైగా మట్టి విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో 54 అడుగుల మట్టి విగ్రహాన్ని రూ.12 లక్షలు వెచ్చించి రూపొందిస్తుండడం విశేషం.
కరీంనగర్ పట్టణ పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో ట్రాఫిక్ దృష్ట్యా ప్రమాదాలను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య DCMలు, వాటర్ ట్యాంకర్లు, RMCలు, రాకెట్ లారీలు, JCBలు, ఎర్త్ మూవర్, ట్రాక్టర్లు, భారీ మోటార్ వాహనాలకు పట్టణంలో ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
ప్రతి మహిళ స్థానికంగా ఉన్న ఆరోగ్య మహిళ క్లినిక్‌కి వెళ్లి సుమారు 50 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలో శుక్రవారం సభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహిళా క్లినిక్‌లో రూ. 45 వేల ఖర్చు అయ్యే వైద్య పరీక్షలు, క్యాన్సర్ వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తారని తెలిపారు. మహిళలకు అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.