Karimnagar

News May 4, 2024

KNR: ఈ సారైనా పోలింగ్ శాతం పెరిగేనా?

image

ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలపై చూపినంత ఆసక్తి లోక్‌సభ ఎన్నికలపై చూపడం లేదు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరుగుతున్నా పోలింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో 74.71 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019 ఎన్నికల నాటికి అది కాస్తా 69.52 శాతంకు తగ్గింది. ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్యను మరింత పెంచాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

News May 4, 2024

వడదెబ్బతో వెల్గటూర్ ఎంఈఓ మృతి

image

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల విద్యాధికారి బత్తుల భూమన్న మృతి చెందారు. వడదెబ్బతో శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంఈఓ మృతి పట్ల మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

News May 3, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సైదాపూర్ మండలంలో బైక్ అదుపు తప్పి కిందపడి మహిళా మృతి. @ మెట్పల్లి పట్టణంలో 1,50,000 నగదు సీజ్. @ ఓదెల మండలంలో వడదెబ్బతో రైతు మృతి. @ రామగుండం రోడ్ షో లో కేసీఆర్. @ ధర్మపురి నియోజకవర్గంలో జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. @ రాయికల్ పట్టణంలో 11 మందిపై పిచ్చికుక్క దాడి. @ వేములవాడ రూరల్ మండలంలో బొలెరో వాహనం ఢీకొని బాలుడు మృతి. @ పార్లమెంట్ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: కరీంనగర్ కలెక్టర్

News May 3, 2024

రామగుండం చేరుకున్న మాజీ సీఎం KCR

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్‌కు మాజీ సీఎం KCR చేరుకున్నారు. 48 గం. ప్రచార నిషేధం అనంతరం శుక్రవారం గోదావరిఖని చౌరస్తాలో 8 గం. తర్వాత జరిగే బస్ యాత్రలో పాల్గొని ప్రసంగించనున్నారు. స్థానిక ఇల్లెందు క్లబ్‌కు వెళ్లిన ఆయన.. ర్యాలీ ద్వారా చౌరస్తాకు వెళ్లనున్నారు. అనంతరం PDPL MP అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని ప్రసంగించనున్నారు.

News May 3, 2024

సిరిసిల్ల: వాహనం ఢీ.. బాలుడి మృతి

image

వాహనం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లిలో శుక్రవారం ఉదయం బాలుడు సూర హర్షవర్ధన్(6) రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో బొలెరో వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలైన బాలుడిని వేములవాడలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని స్థానికులు చెప్పారు.

News May 3, 2024

ఎల్లారెడ్డిపేటలో ఎక్సైజ్ ఎస్ఐ మృతి

image

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాళీ ప్రసాద్(54)మూడు నెలల క్రితం బదిలీపై ఎల్లారెడ్డిపేటకు వచ్చారు. మండల కేంద్రంలో ఇంట్లో అద్దెకు ఉంటుంన్నారు. శుక్రవారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 3, 2024

కరీంగనర్: రోడ్డు ప్రమాదం మహిళ మృతి

image

కరీంగనర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎలాబోతారం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణం ఇందిరానగర్‌కు చెందిన రమ తన కుమారుడితో కలిసి బైక్‌పై హుజూరాబాద్ నుంచి రాములపల్లి గ్రామానికి వెళ్తున్నారు. ఈక్రమంలో ఎలాబోతారం కమ్యూనిటీ హాల్ వద్ద బైక్ అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయం కావడంతో రమ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

News May 3, 2024

నేడు గోదావరిఖనికి మాజీ CM KCR

image

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మాజీ CM KCR ఈరోజు సాయంత్రం గోదావరిఖని చౌరస్తాలో జరిగే రోడ్డు షోలో పాల్గొంటారని BRS అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజల్లో BRSకు వస్తున్న ఆదరణ ఓర్వలేక రోడ్డు షోను ఆపేందుకు అధికార పార్టీ పాలకులు దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర విజయవంతం చేయాలన్నారు.

News May 3, 2024

మ్యాచ్ ఫిక్సింగ్‌కి బ్రాండ్ అంబాసిడర్ బండి సంజయ్: ఎంపీ అభ్యర్థి

image

కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. శాసనసభ ఎన్నికల్లో మంగళసూత్రం అమ్మి నామినేషన్ వేసిన బండి సంజయ్‌కి వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కి బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్ అని, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా దిగజారే వ్యక్తి బండి సంజయ్ అంటూ ద్వజమెత్తారు.

News May 2, 2024

వేములవాడ రాజన్న హుండీ లెక్కింపు

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపును గురువారం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో నిర్వహించారు. గడిచిన 21రోజులకు గాను స్వామివారికి రూ.1కోటి 52లక్షల 15 వేల 575 నగదుతో పాటు 218 గ్రాముల బంగారం, 11కిలోల 500గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ EO కృష్ణప్రసాద్, కరీంనగర్ AC కార్యాలయం పరిశీలకులు సత్యనారాయణ, AEO హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.