Karimnagar

News August 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ చందుర్తి పోలీస్ స్టేషన్లో శునకానికి అంత్యక్రియలు.
@ తంగళ్లపల్లి మండలంలో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్.
@ ముస్తాబాద్ మండలంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్.
@ గంభీరావుపేట మండలంలో నాటు తుపాకులు తయారు చేస్తున్న ముగ్గురికి అరెస్ట్.
@ వేములవాడ రాజన్న అన్నదాన ట్రస్ట్‌కు భక్తుడి రూ.లక్షల విరాళం.
@ వీర్నపల్లి మండలం కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్.

News August 28, 2024

సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక దృష్టి: కమిషనర్

image

ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య(స్పెషల్ డ్రైవ్) పనులకు శ్రీకారం చుట్టామని కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో ఆమె పర్యటించారు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది చేస్తున్న స్పెషల్ డ్రైవ్ పనులను తనిఖీ చేసి పరిశీలించారు. చెత్తాచెదారం నగరంలో కనిపించకుండా చేయాలని సిబ్బందికి పలు సలహాలు, సూచనలతో ఆదేశాలు జారీ చేశారు.

News August 28, 2024

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జ్వరాలు

image

తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. విష జ్వరాల బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకీ విజృంభిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు, డెంగీ ఫీవర్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది.

News August 28, 2024

కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.!

image

KNR-MDK-NZB- ADB పట్టభద్రుల MLCగా పోటీ చేసేందుకు ఆశావహులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత MLC జీవన్ రెడ్డి పదవీకాలం మార్చి 2025లో ముగియనుండడంతో పాటు సెప్టెంబరు 30 నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం కానుండగా కాంగ్రెస్, BRS, BJPలో ఆశావహులుగా ఉన్నవారు ఓటర్లను కలుస్తూ కొత్తగా ఓటర్లను చేర్పించేందుకు ఆయా ప్రాంతాల్లో తమ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.

News August 28, 2024

ఈనెల 31న గోదావరిఖనికి డిప్యూటీ సీఎం

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈనెల 31న గోదావరిఖని రానున్నారు. ఈ నేపథ్యంలో రామగుండం సింగరేణి సంస్థకు సంబంధించిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్‌తో పాటు సింగరేణి బొగ్గు గనులు సందర్శించనున్నారు. అదేవిధంగా పట్టణ చౌరస్తాలో సభ జరగనుంది. ఇందుకోసం సింగరేణి GMలలిత్ కుమార్‌తో పాటు నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, గోదావరిఖని ACPమడత రమేశ్ సభా స్థలం ఏర్పాట్లు పరిశీస్తున్నారు.

News August 28, 2024

వీర్నపల్లి: అనారోగ్యంతో ఓ మహిళ మృతి

image

వీర్నపల్లి మండలానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం అంకమళ్ళ రేఖ (35) అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. భర్త సుదర్శన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మృతి చెందాడు. అప్పటినుంచి రేఖ తల్లి గారైన రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఉంటుంది. మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. తల్లిదండ్రులు చనిపోవడంతో కూతురు అనాథగా మిగిలిపోయింది.

News August 28, 2024

జగిత్యాల: ఎస్సారెస్పీ తాజా సమాచారం

image

శ్రీరాంసాగర్ జలాశయంలోకి మంగళవారం సాయంత్రం వరకు 24,014 క్యూసెక్కుల చొప్పున వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అటు కాకతీయ, సరస్వతి కాలువలకు, మిషన్ భగీరథకు కలుపుకుని మొత్తం ఔట్ 4,459 క్యూసెక్కులుగా ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90.13 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో ప్రస్తుతం 58.70 నీటినిల్వ టీఎంసీలుగా ఉందన్నారు.

News August 28, 2024

దక్షిణాఫ్రికాలో పాఠ్య పుస్తకంగా కరీంనగర్ జిల్లా వాసి పుస్తకం

image

కరీంనగర్‌కు చెందిన తెలుగు భాషోద్యమకారుడు, రచయిత కూకట్ల తిరుపతి రాసిన తెలుగు బడి(బాల వాచకం) దక్షిణాఫ్రికాలోని ప్రవాస తెలుగు భారతీయ విద్యార్థులకోసం పాఠ్య పుస్తకంగా ఎంపిక చేసి గత సంవత్సరం నుంచి వినియోగిస్తున్నారు. దక్షిణాఫ్రికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఈ పుస్తకం పాఠ్య పుస్తకంగా ఉంది. శాస్త్రీయ విధానం, సాంకేతికను జోడించి పుస్తకాన్ని రూపకల్పన చేశారు.

News August 28, 2024

సెప్టెంబర్ చివరి వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోని భూ క్రమబద్ధీకరణ దరఖాస్తుల మొదటి దశ ధ్రువీకరణ ప్రక్రియ సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూ క్రమబద్ధీకరణ 2020 కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలన్నారు.

News August 27, 2024

GREAT.. నేషనల్ బెస్ట్ టీచర్‌గా సంపత్ కుమార్

image

ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ఉత్తమ టీచర్లకు ప్రతి ఏటా అవార్డులు అందిస్తోంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం నేషనల్ బెస్ట్ టీచర్‌గా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ఉపాధ్యాయుడు తాడూరి సంపత్ కుమార్ ఎంపికయ్యారు. ఆయన దమ్మన్నపేట ZPHS పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలందిస్తున్నారు. అవార్డులో భాగంగా రూ.50వేల నగదు బహుమతి, ప్రశంస పత్రం సిల్వర్ మెడల్ అందచేస్తారు.