India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల, ముస్తాబాద్ పర్యటనలు రద్దైనట్లు తన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. బుధవారం హనుమకొండ జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు హనుమకొండ జిల్లాలో ఉండటంతో గవర్నర్ ప్రోగ్రాంలో పాల్గొంటారని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఎలాంటి సంబంధం లేకున్నా ఎమ్మెల్సీ కవితపై ఈడీ అక్రమంగా కేసులు బనాయించి 168 రోజులు జైల్లో వేయించడం బాధాకరం అని, చివరికి న్యాయమే గెలిచిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. లిక్కర్ పాలసీతో కవితకు ఎలాంటి సంబంధం లేదని, వారి నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఎమ్మెల్సీ కవితకు మంగళవారం బెయిల్ మంజూరై విడుదల కావడం పట్ల మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు.
MLC కవితకు బెయిల్ అందరూ ఊహించిందే. BJP, BRSలు కుమ్మక్కై కవితకు బెయిల్ తెచ్చుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో BJP, రాష్ట్రంలో BRS అధికారంలో ఉందని వెల్లడించారు. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు జరగకపోయినా.. రాజకీయ ప్రయోజనాల కోసం BJPకి తెలంగాణను తాకట్టు పెట్టిన పార్టీ BRS అని ఫైర్ అయ్యారు. పదేళ్ల మీ స్నేహబంధం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పారు.
బీసీ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. చొప్పదండి మున్సిపాలిటీలోని బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ వసతి గృహాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో గదులను పరిశీలించారు.
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం పరిధిలో కొండపై వాహన పార్కింగ్‌కు రుసుము వసూలు చేయనున్నారు. దేవస్థానం కార్యాలయం ముందు గల ఖాళీ స్థలంలో ప్రస్తుతం వాహన పార్కింగ్ చేస్తున్నారు. దేవస్థానం అధికారులు పార్కింగ్‌కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా అధికారులు పార్కింగ్‌కు రుసుము వసూలు చేయాలని నిర్ణయించడం పట్ల భక్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ధర్మపురి వద్ద గోదావరి నదిలోకి వరద పెరిగింది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నిండిన చెరువులు, కుంటలు, వాగుల ద్వారా ప్రవహిస్తున్న నీరు నదిలో చేరుతోంది. ధర్మపురి వద్ద ఉసిరిక వాగు దాటి నీటి ప్రవాహం కొనసాగుతోంది. వాగు దాటి అటువైపు భక్తులు స్నానాలు చేసేందుకు వెళ్లకుండా వరద ప్రవాహం పెరిగింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.
కాకతీయ కళాతోరణం చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సిరిసిల్ల MLA కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో తెలుసుకొని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నా.. చాలా మందికి ఆదివారం మాత్రం నాన్ వెజ్ ఉండాల్సిందే. అయితే, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామస్తులు కాస్త భిన్నంగా ఉంటారు. ప్రతి ఆదివారం కేవలం శాఖాహార భోజనం మాత్రమే తింటారు. మద్యానికి దూరంగా ఉంటారు. మల్లన్నస్వామి ప్రీతికరమైన ఆదివారం మాత్రం నిష్టతో ఉంటూ ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి కోసం నెలరోజుల ముందునుంచే మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను మండపంలోనే తయారు చేస్తున్నారు. రామ్ నగర్ లో ఏర్పాటు చేస్తున్న మండపాన్ని మిత్ర యూత్ అత్ ముప్పై ఒక్క అడుగుల బొజ్జ గణపతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలను అమర్చి చూపరులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాస 4వ సోమవారం సందర్భంగా సాయంత్రం భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజలు గావించారు. స్వామివార్లను రంగు రంగుల పుష్పాలతో అలంకరించారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు చేసి.. పరివార దేవతార్చన పూజలు సైతం చేసినట్లు ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.