Karimnagar

News May 1, 2024

సిరిసిల్ల: సెలవులు ముగిసేలోగా పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

సెలవులు ముగిసేలోగా మరమ్మతు పనులు పూర్తి చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. వేములవాడ మండలం వట్టెంల, ఫాదర్ నగర్ గ్రామాలలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేపట్టనున్న మరమ్మతు పనుల మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మ ఆదర్శ పాఠశాల కింద తరగతి గదులు మరుగుదొడ్లు మరమ్మతుల పనులు చేయించాలని అధికారులకు ఆయన సూచించారు.

News May 1, 2024

సిరిసిల్ల: పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: నికోలస్

image

గ్రూప్ 1 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నికోలస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నోడల్ అధికారులు, పోలీసు నోడల్ అధికారులతో హైదరాబాదు నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జూన్ 9న జరగనున్న గ్రూప్ 1 పరీక్షకు అన్నిమౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

News April 30, 2024

కరీంనగర్: ‘అంజన్నకు ఆస్తులు రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు’

image

సిద్దిపేట జిల్లా కోడూరు మండలంలోని అలిపూర్ గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన ఆస్తులను కొండగట్టు ఆంజనేయస్వామికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. కని పెంచిన కొడుకులు సరిగ్గా చూసుకోవడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా తన ఆస్తులను ఆంజనేయ స్వామి పేరిట పట్టా చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరాడు.

News April 30, 2024

సిరిసిల్ల: పదోతరగతి ఫలితాల్లో సత్తా చాటిన గిరిజన అమ్మాయి

image

నేడు విడుదలైన పదోతరగతి ఫలితాల్లో గిరిజన అమ్మాయి సత్తా చాటింది. సిరిసిల్ల జిల్లా వీర్ణపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన అమూల్య పదోతరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించింది. తన కూతురు రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు రమేశ్, రాధిక సంతోషం వ్యక్తం చేశారు. పలువురు గ్రామస్థులు అమూల్యను అభినందించారు.

News April 30, 2024

10th Result: మూడో స్థానంలో సిరిసిల్ల

image

పదోతరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల 98.27 శాతంతో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. కరీంనగర్ 96.65 శాతంతో ఏడో స్థానం, పెద్దపల్లి 96.32 శాతంతో ఎనిమిదో, జగిత్యాల 95.76 శాతంతో 11వ స్థానంలో నిలిచింది.

News April 30, 2024

మే 8న వేములవాడకు మోదీ

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 8న వేములవాడకు రానున్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వస్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. భారీ జన సమీకరణకు సిద్దమవుతున్నారు.

News April 30, 2024

10th Result: కరీంనగర్‌లో 38,230 మంది వెయిటింగ్

image

నేడు పదోతరగతి ఫలితాలు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. కరీంనగర్ జిల్లాలో 12,650 మంది, పెద్దపల్లి జిల్లాలో 7,728, జగిత్యాలలో 11,366 మంది, సిరిసిల్లలో 6,486 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

News April 30, 2024

KNR: ఎంపీ ఎన్నికలు.. ఇదీ పరిస్థితి!

image

MP ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. కరీంనగర్‌లో 33 నామినేషన్లు ఆమోదించగా.. ఐదుగురు విత్‌డ్రా చేసుకొన్నారు. 28 మంది బరిలో నిలిచారు. పెద్దపల్లి లోక్‌సభలో 49 నామినేషన్లు ఆమోదించగా.. ఏడుగురు విత్‌ డ్రా చేసుకోగా.. 42 మంది బరిలో ఉన్నారు. SHARE IT

News April 30, 2024

జగిత్యాల: ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్

image

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల పోలీస్ స్టేషన్‌లో కోర్టు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మనోహర్‌ను సోమవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాన్ బెయిల్ వారెంట్ జారీ అయిన కేసులో పెరకపల్లి గ్రామానికి చెందిన తిరుపతి మామ గంగాధర్ వద్ద రూ.5,000 తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ తిరుపతి, సీఐ క్రిష్ణ కుమార్ పట్టుకున్నారు. దుబాయిలో ఉన్న ఫిర్యాదుదారుడు తిరుపతి మెయిల్ ద్వారా ACB DGకి ఫిర్యాదు చేశారు.

News April 30, 2024

కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే ఫిర్యాదు చేయండి: కలెక్టర్

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల అంశానికి సంబంధించి కోడ్ ఉల్లంఘనతో పాటు ఏమైనా ఫిర్యాదులు, సలహాలు, సూచనల కోసం ఎన్నికల పరిశీలకులను సంప్రదించవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా మొబైల్ నంబర్ 9177435833, పోలీస్ పరిశీలకులు మనీష్ చౌదరి మొబైల్ నంబర్ 7032800525, వ్యయ పరిశీలకులు అశ్వినీ కుమార్ పాండే మొబైల్ నంబర్ 9032659531లో సంప్రదించాలన్నారు.