India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వివిధ డిపార్ట్మెంట్లలో నాలుగు నెలలకు ఆరు నెలలకు గ్రాంట్ రూపంలో జీతాలు ఇస్తే పేద ఉద్యోగుల జీవనం ఎలా సాగుతుందని హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఈ మధ్యవర్తుల దోపిడి ఉండకూడదని, ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా అయితే జీతాలు చెల్లిస్తున్నారో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అలానే ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపారు.
హైడ్రా లాగా కరీంనగర్‌లో కాడ్రా ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో కృషి చేస్తానని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో యథేచ్ఛగా భూములు కబ్జా అయ్యాయని, పేదలను జలగల లాగా పట్టి పీడించుకుతిన్నారన్నారు. దుర్మార్గపు ఆలోచన రాకుండా ప్రభుత్వ భూములపై సీఎం దృష్టికి తీసుకెళ్లి రక్షించి కాడ్రా ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో విషాదం నెలకొంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నేరెళ్ల ప్రశాంత్ (26) 10 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అతడిని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి శనివారం తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కాగా ఏడాది కిందట ప్రశాంత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రశాంత్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ నెల 26న కృష్ణాష్టమి సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయనున్నట్లు కరీంనగర్ నగరపాలక సహాయ కమిషనర్ వేణుమాధవ్ తెలిపారు. ఈ మేరకు అన్ని రకాల మాంసం దుకాణాలు బంద్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే వ్యాపారులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. ఎవరైనా మాంసం విక్రయించినట్లు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయడానికే నూతన రెవెన్యూ చట్టం -2024 ను పటిష్టంగా రూపొందిస్తుందని అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో రెవెన్యూ చట్టం -2024ముసాయిదా చర్చా వేదిక కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కొత్త ఆర్‌ఓఆర్ చట్టంపై సలహాలు, సూచనల స్వీకరణలో భాగంగా ఆయా వర్గాల ప్రతినిధులు వారి అభిప్రాయాలు వెల్లడించారు.
@ వేములవాడ ప్రభుత్వాసుపత్రిలో 24 గంటలలో 17 శస్త్ర చికిత్సలు. @ గొల్లపల్లి మండలంలో ఆర్దిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. @ ఉత్తమ కండక్టర్ అవార్డు అందుకున్న వేములవాడ డిపో మహిళా కండక్టర్. @ గొల్లపల్లి మండలంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ పెగడపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ. @ ఉమ్మడి కరీంనగర్ లో పలుచోట్ల ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు.
వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 17 వివిధ రకాల ఆపరేషన్లు అయ్యాయి. ఇందులో 6 డెలివరీలు, ఒక గర్భసంచిలో గడ్డ, 3 సాధారణ శస్త్రచికిత్సలు, 2 కంటి ఆపరేషన్లు & 5 ఆర్థో ఆపరేషన్లు ఉన్నాయి. ఇందులో సూపరింటెండెంట్, సీనియర్ సర్జన్ డా. పెంచలయ్య, గైనకాలజిస్ట్ డా.సంధ్య, తదితరులున్నారు. ఇక్కడ అన్ని వైద్య సేవలు అందుతున్నట్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
కరీంనగర్‌కు చెందిన షహబాజ్ ఖాన్ (27) సౌదీలోని ఎడారిలో ప్రాణాలు కోల్పోయాడు. అల్ హాసాలో టవర్ టెక్నీషియన్ అయిన అతడు 5 రోజుల క్రితం సహచరుడితో కలిసి కారులో ఓ చోటుకు వెళ్లారు. GPS పని చేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన రబ్ అల్ ఖలీ అనే ఎడారిలోకి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ఆఫ్ కావడం, పెట్రోల్ అయిపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. డీహైడ్రేషన్, విపరీతమైన ఎండ తీవ్రతతో పూర్తిగా బలహీనపడి ఇద్దరూ ప్రాణాలు విడిచారు.
ఇంజినీరింగ్ సీట్ల భర్తీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు CSE కోర్సులో చేరేందుకు అమితాసక్తి చూపారు. ఒకప్పుడు హవా చాటిన ‘సివిల్’ ఈసారి డీలా పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అన్ని బ్రాంచిల్లో కలిపి 4,516 సీట్లు ఉన్నాయి. సీఎస్ఈ కోర్సులో 1,420 సీట్లు ఉండగా.. 1,242 సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్‌లో 248 సీట్లకు గాను 115 మాత్రమే భర్తీ కాగా.. మెకానిల్‌ది అదే పరిస్థితి ఉంది.
రాజరాజేశ్వర జలాశయం(మిడ్ మానేరు) నుంచి శనివారం దిగువన ఎల్ఎండీకి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయానికి ఎల్లంపల్లి నుంచి 6,300, మానేరు, మూలవాగు నుంచి 110 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి కుడి కాలువ, అన్నపూర్ణ జలాశయానికి నీటి తరలింపును నిలిపివేశారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.78 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Sorry, no posts matched your criteria.