Karimnagar

News August 24, 2024

కరీంనగర్: 9,77,472 రేషన్‌ కార్డు లబ్ధిదారులకు శుభవార్త

image

రేషన్ కార్డు ఉన్నవారికి జనవరి నుంచి సన్నబియ్యంతోపాటు రాయితీపై గోధుమలు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో వారికి ఊరట కలగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 9,77,472 రేషన్ కార్డులు ఉన్నాయి. చాలామంది లబ్ధిదారులు రేషన్ దుకాణం పంపిణీ చేసే దొడ్డు రకాలను వ్యాపారులకు విక్రయించి.. అధిక ధరలు వెచ్చించి బహిరంగ మార్కెట్‌లో సన్నరకాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం వారికి మేలు చేసేలా ఉంది.

News August 24, 2024

నేడు కరీంనగర్‌లో జిల్లా స్థాయి యోగాసన పోటీలు

image

కరీంనగర్ జిల్లా స్థాయి యోగాసనా పోటీలు నేడు ఉదయం 10:30 గంటలకు డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా యోగ అసోసియేషన్ కార్యదర్శి సిద్ధారెడ్డి తెలిపారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి యోగ క్రీడాకారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

News August 23, 2024

జగిత్యాలలో బాలిక సూసైడ్

image

తల్లిదండ్రులు మందలించడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవింద్ పల్లెలో జరిగింది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన హర్షిత(14) 9వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు హాస్టల్లో ఉండమని మందలించడంతో 2రోజుల క్రితం గడ్డి మందు తాగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మరణించింది. తండ్రి అంజిత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

News August 23, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీగా వివరాలు

image

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,44,198 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.76,932, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.51,180, అన్నదానానికి రూ.16,086 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News August 23, 2024

ఉమ్మడి జిల్లాలో పంటల సాగు వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆగస్టుతో దాదాపు వరినాట్లు పూర్తవుతాయి. అయితే సాగుకు సంబంధించిన వివరాలను వ్యవసాయ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఆహార, వాణిజ్య పంటలసాగు 12,35,875 ఎకరాలు, ఉద్యాన పంటల సాగువిస్తీర్ణం 1,96,204 ఎకరాలు, అటవీభూమి విస్తీర్ణం 6,26,025 ఎకరాలు, మొత్తం రైతులు 6,41,612 ఉన్నట్లు తెలిపారు.

News August 23, 2024

పెద్దపల్లి: ప్రతి ఇంట్లో పేషంట్లే!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో చికున్ గున్యా పంజా విసురుతోంది. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే మిగతా వాళ్లందరికీ జ్వరం వస్తోంది. కీళ్ల నొప్పులతో మంచం పట్టి, లేవలేని పరిస్థితి. ప్రతి ఇంట్లో జ్వర పీడితులు ఉన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రిలో ప్రతిరోజూ 60 నుంచి 70 మందికి రక్త పరీక్షలు చేస్తున్నారు.

News August 23, 2024

KNR: కలవర పెడుతున్న మంకీపాక్స్ వైరస్!

image

కరోనా మహమ్మారి పిడకలను మరిచిపోకముందే మరో అంటువ్యాధి భయపెడుతోంది. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్ ఇప్పుడు మన పొరుగు రాష్ట్రాలకు చేరింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కేసులు నమోదు కానప్పటికీ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. కరోనా తరహాలో ఐసోలేషన్, మెడికల్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచినట్లు కరీంనగర్ జిల్లా వైద్యాధికారి సుజాత తెలిపారు.

News August 23, 2024

KNR: శిలాఫలకంపై ఎంపీ పేరు ఏది!

image

మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించిన జీడికే -5 ఓసీపీ సైట్ ఆఫీస్ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శిలాఫలకం ప్రారంభించే వరకు అందులో ఎంపీ పేరులేదన్న విషయం ఎవరికీ తెలియలేదు. శిలాఫలకంపై తన పేరు లేకపోవడాన్ని గుర్తించిన ఎంపీ.. సింగరేణి అధికారులను ఆరాతీసినట్లు సమాచారం.

News August 23, 2024

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 51.02 టీఎంసీల నీరు నిలువ

image

ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టులో నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1082.10 అడుగులు, 80.5 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టులో 4,717 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అవుట్ ఫ్లో 4,717 క్యూసెక్కులు కాగా.. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 51.02 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ అవసరాల కోసం ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

News August 23, 2024

PDPL: కొడుకును చూడటానికి వెళ్తూ తండ్రి మృతి

image

RTC బస్సు ఢీకొని PDPL జిల్లా ఓదెల మండలంలో <<13918308>>సింగరేణి ఉద్యోగి మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. పోత్కపల్లి పోలీసుల ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన రంజిత్‌కుమార్(39)కు 14 ఏళ్ల క్రితం ఓదెల మండలానికి చెందిన రజితతో పెళ్లయింది. వీరికి నెల క్రితమే ఓ బాబు పుట్టాడు. అయితే సుల్తానాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరై.. అత్తగారింటి వద్ద ఉన్న భార్య, కొడుకును చూడటానికి వెళ్తుండగా బస్సును ఎదురుగా ఢీకొని మృతి చెందాడు.