Karimnagar

News August 22, 2024

KNR: బతుకమ్మ చీరల పంపిణీ ఉన్నట్టా? లేనట్టా?

image

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే చీరల పంపిణీపై ఇంకా స్పష్టత లేదు. బతుకమ్మ ప్రారంభం కావడానికి 40 రోజుల సమయం మాత్రమే ఉన్న చీరల పంపిణీ గురించి ఎలాంటి హడావిడి లేదు. గతేడాది కరీంనగర్ జిల్లాలో 3,53,707 మంది మహిళలకు పంపిణీ చేశారు. 2017 నుంచి ఏటా 18 ఏళ్లు నిండిన ఆడపడుచులందరికీ గత ప్రభుత్వం ఉచితంగా అందించింది.

News August 22, 2024

రామగుండం: పాత ఫోన్లతో సైబర్ క్రైమ్.. ముగ్గురి అరెస్ట్

image

పాత సెల్ ఫోన్లను కొనుగోలు చేసి వాటితో సైబర్ మోసాలకు పాల్పడుతున్న బిహార్‌కు చెందిన ముగ్గురిని రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 వేల పాత సెల్ ఫోన్లు, 3 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాత ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఝార్ఖండ్‌లోని ఓ ముఠాకు అప్పగిస్తుంటారు. వారు వాటిలోని సాఫ్ట్‌వేర్ ఆధారంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.

News August 22, 2024

పెద్దపల్లి: మాజీ హోంగార్డు దారుణ హత్య

image

మాజీ హోంగార్డు హత్యకు గురైన ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెలా మండలంలో జరిగింది. కొలనూర్ గ్రామానికి చెందిన మాజీ హోంగార్డు మాటూరి విజయ్‌ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కాగా ఈ హత్యకు భూ వివాదాలు కారణం అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 22, 2024

రేపటి ధర్నాలో రైతులు పాల్గొనవద్దు: మంత్రి

image

BRS ప్రతిపక్ష ఉనికి చాటుకోవడానికే రైతు రుణమాఫీపై నిరసనలు తెలుపుతుందని రైతులను BRS వంచించాలని చూస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ చేపట్టిన రుణమాఫీ రాని రైతులు అధికారులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చని సూచించారు. అందరూ సహకరించి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించే విధంగా ముందుకు రావాలని కోరారు. రేపటి ధర్నాలో రైతులు పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు.

News August 21, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ పెద్దాపూర్, అల్లిపూర్ గురుకుల పాఠశాలలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్నను దర్శించుకున్న బలగం సినిమా డైరెక్టర్ వేణు కుటుంబం.
@ ఇల్లంతకుంట మండలంలో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య.
@ జగిత్యాలలో స్నిపర్ డాగ్‌తో పోలీసుల తనిఖీలు.
@ శంకరపట్నం మండలంలో కారు, బైకు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు.
@ పోత్గల్ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.

News August 21, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,16,469 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.64,628, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ39,500, అన్నదానం రూ.12,370, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News August 21, 2024

ఉమ్మడి KNR జిల్లాలో 6,441 ఫోన్లు రికవరీ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసులు సీఈఐఆర్‌తో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పెద్ద ఎత్తున రికవరీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మొత్తం 11,006 చరవాణులు ప్రజలు పోగొట్టుకున్నారు. ఇందులో 6,441 ఫోన్లను పోలీసులు సీఈఐఆర్ సాంకేతికత సాయంతో గుర్తించారు. రామగుండం కమీషనరేట్ చరవాణిలను అప్పగించడంలో ముందంజలో ఉంటే జగిత్యాల జిల్లా వెనుకంజలో ఉంది.

News August 21, 2024

డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

image

మంథని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ శ్రీహర్షతో కలిసి బుధవారం ప్రారంభించారు. డయాలసిస్ కేంద్రం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు.

News August 21, 2024

గోదావరిఖని డిపో.. రాష్ట్రంలోనే టాప్!

image

గోదావరిఖని డిపోకు రాఖీ పండుగ సందర్భంగా రూ.66 లక్షల ఆదాయం సమకూరినట్లు డిపో అధికారులు తెలిపారు. అధిక ఆదాయం సమకూర్చుకున్న గోదావరిఖని ఆర్టీసీ డిపో.. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలతో పోలిస్తే ఈ డిపో పరిధిలో బస్సులు అత్యధికంగా 76,383 కిలోమీటర్లు తిరిగాయి. సోమవారం ఒక్కరోజే రూ.66,55,090 ఆదాయం ఆర్జించినట్లు తెలిపారు.

News August 21, 2024

అర్హులైన పేదలందరికీ ఇతర చోట్ల పట్టాలిస్తాం: రామగుండం MLA

image

గోదావరిఖని గంగానగర్ సమీపంలో ఎస్టీపీల నిర్మాణానికి అక్కడ గుడిసెలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. దీంతో గుడిసెల వాసులు వారి సమస్య పరిష్కరించాలని రామగుండం MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అరులైన పేదలందరికీ ఇతర చోట్ల పట్టాలు ఇస్తామని హమీ ఇచ్చారు. రామగుండం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాని ప్రజలు సహకరించాలని కోరారు.