Karimnagar

News April 27, 2024

కరీంనగర్: 20 మంది నామినేషన్ల తిరస్కరణ

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన 20 మంది నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మొత్తం 53 మంది అభ్యర్థులు నామినేషన్లను సమర్పించినట్లు చెప్పారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 33 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా.. 20 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు వివరించారు.

News April 27, 2024

JGL: MP ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్

image

లోకసభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ పూర్తిచేసినట్లు జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా శుక్రవారం తెలిపారు. కలెక్టరేట్‌లో ఎన్నికల వ్యయ పరిశీలకుల సమక్షంలో పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ నిర్వహించారు. జిల్లాపరిధిలోని 930 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించామన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు నింజే, అడిషనల్ కలెక్టర్లు దివాకర, రాంబాబు తదితరులున్నారు.

News April 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మంథని మండలంలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు. @ మల్హర్ మండలంలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు. @ బోయిన్పల్లి మండలంలో ఈతకు వెళ్లి బాలుడు మృతి. @ బిఆర్ఎస్ శవ రాజకీయాలు చేస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న రామగుండం పోలీస్ కమిషనర్. @ మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాలలో ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి.

News April 26, 2024

ముస్తాబాద్: రోడ్డు ప్రమాదంలో మాజీ కార్యదర్శి మృతి

image

రోడ్డు ప్రమాదంలో మాజీ కార్యదర్శి మృతిచెందిన ఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి అబ్రవేణి సాయిలు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 26, 2024

నేరెళ్లలో దగఢ్.. దగఢ్

image

ఎండాకాలం నేపథ్యంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో జగిత్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధర్మపురి మండలం నేరెళ్లలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకే 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నేరెళ్ల రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని కోరుతున్నారు.

News April 26, 2024

చట్ట వ్యతిరేఖ చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదు: సీపీ

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతూ నేరాల నియంత్రణకై పటిష్టమైన చర్యలు చేపడతామని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, పిడిఎస్ రైస్, ఇసుక అక్రమ రవాణా, నకిలీ విత్తనాల అక్రమ రవాణా, పేకాట, కోడి పందాలు ఆడేవారిపై, గుడుంబా తయారీపై నిఘా పెట్టామని పేర్కొన్నారు.

News April 26, 2024

KNR: ఇంటర్ ఫలితాల్లో కవలల అదరహో

image

ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కవలలు( అక్కా చెల్లెళ్లు) ప్రతిభ చూపారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లోని తెలంగాణ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. ఎంపీసీ చదువుతున్న శార్వాణి 470 మార్కులకు 465 మార్కులు సాధించగా.. బైపీసీ చదువుతున్న ప్రజ్ఞాని 440 మార్కులకు 436 మార్కులు సాధించారు. దీంతో వీరిని కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్ అభినందించారు.

News April 26, 2024

KNR: బుజ్జగింపుల పర్వం మొదలు

image

నామపత్రాల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓ వైపు ప్రచారం చేస్తూనే, మరోవైపు తమ ఓటు బ్యాంకు చీలకుండా వ్యూహాలు రచిస్తున్నారు. తమకు నష్టం కలిగించే స్వతంత్రులను పోటీ నుంచి తప్పించి తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవాలనే ఆలోచనతో బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. ప్రత్యర్థి అభ్యర్థుల ఓటు బ్యాంకును గండికొట్టే స్వతంత్రులను ఏవిధంగానైనా పోటీలో ఉండేట్లు సంప్రదింపులు చేస్తున్నారు.

News April 26, 2024

కరీంనగర్‌లో 53 మంది, పెద్దపల్లిలో 63 నామినేషన్లు

image

KNR MP స్థానానికి 53 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. APR 18 నుంచి 25 వరకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణలో భాగంగా 53 మంది అభ్యర్థులకుగాను 94 నామినేషన్ల పత్రాలు దాఖలు చేశారన్నారు. కాగా, పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి 63 మంది 109 నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే KNR స్థానంలో ఒక్కరోజే 23మంది, PDPL స్థానంలో 22 మంది నామినేషన్లు వేశారు.

News April 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

➤తంగళ్ళపల్లి: ఉరివేసుకొని చేనేత కార్మికుడి ఆత్మహత్య
➤భీమదేవరపల్లి: ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలి మృతి
➤ మెట్పల్లి: వెల్లుల్లలో తాళం వేసిన ఇంట్లో చోరీ
➤జిల్లాలో వ్యాప్తంగా ప్రపంచ మలేరియా దినోత్సవం వేడుకలు
➤మెట్పల్లిలో నెంబర్ ప్లేట్ లేని 32 వాహనాలు పట్టివేత
➤జగిత్యాలలో పోలీసుల విస్తృత తనిఖీలు
➤కోనరావుపేట మండలంలో పర్యటించిన కేటీఆర్