Karimnagar

News April 25, 2024

బండి సంజయ్ మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టాడు: పొన్నం

image

పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మళ్ళీ ఐపీఎల్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావు తరఫున మానకొండూరు మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఆశీర్వదించాలని బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని మోసం చేసిందని మండిపడ్డారు.

News April 25, 2024

KNR: ఉరివేసుకొని చేనేత కార్మికుడు మృతి

image

తంగళ్ళపల్లి మండలం ఇందిరా నగర్‌లో ఓ చేనేత కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు..  అహంకారపు మల్లేశం (50) చేనేత కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో గురువారం ఇంద్రనగర్ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.

News April 25, 2024

KNR: ముగిసిన నామినేషన్లు ప్రక్రియ

image

నామినేషన్ల ప్రక్రియ గడువు గురువారం 3 గంటలకు ముగిసింది. ఈరోజు 16 మంది అభ్యర్థులు 32 నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం వరకు 52 మంది అభ్యర్థులు 94 నామినేషన్లను దాఖలు చేశారు. గురువారం 16 మంది నామినేషన్లను వేశారు. శుక్రవారం నామినేషన్లను పరిశీలించనున్నారు.

News April 25, 2024

కరీంనగర్ జిల్లాలో సూర్యుడి ప్రతాపం

image

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా వీణవంకలో 44.8, కొత్త గట్టులో 44.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో 44.2, జగిత్యాల జిల్లా గోధూర్‌‌లో 43.7, రాజన్న సిరిసిల్ల జిల్లా మర్తన్ పేటలో 42.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

News April 25, 2024

నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్

image

కరీంనగర్ పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ బాయ్ పటేల్, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, మహిళా నాయకురాలు గండ్ర నళిని, కిరణ్‌లు హాజరయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి బండి సంజయ్ కుమార్ రెండు సెట్ల నామినేషన్లు అందజేశారు.

News April 25, 2024

జీవన్ రెడ్డి సతీమణికి 50 తులాల బంగారు ఆభరణాలు

image

నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జీవన్ రెడ్డి అఫిడవిట్‌లో ఆయన ఆస్తి వివరాలను తెలిపారు. కుటుంబ ఆస్తుల విలువ రూ.3.55 కోట్లు ఉన్నాయి. ఓ ఇన్నోవా క్రిస్టా కారు ఉంది. ఆయనకు 12.5 తులాల బంగారు ఆభరణాలు, ఆయన భార్యకు 50 తులాల బంగారం ఉంది. కాగా, ఆయనకు రూ.68.38లక్షల చరాస్తులు, 35.24 ఎకరాల భూమి, జగిత్యాలలో ఇల్లు ఉంది. బ్యాంకులో రూ.58.14 లక్షల రుణాలు, 4 క్రిమినల్ కేసులున్నాయి.

News April 25, 2024

జగిత్యాల: రైతు కుటుంబం.. కూతురు స్టేట్ ర్యాంకర్

image

గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన కలకోట రాజేశ్వరి సత్యం దంపతుల రెండో కూతురు శ్రీజ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. స్థానిక మోడల్ స్కూల్లో చదువుతున్న శ్రీజ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో (ఎంపిసి) 466/470 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ పొందినట్లు ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. అటు శ్రీజ పదో తరగతిలోనూ ఇదే పాఠశాల నుంచి 10/10 జీపీఏ సాధించినట్లు పేర్కొన్నారు.

News April 25, 2024

కరీంనగర్: బి ఫారం అందుకున్న వెలిచాల రాజేందర్ రావు

image

కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావుని అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ బి ఫారం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ప్రణవ్ బాబు పాల్గొన్నారు.

News April 25, 2024

కరీంనగర్: పెళ్లైన మరుసటి రోజు రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి

image

రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి చెందిన ఘటన కరీంనగర్‌‌లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన స్వాతికి ఆదివారం వివాహం జరిగింది. సోమవారం వేములవాడకు వెళ్తున్న క్రమంలో కరీంనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తలకి బలమైన గాయం కావడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 25, 2024

గోదావరిఖని: వేధింపులు భరించలేక యువకుని ఆత్మహత్య

image

వేధింపులకు గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన GDKలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. సీతానగర్‌కు చెందిన చందా ప్రసాద్ తన మిత్రుడు సతీశ్‌కు సింగరేణి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.3 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం లేక, డబ్బులు ఇవ్వకపోవడంతో సతీశ్ కుటుంబ సభ్యులు ప్రసాద్ పై వేధింపులకు గురి చేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.