Karimnagar

News April 25, 2024

కొండగట్టు: చిన్న జయంతి ఆదాయం 1.54 కోట్లు

image

చిన్న జయంతి ఉత్సవాల సందర్బంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి రూ.1,54,13,395 ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దీక్ష విరమణ ద్వారా రూ.36,60,600, కేశఖండనము టికెట్స్ ద్వారా రూ.12,01,550, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.16,52,300 లడ్డు విక్రయాల ద్వారా రూ.74,12,825, పులిహోర ద్వారా రూ.14,86,120 వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఆదాయం పెరిందన్నారు.

News April 25, 2024

జూన్ 6 తర్వాత పేదలకు ఇళ్లు: మంత్రి శ్రీధర్‌బాబు

image

ఇళ్లు లేని పేదలకు జూన్ 6 తర్వాత ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోతే బీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతారహితంగా మాట్లాడుతూ.. కూలుతూనే ఉంటాయి.. నడుస్తూనే ఉంటాయని అనడం ఏంటని మండిపడ్డారు. కమీషన్లు తీసుకొని నిసిరకంగా నిర్మించిన కారణంగానే కూలుతున్నాయని ఆరోపించారు.

News April 25, 2024

రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన బండలింగాపూర్ వాసి

image

మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన కూకట్ల వేణుగోపాల్, స్రవంతిల కూతురు కూకట్ల వైష్ణవి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి సత్తా చాటింది. 440 మార్కులకు గానూ ఆమె 438 మార్కులు సాధించింది. అలాగే మెట్‌పల్లికి చెందిన ముక్క మృత్యుంజయ్, సంధ్యారాణిల కూతురు ముక్క హర్షిని ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి సత్తా చాటింది. వారిని పలువురు అభినందించారు.

News April 25, 2024

KNR: గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

image

సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 18న అల్పాహారం వికటించడంతో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అభివృద్ధి అధికారి నివేదిక అందించిన ప్రకారం ప్రిన్సిపాల్ అలసత్వం ఉందని ప్రాథమికంగా భావించిన కలెక్టర్ ప్రిన్సిపాల్ ఎస్. సత్య ప్రసాద్ రాజ్‌ను సస్పెండ్ చేశారు.

News April 25, 2024

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫైల్

image

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావును ఆ పార్టీ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించింది. ఆయన తండ్రి జగపతిరావు కరీంనగర్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజేందర్‌ రావు గతంలో కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కొంతకాలం ప్రజారాజ్యం, బీఆర్ఎస్‌లో ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. కాగా రాజేందర్ రావు ఇప్పటికే కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు.

News April 25, 2024

KNR: రేపే బండి సంజయ్ నామినేషన్

image

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రేపు ఉదయం 11.30 గంటలకు కరీంనగర్ ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని SRR కాలేజీ నుంచి గీతా భవన్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధం అయ్యాయి.

News April 25, 2024

KNR: ఈతకు వెళ్లి తండ్రీ కొడుకుల మృతి

image

KNR జిల్లా తిమ్మాపూర్ మండలంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రి కొడుకులు మృతి చెందారు. స్థానికుల ప్రకారం.. వచ్చునూర్ శివారులోని లోయర్ మానేరు డ్యాంలో ఈతకు వెళ్లిన తండ్రి కొడుకులు నీటిలో మునిగి మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గుండ్లపల్లిలోని ఎస్ ఆర్ కే ప్రైవేట్ స్కూల్ యజమాని చాడ రవీందర్ రెడ్డి ఆయన కొడుకుగా అనుమానిస్తున్నారు.

News April 25, 2024

రాజారాం గ్రామంలో యువకుడి మృతదేహం కలకలం

image

యువకుడిని తీవ్రంగా కొట్టి హత్య చేసి నిప్పు పెట్టిన ఘటనా మల్యాల మండలం రాజారాంలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం రాజారాం శివారులో సగం కాలిన యువకుడి మృతదేహం ఉన్నట్లు గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో భార్య జమున మృతదేహాన్ని గుర్తించి తన భర్త మహిపాల్‌దేనని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

ఎల్లారెడ్డిపేట: మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి పై కేసు నమోదు

image

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అమాయక ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడటంతో అతనిపై కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గ్రామానికి చెందిన దీకొండ సునీల్ అనే వ్యక్తి యూనిక్ ఎస్ఎంసిఎస్ అనే సంస్థ పేరుతో 800 మంది వద్ద డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. బాధితులు ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని తెలిపారు.

News April 25, 2024

కొండగట్టు కాషాయమయం.. భారీగా చేరుకున్న భక్తజనం

image

కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి కొండగట్టుకు దీక్షాపరులు, సాధారణ భక్తులు భారీగా చేరుకుంటున్నారు. మంగళవారం రాత్రి కొండపై ఇసుక వేస్తే రాలనంత రద్దీ నెలకొంది. రద్దీని కంట్రోల్ చేయడం కష్టమైంది. స్వామివారి దర్శనం, మాలవిరమణ, కళ్యాణకట్ట వద్ద గంటల సమయం పడుతోంది. ఇప్పటికి రెండు లక్షల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా.