India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. @ తంగళ్ళపల్లి మండలంలో గురుకులాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ మెట్పల్లి మండలం లో బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్పల్లి మండలంలో గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రుల నిరసన. @ కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
హైదరాబాద్ సిటీలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులను హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్ వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లో ప్రజాప్రతినిధులతో గణేష్ ఉత్సవ కమిటీతో మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరులోకి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 7,741 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా నంది, గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేరులోకి ఒక మోటార్ ద్వారా 3000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.900 టీఎంసీలు నీళ్లున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెడికల్ కాలేజీల్లో వసతులు కరువయ్యాయి. కరీంనగర్, సిరిసిల్ల, రామగుండం, జగిత్యాలలో కొత్తగా కాలేజీలు ఏర్పాటయ్యాయి. అయితే, ఎక్కడా కాలేజీలకు సంబంధించిన భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. తరగతులు ఒకచోట, వసతి మరోచోట నిర్వహిస్తున్నారు. హాస్టళ్లు, కళాశాలల్లో సీసీ కెమెరాలు, కళాశాల భవనాలకు ప్రహరీలు లేవు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రుణమాఫీపై అయోమయం నెలకొంది. మండలాల వారీగా లిస్టు రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాఫీ అయినా ఖాతాల్లో జమకాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా, వివిధ సమస్యలతో ఉమ్మడి జిల్లాలో లక్ష మందికి పైగా అన్నదాతలు రుణమాఫీకి దూరమయ్యారు. మొత్తానికి సాంకేతిక కారణాలతో మూడో విడతలోనూ సంపూర్ణంగా జరగలేదన్న వాదన పునరావృతమవుతోంది.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఇచ్చిన పిలుపుమేరకు మంథనిలో బంద్ ప్రారంభమైంది. వాణిజ్య వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. నిత్యవసర వస్తువుల క్రయవిక్రయాలు సజావుగా జరిగాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, అమానుష చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని హిందూ ఐక్యవేదిక బాధ్యులు కొత్త శ్రీనివాస్, కనుకుంట్ల స్వామి అన్నారు.
శ్రీరాంసాగర్ జలాశయంలోకి వరద కొనసాగుతోంది. తాజాగా 4,303 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. కాకతీయ, ఇతర కాలువలు, మిషన్ భగీరథకు కలుపుకొని మొత్తం ఔట్ ఫ్లో 4,303 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటినిల్వ 48.07 టీఎంసీలు ఉండగా, నీటిమట్టం 1081 అడుగులుగా ఉంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల కురిసిన భారీ వర్షం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ ప్రధాని వాజ్ పాయ్ వర్ధంతి. @ దుబాయ్ లో పెద్దపల్లి జిల్లా వాసి మృతి. @ గంభీరావుపేట, కోనరావుపేట, కథలాపూర్ మండలాలలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. @ ధరణి సమస్యలను పరిష్కరించాలన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేపు ప్రవేట్ హాస్పిటల్స్ బంద్.
అంబానీ కుమారుడి పెళ్లి పత్రిక ఆధునికతకు, ఆడంబరానికి నిదర్శనంగా నిలవగా.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుడివెలుగులపల్లి(వెలిచాల)కి చెందిన పోకల మధు పెళ్లి పత్రిక తెలంగాణ పల్లె యాస, భాషకు పట్టం కట్టింది. పల్లె యాస, భాషలో లగ్గం పిలుపు ప్రారంభించి మొత్తం పెళ్లి తంతుకు సంబంధించిన అన్ని పదాలను తెలంగాణ మాండలికంలోనే అచ్చు వేయించారు. ప్రస్తుతం ఈ లగ్న పత్రిక సోషల్ మీడియా వైరల్‌గా అవుతోంది.
బంగ్లాదేశ్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం సిరిసిల్ల నేతన్నలకు అవకాశంగా మారింది. సంక్షోభంతో ఆ దేశంలోని టెక్స్టైల్ రంగంపై ప్రభావం పడింది. అక్కడికి వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చే అంతర్జాతీయ సంస్థలు మనదేశం వైపు చూస్తున్నాయి. చెన్నై, మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత మరమగ్గాలపై వస్త్రోత్పత్తులకు సిరిసిల్ల ప్రసిద్ధిచెందింది. దీంతో ఇక్కడికి ఆర్డర్లు రానున్నట్లు తెలుస్తోంది. కాగా సిరిసిల్లలో 30వేల మరమగ్గాలున్నాయి.
Sorry, no posts matched your criteria.